Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode కనకానికి ట్రీట్మెంట్ జరుగుతుంది. నర్స్ వచ్చి బ్లడ్ కావాలి అంటే విహారి ఇస్తానని వెళ్తాడు. తర్వాత ట్రీట్మెంట్ కావాల్సిన మందులు అన్నీ తీసుకొచ్చి ఇస్తాడు. పేషెంట్‌కి భర్తగా సంతకం పెడతాడు. ఇంతలో ఫ్యామిలీ మొత్తం వస్తారు. లక్ష్మీకి ఎలా ఉందని యమున అడిగితే డాక్టర్ ఏం చెప్పలేదని అంటాడు.
అంబిక మనసులో ఇంకా ఇది చావలేదా అనుకుంటాడు. లక్ష్మీ చావు చూడాలని అనుకుంటే బతికేలా ఉందని పద్మాక్షి అంటుంది. డాక్టర్ వచ్చి లక్ష్మీ కండీషన్ సీరియస్‌గా ఉందని చెప్తారు. యమున, వసుధ కన్నీరు పెట్టుకుంటారు. ఓ మెడిసిన్ చాలా ముఖ్యమని బయట ఎక్కడైనా తీసుకురమ్మని అంటే విహారి పరుగులు పెడతాడు. సహస్ర మనసులో బావ యాక్సిడెంట్ అయిందని తెలిసి వెళ్లాడు. అత్తయ్య ఇంటికి తీసుకొచ్చింది కాబట్టి బాధ పడితే ఒక అర్థముంది బావ ఏంటి ఇంత తపన పడుతున్నారని అనుకుంటుంది. ఇక యమున ఏడుస్తుంటే పద్మాక్షి నువ్వు ఎక్కువ ఏడ్వొద్దు మళ్లీ నీకు ఫిట్స్ వస్తే బెడ్ మీద కెళ్లాల్సి వస్తుంది అని అంటుంది.
అంబిక: అక్క విహారి ఆ లక్ష్మీ కోసం చాలా తపన పడిపోతున్నాడు.సహస్ర: నేను బెడ్ మీద ఉన్నా అంత బాధ పడడేమో. అంబిక: విహారి పడుతున్నా తపనకు మీ అత్తయ్య చేస్తున్న ప్రార్థనలకు ఆ లక్ష్మీ బతికిపోతుంది. మళ్లీ అది ఇంటికి వచ్చి దాని వేషాలు వేస్తుంది. దాని ఆయుష్షు గట్టిది.పద్మాక్షి: మనమే దాన్ని చంపేస్తే. అంబిక ఎంత ఖర్చు అయినా పర్లేదు నేను భరిస్తా. ఏం చేస్తావో చేయ్ ఎంత కావాలో చెప్పు కానీ ఈ రోజు అది ఇక్కడే చావాలి.సహస్ర: అమ్మ చావడం ఏంటి.పద్మాక్షి: నువ్వు సైలెంట్‌గా ఉండు. మీ అత్తయ్య దాన్ని వదలదు. మీ బావని అది వదలదు. మీ పెళ్లికి అదే అడ్డు దాన్ని బలి చేస్తే మీ పెళ్లి సజావుగా సాగుతుంది. అంబిక: మనసులో దాన్ని చంపడం ఇప్పటి వరకు నా లక్ష్యం ఇప్పుడు నువ్వు కలిశావ్. దాన్ని లేపేసి నీ ఖాతాలో వేసేస్తా. రేపు ఏం ప్రాబ్లమ్ అయినా నేను సేఫ్ నువ్వు ఇరుక్కుంటావ్.
డాక్టర్ వచ్చి లక్ష్మీ పరిస్థితి 50, 50 అని చెప్తుంది. మా ప్రయత్నం చేశాం తన బాడీ రెస్పాండ్ అయితే రికవరీ అవుతుందని చెప్తారు. అందరూ లక్ష్మీని చూడటానికి వెళ్తారు. యమున ఏడుస్తుంది. వసుధ, విహారిలు ఏడుస్తారు. నువ్వు బతికి బయటకు రా జీవితాంతం నాతో ఉండు లక్ష్మీ అని బతిమాలుతుంది. తనకేం అవ్వదు అని విహారి అమ్మతో చెప్తాడు. ఇక నర్సు వచ్చి వెళ్లిపోమని చెప్తుంది. విహారి తల్లిని తీసుకొని వెళ్తాడు.
పద్మాక్షి అంబికతో లక్ష్మీని చంపే పని ఎంత వరకు వచ్చిందని అడుతుంది. ఎవరితోనైనా మాట్లాడి చంపేలోపు ప్రాబ్లమ్ అవుతుంది. నేనే చంపేస్తా అంటుంది. ఎందుకు అంత రిస్క్ అని పద్మాక్షి అడుగుతుంది. నేనే చంపేస్తా అని అంబిక అంటుంది. అంబిక అందరినీ ఇక్కడ నుంచి తీసుకెళ్లిపో అంటుంది. పద్మాక్షి అందరినీ వెళ్లిపోదాం అంటుంది. యమున వెళ్లను అంటుంది. సహస్ర బావని పిలుస్తుంది విహారి కూడా రాను అంటాడు. మనం వెళ్దాం పదండి అని విహారి తప్ప అందరినీ తీసుకెళ్తుంది. విహారి దగ్గర పండు ఉండిపోతాడు. పండుతో విహారి నా భార్యని నేను కాపాడుకుంటానని అంటాడు. అంబిక డాక్టర్ అవతారం ఎత్తి లక్ష్మీని చంపడానికి ఓ ఇంజక్షన్ సిద్ధం చేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: నాగవల్లిని దొంగని చేసిన ఉష.. చెల్లికి చీర గిఫ్ట్ ఇచ్చిన సత్యంబాబు!