'శుక్ర', 'మాటరాని మౌనమిది' వంటి వైవిధ్యమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన దర్శక నిర్మాత పూర్వాజ్ (Suku Purvaj). ప్రస్తుతం ఆయన ఓ భారీ సూపర్ హీరో సినిమా తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమా పేరు 'ఏ మాస్టర్ పీస్'. అందులో అరవింద్ కృష్ణ, జ్యోతి పూర్వాజ్, మనీష్ గిలాడ, అషు రెడ్డి, స్నేహ గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పుడీ దర్శక నిర్మాత కొత్త ప్రొడక్షన్ కంపెనీ అనౌన్స్ చేశారు.

జగతి మేడమ్ భర్తే ఈ పూర్వాజ్... టీవీ టు సినిమా!దర్శక నిర్మాత పూర్వాజ్ వెండితెర ప్రేక్షకులకు తెలిస్తే... ఆయన సతీమణి జ్యోతి పూర్వాజ్ బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితురాలు. అసలు పేరు కంటే టీవీ స్క్రీన్ పేరుతో పాపులర్ అయ్యారు. 'గుప్పెడంత మనసు' సీరియల్ విజయంతో ఆమె పేరు జగతి మేడంగా గుర్తు పెట్టుకున్నారు చాలా మంది.

Also Read: 'గుప్పెడంత మనసు' టీంకి ఫెయిర్‌ వెల్‌ - జగతి మేడం కూడా వచ్చేసింది, అతి త్వరలోనే శుభం కార్డు!

జ్యోతి పూర్వాజ్ అలియాస్ జగతి మేడంను టీవీ నుంచి వెండితెరకు తీసుకు వెళ్లినది భర్త సుకు పూర్వాజ్. 'ఏ మాస్టర్ పీస్' చిత్రీకరణలో వాళ్లిద్దరూ ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. వివాహమైన తర్వాత పూర్వాజ్ కొత్త ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు. 'శుక్ర', 'మాటరాని మౌనమిది', 'ఏ మాస్టర్ పీస్' చిత్రాల నిర్మాణంలో పూర్వాజ్ కూడా భాగస్వామిగా ఉన్నారు. అయితే... తాజాగా ఆయన 'థింక్ సినిమా' ప్రొడక్షన్ హౌస్ అనౌన్స్ చేశారు. 

ఎందుకీ 'థింగ్ సినిమా'? పూర్వాజ్ ప్లాన్ ఏమిటి?థింక్ సినిమా సంస్థ ద్వారా కంటెంట్ బేస్డ్,గుడ్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని, ప్రేక్షకులకు అందించాలని భావిస్తున్నట్టు దర్శక నిర్మాత పూర్వాజ్ తెలిపారు. థింక్ సినిమా సంస్థలో మొదటి సినిమా ఈ ఏడాదిలో ప్రారంభించి, వచ్చే ఏడాది జూలైలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని పూర్వాజ్ తెలిపారు.

Also Read: 'సరిపోదా శనివారం'కు హిట్ టాక్... కానీ దసరా రికార్డ్ సేఫ్... ఫస్ట్ డే ఏ సినిమాకు ఎంత కలెక్షన్స్ వచ్చాయంటే?

ఇంకా దర్శక నిర్మాత పూర్వాజ్ మాట్లాడుతూ... ''ఇంతకు ముందు మేం పలు పైలట్ ఫిలింస్, వెబ్ మూవీస్ చేశాం. మూడు సినిమాల నిర్మాణంలో భాగం అయ్యాం. 'శుక్ర', 'మాటరాని మౌనమిది', 'ఏ మాస్టర్ పీస్' తీసిన అనుభవంతో సొంత నిర్మాణ సంస్థ 'థింక్ సినిమా'ను ప్రారంభిస్తున్నా. కంటెంట్ రిచ్ సినిమాలతో ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకునే దిశగా మేం కృషి చేస్తాం'' అని అన్నారు.

Also Readఅన్నయ్యా... అన్నయ్యా... అన్నయ్యా... నీది మాములు విలనిజం కాదన్నయ్యా... ఎస్.జె. సూర్య బెస్ట్ విలన్ రోల్స్‌