జానకి మల్లిక దొంగ కడుపు తెలుసుకుని కోపంగా ఉంటుంది. తన దగ్గరకి వెళ్తుంటే గదిలో అఖిల్ నిద్రపోవడం కనిపించి ఆగిపోతుంది. వేరు కాపురం పెట్టాలనే ఉక్రోషం అయితే వస్తుంది కానీ సొంతంగా కాళ్ళ మీద నిలబడాలనే ఆలోచన రాదా.. బారెడు పోద్దేక్కినా కూడా ఎలా నిద్రపోతున్నాడో అని వచ్చి అఖిల్ ని నిద్రలేపుతుంది జానకి. పిలుస్తున్న కూడా వినిపించుకోకుండా దుప్పటి ముసుగుకప్పి నిద్రపోతుంటే గట్టిగా అఖిల్ అని పిలిచి దుప్పటి తీస్తుంది. అప్పుడే జెస్సి కూడా గదిలోకి వస్తుంది. సోమరిపోతులాగా నిద్రపోతే తమరి జీవితానికి మేల్కోలుపు ఎప్పుడు, ఇలా పడుకోవాడమేనా జీవితం గురించి ఆలోచించేది ఏమైనా ఉందా? పౌరుషానికి పోయి వేరు కాపురం పెడతాను అన్నావ్.. నిజంగా వేరు పడి ఉంటే పరిస్థితి ఏంటి? తన కడుపులో బిడ్డ పరిస్థితి ఏంటి? మాట విసరడం నిర్ణయం తీసుకోవడం చాలా తేలిక అని క్లాస్ పీకుటుంది.


అక్క చెప్పింది నిజమే కానీ బిడ్డ పుట్టిన  తర్వాత మన పరిస్థితి ఏంటి అని జెస్సి కూడా అంటుంది. ఇలా మాటలు పడకూడదు అంటే ఏదో ఒకటి చేసి డబ్బు సంపాదించి వీళ్ళ నోరు మూయించాలి అని అఖిల్ అనుకుంటాడు. మల్లిక పాటలు వింటూ డాన్స్ వేస్తూ ఉంటుంది. జానకి తన దగ్గరకి కోపంగా రావడం చూసి ఎగరడం ఆపుతుంది. జానకి ఏంటి నా గదిలోకి వస్తుందని అనుకుంటుంది. ఏంటి జానకి ఇలా వచ్చావ్ అని అడుగుతుంది.


Also read: రేస్ మొదలు పెట్టిన తులసి- అండగా నిలిచిన సామ్రాట్


జానకి: ఇందాక నువ్వు నీలావతి పిన్నీతో ఏం మాట్లాడవో తెలుసుకుందామని వచ్చాను


మల్లిక: నావి మాటలు కాదు గోడు, ఇంట్లో నా బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక నీలావతి పిన్నికి చెప్పుకుంటున్నా. వేరు కాపురం పెడదామని అనుకుంటే జరగకుండా చేశావ్ అదే చెప్పుకుంటున్నా. నువ్వు తెలివైన దానివే కాదు పెద్ద జాదువి. పోలేరమ్మ వీక్ నెస్ అడ్డం పెట్టుకుని ఇటు నీ పబ్బం గడుపుకుంటున్నావ్. గర్భవతి అయిన నా ఆశ పట్టించుకోకుండా నీ స్వార్థం కోసం చూసుకుంటున్నావ్. ఈ కుటుంబానికి నీకు నాది, నా కడుపులో బిడ్డ ఉసురు తగలకుండా పోదు అని వాగుతుంటే జానకి చెంప పగలగొడుతుంది.


నా మీదే చెయ్యి చేసుకుంటావా నీ గురించి పోలేరమ్మకి చెప్తాను అని ఆవేశంగా వెళ్తుంటే చెప్పు నీది దొంగ కడుపు అని నేను చెప్తాను అని జానకి అంటుంది. ఆ మాటకి మల్లిక బిత్తరపోతుంది. నాది దొంగ కడుపు ఏంటి అని నీళ్ళు నములుతుంది. నువ్వు నీలావతితో మాట్లాడింది విని నేను కన్ఫామ్ చేసుకున్నా అని అంటుంది. నేను ప్రెగ్నెంట్ అనేది నిజం అని మల్లిక బుకాయిస్తుంది. డాక్టర్ వస్తే నీది దొంగ కడుపు అఈ ప్రూవ్ అవుతుందని జానకి చెప్తుంది. అత్తయ్యగారి ఎమోషన్ తో ఆడుకుంటున్నావ్, నీ భర్తని పిచ్చి వాడిని చేశావ్, ఇంట్లో అందరి ఎమోషన్స్ తో ఆడుకున్నదే కాక కుటుంబాన్ని విడగొట్టాలని చూశావ్ అని జానకి కోపంగా తిడుతుంది.


ఈ విషయం ఎవరికి చెప్పొద్దు జానకి అని మల్లిక చేతులు పట్టుకుని బతిమలాడుతుంది. ఇప్పటికే నువ్వు చేసిన తప్పులు కవర్ చేసి తప్పు చేశాను ఈరోజూ అత్తయ్యగారికి చెప్పి నీకు శిక్ష పడేలా చేస్తాను అనేసి జానకి వెళ్ళిపోతుంది. అఖిల్ డబ్బు సంపాదించడం కోసం తన ఫ్రెండ్ దగ్గరకి వస్తాడు. మాల్ అమ్మితే తను కూడా డబ్బు సంపాదించుకుంటాడని అఖిల్ ఫ్రెండ్ ఇంకొక వ్యక్తితో చెప్తాడు. మాల్ అమ్మడం అంత తేలిక కాదు అది నేరం దొరికితే లైఫ్ లాంగ్ జైల్లోనే అని అంటాడు. అలాంటివి అమ్మాలా నా వల్ల కాదని అఖిల్ అంటాడు. కానీ తన ఫ్రెండ్ మాత్రం అఖిల్ ని కన్వీన్స్ చేసేందుకు ట్రై చేస్తాడు. డబ్బు ఆశ చూపించి అఖిల్ ని ఒప్పిస్తాడు.


Also Read: పశ్చాత్తాప్పడిన వసు- పూల వర్షం కురిపించుకున్న ప్రేమపక్షులు, పట్టరాని సంతోషంలో రిషి


జ్ఞానంబ కోపంగా మల్లికని పిలుస్తుంది. జానకి చెప్పింది నిజమేనా అని అడుగుతుంది. నువ్వు నిజంగా గర్భవతివి కావా అని ప్రశ్నిస్తుంది. ఆ మాటకి ఇంట్లో అందరూ షాక్ అవుతారు. నేను మిమ్మల్ని మోసం చేస్తానా అని మల్లిక డ్రామా మొదలుపెడుతుంది. జానకి కావాలని లేనిపోనివి కల్పించి చెప్తుందని మల్లిక అంటుంది. హాస్పిటల్ కి వెళ్దాం పద జ్ఞానంబ అంటుంది.


తరువాయి భాగంలో..


ముందు అయితే నాకు కడుపు వచ్చిందని అనుకున్నా తర్వాత కొన్ని రోజులకి కడుపు కాదని తెలుసుకున్నా అనేసరికి విష్ణు కోపంగా మల్లికని వెళ్లిపొమ్మని చెప్తాడు. మీ అమ్మానాన్నని తీసుకుని రా అప్పుడే మాట్లాడతాను అని అంటాడు.