మా సంపాదన ఇంట్లో వాడి మీ డబ్బులు బ్యాంక్లో దాచుకుంటున్నారా అని మల్లిక జానకి, రామాని అవమానిస్తుంది. మేము ఎప్పుడైనా డబ్బులు దాచుకున్నానా అని జానకి అంటుంది. నేను మీ మాటలు నమ్మి మోసపోను అని మల్లిక చెప్తుంది. వదిన అలా మాట్లాడుతుంటే నువ్వు సైలెంట్ గా ఉంటున్నావ్ ఏంటి అని వెన్నెల విష్ణుని అడుగుతుంది. ఏం మాట్లాడతాడు వాళ్ళ నిజస్వరూపం ఎంతో వీడియో రూపంలో చూసిన తర్వాత ఇంక ఏం మాట్లాడతాడు అని జానకి రామా కలిసి డబ్బులు బిరువాలో పెట్టిన వీడియో అందరికీ చూపిస్తుంది. జానకి తప్పుగా అర్థం చేసుకుంటున్నావ్ అని మాట్లాడుతుంటే కళ్ళ ముందు కనిపిస్తుంటే కారణం చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నావా అని అఖిల నోరు పారేసుకుంటాడు.


కారణం తెలుసుకోకుండా నువ్వు అలా మాట్లాడతావెంటీ అఖిల్ అని రామా అనేసరికి వాడి మీద ఎందుకు అరస్తున్నావ్ అన్నయ్య వదిన చెప్పడం వల్లో లేదంటే ఏమో కానీ నీలో చాలా మార్పు వచ్చింది. ఎప్పుడు ఎవరిని మాట అనని నువ్వు వదిన మాటలు నమ్మి మల్లికని తిట్టావని చెప్తే నేను నమ్మలేదు కానీ ఈ వీడియో చూసిన తర్వాత నీ స్వార్థం నాకు అర్థం అయ్యిందని విష్ణు అంటాడు. హమ్మయ్య అగ్గిపుల్ల గీశాను మంట అంటుకుందని మల్లిక సంబరపడుతుంది. మల్లిక నీకు చెప్పింది వీడియోలో కనిపించింది అబద్ధం అని రామ అంతే మేము మాత్రమే అబద్ధమా అని అఖిల్ కూడా వాగుతాడు. మాకు నీతులు చెప్పే మీరు మాకు తెలియకుండా డబ్బులు దాచుకుంటే ఏమంటారు అని నిలదీస్తాడు. అప్పుడే జ్ఞానంబ వచ్చి అరుస్తుంది.


Also read: నీ తప్పులు అయిపోయాయ్ క్షమించేదే లేదన్న తులసి- సామ్రాట్ ని ఏకిపారేసిన లాస్య


ఒకరిని మాట అనే ముందు మన అర్హత ఏంటో తెలుసుకోవాలి అని జ్ఞానంబ అంటుంది. కుటుంబాన్ని ప్రేమించడం, మన కోసం కష్టపడటం తప్ప వేరే ధ్యాస లేని వాడిని తప్పు పట్టే స్థాయికి ఎదిగారు. తండ్రి కోసం చదువు త్యాగం చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి దాకా వాడి సంతోషం చూసుకోకుండా కష్టపడుతూనే ఉన్నాడు. ఏమన్నావ్ విష్ణు వాళ్ళది స్వార్థమా.. నీ షాపు బాగు చేయించడం కోసం ప్రతి నెల తన చెమటోడ్చి కష్టపడిన సంపాదనలో కొంత మొత్తం పక్కకి తీసిపెట్టడు. అందుకు జానకి అండగా ఉండదు. వాళ్ళు వాళ్ళ మంచి కోసమే ఆలోచిస్తే మీ సంపాదన ముట్టుకోవద్దని అవకాశం వచ్చినప్పుడల్లా చెప్తాడు. ఏమన్నావ్ అఖిల్ నీతులు చెప్తూ వాళ్ళు పాటించారని అంటావా. నీ కోసం కనీసం చొక్కా కూడా కొనుక్కోకుండ ఆ డబ్బులు నీ ఫీజు కోసం ఇచ్చాడు. జానకి ఇంటి పరువు కోసం ఆరాటపడుతుంది. తాను బాధపడుతుందే కానీ తన స్వార్థం కోసం ఆలోచించడం ఎప్పుడు నేను చూడలేదని అంటుంది.


మీరు ఇద్దరు కడుపుతో ఉన్నారని మీకోసం తను తాపత్రాయపడుతుంది. అలా జాగ్రత్తలు తీసుకుంటున్న వాళ్ళని చులకన చేసి మాట్లాడతారా అని జ్ఞానంబ కోపంగా అరుస్తుంది. జానకి, రామా వల్లే మనం సంతోషంగా ఉన్నామని గుర్తుపెట్టుకోమని గోవిందరాజులు చెప్తాడు. అలా మిమ్మల్ని భ్రమలో ఉంచారు, కావాలంటే ఈ వీడియో చూడమని మల్లిక చూపిస్తుంది. ఇది చూసి వాళ్ళని తప్పు పడుతున్నారంటే ఏమనుకోవాలి. అసలు ఆ డబ్బులు అని జ్ఞానంబ చెప్పబోతుంటే రామా ఆపేస్తాడు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయ్ దయచేసి గొడవలు వద్దని బాధగా చెప్తాడు. మల్లిక మాత్రం వాళ్ళని తప్పు పడుతూనే ఉంటుంది. మేము తప్పు చేస్తే శిక్ష వేస్తారు కానీ వాళ్ళని మాత్రం మందలించి వదిలేస్తారు. ఇలాంటి విలువ లేని ఇంట్లో మేము ఉండలేము వేరేగా వెళ్లిపోతాము అని మల్లిక చెప్పేస్తుంది. ఆ మాటకి ఇంట్లో అందరూ షాక్ అవుతారు. విష్ణు కూడా మల్లికకి వంత పాడతాడు.


Also read: మళ్ళీ కనిపించకుండా పోయిన దేవి- బిడ్డని ఆదిత్యకి ఇవ్వనన్న రుక్మిణి


అఖిల్ కూడా అదే మాట చెప్తాడు. కలిసి ఉండటంలో ఉండే సంతోషం విడిగా ఉంటే దొరకదు అర్థం చేసుకో అని జెస్సి నచ్చజెప్పడానికి చూస్తుంది. ఏమైంది మీకు మీ మీద మేము ప్రేమ చూపిస్తున్నాం అనుకున్నాం కానీ బాధపెడుతున్నాం అనుకోలేదు. దయచేసి విడిపోదామని మాత్రం అనొద్దు. మీరు చెప్పినట్టే మేము వింటాము అందరం కలిసే ఉందామని జానకి వేడుకుంటుంది. ఇక నీ నటన చాలు ఇలా చేసే అత్తయ్యగారి దృష్టిలో మమ్మల్ని చెడ్డ వాళ్ళని చేశావ్ అని మల్లిక అంటుంది. ఈరోజి నుంచి ఎవరి వాటాలు వాళ్ళవి ఎవరి కాపురాలు వాళ్ళవి అని జ్ఞానంబ చెప్పేస్తుంది.