ఇంట్లో వాళ్ళు సత్య ఎక్కడికి వెళ్ళిందా అని అనుకుంటారు. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళదు నాకు చెప్పకుండా అసలు వెళ్ళదు అని దేవుడమ్మ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఆదిత్య, సత్య వేర్వేరు కారుల్లో ఇంటికి వస్తారు. ఎక్కడికి వెళ్లారమ్మ అని రాజమ్మ సత్యని అడుగుతుంది. ఆదిత్య ఏమి మాట్లాడకుండా లోపలికి వెళ్తే తన వెనుకే సత్య కూడా వెళ్ళిపోతుంది. రుక్మిణి ఆదిత్య మాటలు తలుచుకుని కుమిలికుమిలి ఏడుస్తుంది. భాగ్యమ్మ వచ్చి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావ్ అని అడుగుతుంది. ఆ మాధవ్ గాడు ఏమైనా అన్నాడా అని అడుగుతుంది. మాధవ్ సారు కాదమ్మా పెనిమిటి అన్నాడాని జరిగిందంతా తల్లికి చెప్తుంది. పటేల్ అట్లా మాట్లాడుడు ఏంటి ఏమైంది, ఏ పొద్దు ఎవరిని ఒక మాట అనలేదు అని భాగ్యమ్మ అంటుంది.
ఏది ఉన్నా నేను చేసిన త్యాగం తప్పు అయింది, నా చెల్లి నన్ను తప్పుగా అర్థం చేసుకుంది. సత్య కాపురం కూల్చాలి అనుకుంటే పదేళ్ళు ఎందుకు దూరంగా ఉంటాను. నా పెనీమిటిని బాధపెట్టాలని అనుకుంటే కనిపించకుండా ఎందుకు కనిపించకుండా ఉంటాను. నా బిడ్డని ఆ ఇంటికి చేర్చాలని అనుకోవడం నా తప్పా. ఇక నా బిడ్డని ఎవరికి ఇవ్వను నేనే సాకుతాను అని రుక్మిణి బాధగా అంటుంది. ఆదిత్య సత్య, రుక్మిణిలతో జరిగిన సంఘటనలు తలుచుకుని బాధపడుతూ ఉంటాడు. రుక్మిణి, సత్యలు ఇద్దరు కలిసి నన్ను ఫూల్ ని చేశారు, నన్ను ఆడుకున్నారు ఫీల్ అవుతాడు. వెంటనే దేవి గుర్తుకు వస్తుంది.
Also Read: వేద జీవితంలోకి ఉపద్రవం- ఇంట్లో వాళ్ళకి అబద్ధం చెప్పి కుమిలిపోతున్న యష్
రుక్మిణి జానకమ్మ దగ్గరకి వస్తుంది. గదిలో ఉన్న నగలు తీసుకుని వెళ్లిపొమ్మని సైగ చేస్తుంది. అది చూసి రుక్మిణి ఎమోషనల్ అవుతుంది. నేను ఇంట్లో నుంచి వెళ్ళే రోజు వచ్చింది, నా బిడ్డని తీసుకుని పోతాను అలా అని నిన్ను వదిలిపోలేను, మీ మంచి మనసుకి నేను ఏమిచ్చి రుణం తీర్చుకొను. మీరు ముందు మంచిగా కావాలి అప్పటిదాకా మిమ్మల్ని వదిలి వెళ్లను. నేను లేకున్నా మీకు నయం అయ్యేదాక నిన్ను మా అమ్మ దగ్గరుండి చూసుకుంటుందని చెప్తుంది. ఇన్ని సంవత్సరాలు మీరు నా బిడ్డని మీ బిడ్డగా చూశారు.. ఇలా అయినా మీ రుణం తీర్చుకుంటాను అని భాగ్యమ్మ చెప్తుంది. అప్పుడే జానకమ్మకి భాగ్యమ్మ తన తల్లి అని చెప్తుంది. నగలు తీసుకుని మీరు వెళ్లిపోండి అని జానకమ్మ సైగ ద్వారా చెప్తుంది. వద్దు నేను ఎక్కడ ఉన్న మంచిగా ఉండాలని ఆశీర్వదించండి చాలు అని రుక్మిణి కాళ్ళ మీద పడుతుంది. జానకి తన చేత్తో ఆశీర్వదిస్తుంది. చెయ్యి కదలడం చూసి రుక్మిణి చాలా సంతోషిస్తుంది.
సత్య జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటే దేవుడమ్మ వస్తుంది. ‘మీ జీవితాన్ని మీరే నలిపేసుకుంటున్నారు. మన జీవితాన్ని అందంగా మలుచుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. ఇలా బాధపడితే ఎలా చెప్పు. ఇది నీ జీవితం రుక్మిణి తన కష్టంతో ఇంత దాన్ని చేసింది. తన కష్టంతో నీకు సుఖాన్ని ఇవ్వాలని తాపత్రాయపడింది. మీ ప్రేమ తెలిసి తనే జీవితాన్ని త్యాగం చేసింది. ఎవరి త్యాగం వృధా కాకూడదు’ అని హితబోధ చేస్తుంది. ఇంట్లో దేవి కోసం చిన్మయి వెతుకుతూ ఉంటుంది. దేవి కనిపించడం లేదని రుక్మిణికి వచ్చి చెప్తుంది. ఎంత వెతికినా కనిపించదు. అప్పటిలాగా మళ్ళీ దేవి ఎక్కడికైనా వెళ్లిపోయిందా అని చిన్మయి అంటుంది.
Also Read: లాస్యని ఆఫీసు నుంచి గెంటేసిన సామ్రాట్- తులసికి మళ్ళీ పట్టాభిషేకం, అపార్థం చేసుకున్న అనసూయ