తప్పు చేసిన వాళ్ళని తన భర్త ఎట్టి పరిస్థితిలోనూ వదిలిపెట్టడని వేద ఇంట్లో వాళ్ళకి చాలా నమ్మకంగా చెప్తుంది. కానీ యష్ మాత్రం మాళవిక మీద పోలీసులకి కంప్లైంట్ ఇవ్వనని ఆదికి చెప్తాడు. సులోచనకి మాట ఇచ్చిన సంగతి గుర్తు చేసుకుని యష్ చాలా బాధపడతాడు. సులోచన వేద గురించి టెన్షన్ పడుతుంది. ఈరోజు నీ రాశిఫలాలు చదివాను. అప్పుడు కూడా ఒకసారి నీ జాతకం ప్రకారం నీ జీవితంలోకి ఎవరో ఒక వ్యక్తి రాబోతున్నారని గతంలో చెప్పాను. అప్పుడు నమ్మలేదు, నేను చెప్పినట్టే జరిగింది. నీ జీవితంలోకి ఖుషి వచ్చింది తన మీద ప్రేమ కలిగింది. ఆ ఆరోజు లాగా ఈరోజు కూడా నీ జాతకం చదివాను. నీకు పెద్ద సమస్య రానుంది. అది నిన్ను చాలా బాధపెట్టబోతుంది. చాలా భయంగా ఉందని సులోచన తన మనసులో బాధ వేదకి చెప్తుంది.


ఇప్పుడు నీ భయం చూస్తుంటే నాకు భయంగా ఉంది ఏదో ఉపద్రవం రాబోతుందని నాకు అనిపిస్తుందని వేద మనసులో అనుకుంటుంది. పైకి మాత్రం ఏ తుఫాను నన్ను ఏమి చేయలేదని సులోచనకి ధైర్యం చెప్తుంది. మాళవిక వచ్చి యష్ ని పట్టుకుని ఆదిని విడిచి నేను ఉండలేను అని ఏడుస్తుంది. ఆదికి ఏమి కాదని యష్ అంటాడు.. కానీ మాళవిక మాత్రం ప్రామిస్ తీసుకుంటుంది. యష్ ఆది మాటలు గుర్తు చేసుకుని బాధగా మాళవికకి ప్రామిస్ చేస్తాడు. అభిమన్యుని అరెస్ట్ చేయించడానికి వెళ్ళాను కానీ అరెస్ట్ చేయించలేదని తెలిస్తే వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు. ఇప్పుడు ఆది కోసం నేను మాళవికని కాపాడాలి. జరిగింది తెలిస్తే వేద ఎలా రియాక్ట్ అవుతుందని యష్ ఆలోచిస్తూ ఉంటాడు.


Also Read: లాస్యని ఆఫీసు నుంచి గెంటేసిన సామ్రాట్- తులసికి మళ్ళీ పట్టాభిషేకం, అపార్థం చేసుకున్న అనసూయ


యష్ దాని గురించే ఆలోచిస్తూ ఇంట్లోకి రాగానే వేద ఎదురుపడి వాళ్ళని పోలీసులు పట్టుకున్నారా అని అడుగుతుంది. మనమే పొరపాటు పడ్డాను వాళ్ళ తప్పేమీ లేదని యష్ చెప్తాడు. వాళ్ళు ఆ కారు యాక్సిడెంట్ కి ముందే ఎప్పుడో అమ్మేశారంట అని అబద్ధం చెప్తాడు. కానీ వేద వాళ్ళ అక్క చిత్ర మాత్రం అది అబద్ధం ఏమో అని అంటుంటే వేద అడ్డుపడి ఆపుతుంది. సోరి నాకు తెలియకుండా ఇంట్లో వాళ్ళకి నేనే నమ్మకంగా చెప్పాను అని వేద అంటుంది. అమ్మకి అలా జరగడం పట్ల మీరే ఎక్కువగా ఫీల్ అవుతున్నారని నాకు తెలుసు మీ మీద మా అందరికీ పూర్తి నమ్మకం ఉంది. అమ్మకి యాక్సిడెంట్ చేసిన వాళ్ళు దొరికితే ఎలాంటి పరిస్థితిలోని విడిచిపెట్టరు నాకు ఆ నమ్మకం ఉందని వేద చెప్తుంది.


ఆ మాటకి యష్ మనసులోని కుమిలిపోతాడు. నన్ను క్షమించు వేద నీకు నిజం చెప్పలేకపోతున్నా అని బాధపడతాడు. సులోచన యష్ చేతిని పట్టుకుని ఎమోషనల్ అవుతుంది. నాకోసం మీరు ఎంతో తాపత్రయపడ్డారు, ఎంతో కష్టపడి నా ప్రాణాలు కాపాడావు. నువ్వు నా అల్లుడివి కాదు నా కొడుకువి అని ఎమోషనల్ గా మాట్లాడుతుంది. యష్ మూడీగా ఉండటం గమనించిన వేద ఎందుకు ఆయన అలా ఉన్నారు అని ఆలోచిస్తుంది.


Also read: అక్కాచెల్లెళ్ల త్యాగాల మధ్య నలిగిపోతున్న ఆదిత్య ఊహించని నిర్ణయం- ఆందోళనలో దేవుడమ్మ