కొత్త చిన్న ఇంట్లో ఒకే బాత్ రూమ్ ఉండటంతో జెస్సి వెళ్తుంది. బయట మల్లిక కాలు కాలిన పిల్లి తిరిగినట్టు తిరుగుతుంది. చికిత వచ్చి కాసేపు మల్లికని ఆడుకుంటుంది. రామా జానకి దగ్గరకి వచ్చి త్వరగా టిఫిన్ పెట్టమని షాపుకి వెళ్ళాలని అంటాడు. ఏ షాపుకి అనేసరికి అప్పుడు తనకి విషయం గుర్తుకు వచ్చి పని కోసం వెతుక్కోవాలి కదా అని తినకుండానే వెళ్ళిపోతాడు. జ్ఞానంబ బాధగా కూర్చుని ఉంటే జానకి వచ్చి పలకరిస్తుంది. కానీ జ్ఞానంబ మాట్లాడకుండా వెళ్లిపోతుంటే జానకి తనని పిలుస్తూ వెళ్తుంది.
Also Read: రిషి నిర్ణయం విని షాకైన దేవయాని- వసుని ప్రేమని అంగీకరించి పెళ్లిచేసుకోమన్న చక్రపాణి
జానకి: మేము తప్పు చేశాం అనిపిస్తే కొట్టండి, ఇలా మీరు మౌనంగా ఉంటే మాకు ఇంకా నరకంగా ఉంది. కోడలు కూడా కూతురుతో సమానం అని మీరే అన్నారు. మరి కూతురు తప్పు చేస్తే ఇలాగే దూరం పెడతారా. అమ్మ కోపం ఆశీర్వాదం కావాలి కానీ శాపం కాకూడదు. మిమ్మల్ని చూసి ధైర్యంగా ఉంటాం మరి మీరే దూరం పెడితే మేము ఏమైపోవాలి. మేం తప్పు చేశాం అని మాతో మాట్లాడటం కూడా మానేశారు. మంచి చేస్తే ఇలా చెడు అవుతుందని ఆయనకి తెలియదు కదా, తెలిస్తే ఇలా అయ్యేది కాదు. తమ్ముడు జీవితం బాగుండాలని అలా చేశారు. ఆయన చేసిన పని వల్ల కుటుంబం బాధపడుతుంది కానీ ఏరోజు మిమ్మల్ని దూరం చేసుకునే తప్పు అయితే చేయరు. తప్పుని శిక్షించాలి కానీ పొరపాటుని కాదు. మీరు ఆయనతో నవ్వుతూ మాట్లాడండి పోయిన వాటికి రెట్టింపు సంపాదిస్తారు. ఆయనకి నలుగురు అవసరం లేదు మీరు ఉంటే చాలు అర్థం చేసుకోండి అని బతిమలాడుతుంది.
Also Read: సౌందర్యకి నిజం చెప్పిన మోనిత- కార్తీక్ కి రెండో పెళ్లి చేస్తానన్న దీప
చికిత కాఫీలో చక్కెరకి బదులు నూక వేస్తుంది. అది చూసి జ్ఞానంబ నవ్వుతుంది. చాలా రోజుల తర్వాత జ్ఞానంబ నవ్వడంతో అందరూ సంతోషిస్తారు. మల్లిక వచ్చి కాఫీలో చక్కెర వేయలేదని మళ్ళీ చికిత చేతిలోని డబ్బా తీసుకుని చక్కెర అనుకుని వేసుకుని తాగుతుంది. రామా రోడ్డు మీద వెళ్తుంటే తన స్వీట్ షాపుకి ఉన్న జ్ఞానంబ పేరు తీసేస్తుంటే వద్దని బతిమలాడతాడు. దీంతో అదే పేరు ఉంచుతారు.. జానకి ఓ వైపు ఇంట్లో పనులు చేసుకుంటూనే స్టవ్ దగ్గర నిలబడి చదువుకుంటూ ఉంటుంది. అది చూసి గోవిందరాజులు బాధపడతాడు. రామా గురించి గోవిందరాజులు మాట్లాడుతుంటే జ్ఞానంబ మాట దాటేస్తుంది. అవసరం లేని విషయాల గురించి మాట్లాడుకోవడం అంత మంచిది కాదని అంటుంది.
గోవిందరాజులకి మందులు అయిపోవడంతో జ్ఞానంబ తీసుకురమ్మని చికితని పిలుస్తుంది. జానకి వచ్చి తను తీసుకొస్తాను అనేసరికి ఆ చీటిని తన చేతికి ఇవ్వకుండా టేబుల్ మీద పెట్టేస్తుంది. అది చూసి జానకి చాలా బాధపడుతుంది. రామాతో మాట్లాడటం లేదు జానకి ఏం చేసిందని అడుగుతాడు. వాడిలో సగం మాత్రమే కాదు వాడి తప్పులో కూడా సగం అయ్యింది కదా అని అంటుంది. జానకి మందులు తీసుకుందామని డబ్బుల కోసం చూసేసరికి ఉండవు.
తరువాయి భాగంలో..
విష్ణు బయటకి వెళ్తుంటే జానకి ఆ చీటిని ఇచ్చి డబ్బులు ఉంటే మందులు తీసుకొస్తావా అని అడుగుతుంది. మీ దగ్గర లేని డబ్బులు మాదగ్గర ఎక్కడ ఉంటాయని మల్లిక అంటుంది. షాపు ఉంది కదా అని జానకి అంటే అసలు షాపు లేదని మల్లిక నోరు జారుతుంది. షాపు లేకపోవడం ఏంటని జ్ఞానంబ అడుగుతుంది.