లాస్య కోపంగా తన రూమ్ కి వచ్చి అర్జెంట్ గా ఉత్తమ ఇల్లాలిగా మారాలి అనేసరికి నందు బిత్తరపోతాడు. ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది, అంత కోరిక ఎందుకు పుట్టిందని అడుగుతుంది. ఉత్తమ ఇల్లాలు అవడానికి షార్ట్ కట్స్ చెప్పమని అంటుంది.


లాస్య: అసలు ఉత్తమ ఇల్లాలు అంటే ఏంటి


నందు: ఉత్త ఇల్లాలిగా మిగలకుండా ఉండటమే ఉత్తమ ఇల్లాలు అనేసరికి క్లారిటీగా చెప్పమని అంటుంది. ఇంట్లో వాళ్ళందరికీ దగ్గర అవడం కావాలని అనేసరికి నందు మళ్ళీ షాక్ అవుతాడు. పొద్దున్నే ఐదు గంటలకి నిద్ర లేచి ఇంటి ముందు ఊడ్చి ముగ్గులు వేసి, స్నానం చేసి దేవుడు ముందు దీపం పెట్టడం ఇంటి ఇల్లాలి ఉత్తమ లక్షణం. ఏడు గంటలకి బ్రేక్ ఫాస్ట్ చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టి తర్వాత వంట పని చేసుకోవాలి. ఇంట్లో ఎన్ని పనులు ఉన్నా మధ్యలో అత్తమామలకి సేవలు చేసి వాళ్ళకి కాసేపు కబుర్లు చెప్పాలి. ఎవరికి ఏ అవసరం వచ్చినా ముందుండాలి. ఎవరికి ఏం కావాలో అడిగి మరీ తెలుసుకుని వండాలి. అందరి కంటే ముందు లేచిన నువ్వు అందరూ పడుకున్న తర్వాత తలుపులు వేసి పడుకోవాలి’ అని చెప్తాడు. ఆ మాట విని తులసిలాగా మారాలా అని లాస్య అంటుంది. ఇంట్లో వాళ్ళకి దగ్గర అవాలంటే తులసిలా మారక తప్పదా అని అనుకుంటుంది.


Also Read: రిషి నిర్ణయం విని షాకైన దేవయాని- వసుని ప్రేమని అంగీకరించి పెళ్లిచేసుకోమన్న చక్రపాణి


తులసిలా నడవటం, మాట్లాడటం ప్రాక్టీస్ చేస్తుంది లాస్య. తులసి వంట చేసి అందరినీ భోజనానికి పిలుస్తుంది. అది విని లాస్య వామ్మో ఉత్తమ ఇల్లాలి పేరు కొట్టేస్తుందని వచ్చి తులసిని కూర్చోమని చెప్పి తను అందరికీ వడ్డిస్తాను అంటుంది. తన చీర కొంగుతో తులసి చెమట తుడిచి మరి అన్ని చూసుకుంటానని చెప్తుంది. అది చూసి అందరూ బిత్తరపోతారు. ఆత్రంగా వడ్డిస్తూ సాంబార్ కాస్త నందు మీద పోసేస్తుంది లాస్య. ఉత్తమ ఇల్లాలు అవకుండా నువ్వే అడ్డుపడుతున్నావ్ అని లాస్య అంటుంది. ముందు పనులు చేయడం నేర్చుకో తర్వాత ఉత్తమ ఇల్లాలు అవుతావ్ అని నందు గాలి తీసేస్తాడు.


తులసి సామ్రాట్ ఎదురుగా కూర్చుని పని చేసుకుంటూ ఒక్కసారిగా నవ్వుతుంది. అది తనని చూసేమో అని సామ్రాట్ అడుగుతాడు. ఇంట్లో లాస్య చేసే పనులు చూసి నవ్వు వచ్చిందని చెప్తుంది. ఇంటి విషయాల గురించి కాసేపు మాట్లాడుకుంటారు. దివ్య పెళ్లి చేయాలని అంటుంది. ఎటువంటి లోటు లేకుండా తన సంపాదనతో పెళ్లి చేయడం మరొక లక్ష్యం అని అంటుంది. సామ్రాట్ చేసే కొత్త ప్రాజెక్ట్ బాధ్యతలు తులసికి అప్పగిస్తాడు. అందులో లాభాలు ఫిఫ్టీ ఫిఫ్టీ షేర్ అని చెప్తాడు. అది తన వల్ల కాదని అంటుంది కానీ సామ్రాట్ మాత్రం చేసి తీరాల్సిందే అని అంటాడు. అనసూయ కాళ్ళు నొప్పులుగా ఉన్నాయని తులసిని పిలుస్తుంది.. ఇదే మంచి ఛాన్స్ అని లాస్య ఆయిల్ రాసి మర్దన చేస్తానని కూర్చుంటుంది.


Also Read: సౌందర్యకి నిజం చెప్పిన మోనిత- కార్తీక్ కి రెండో పెళ్లి చేస్తానన్న దీప


మర్దన చేయడంలో తన తర్వాతే ఎవరైనా అని లాస్య అనసూయ కాళ్ళు నొక్కేస్తుంది. నొప్పికి తట్టుకోలేక అనసూయ కుర్రో మొర్రో అని కేకలు పెట్టేస్తుంది. కాలు విరిగింది బాబోయ్ అని బాధపడుతుంది. తులసి కంటే తోపు అనిపించుకోవడానికి మాతో ఆడుకోకు అని పరంధామయ్య అంటాడు. తన ప్లాన్ ఫెయిల్ అయిపోయిందని లాస్య బిక్క మొహం వేస్తుంది. తులసి ఇంగ్లీషు నేర్చుకోవడం ఎలా అని పుస్తకాలు కొనుక్కుంటుంది.