వేద చెరిగిన బొట్టు, పూలు చీరతో తన తాతయ్యకి కనిపించేసరికి శోభనం జరిగిందని అనుకుంటాడు. కానీ రాణి మాత్రం నిజం చెప్తుంది. ఇద్దరూ కలవలేదని అంటుంది. ఇద్దరి కళ్ళలో ఒకరి మీద ఒకరికి ప్రేమ కనిపిస్తుంది. ఒకరి మీద ఒకరికి ఇష్టం మనసులో తెలుస్తుంది కానీ చేతల్లో కనిపించడం లేదు. అసలు సమస్య ఏంటో తెలియడం లేదని రాణి బాధపడుతుంది. మనకే కాదు వాళ్ళ సమస్య ఏంటో వాళ్ళకే తెలియడం లేదు. ఒకరి గురించి ఒకరికి తెలుసని అనుకుంటున్నారు కానీ వాళ్ళ మనసు ఏంటో వాళ్ళకి తెలియడం లేదు. ఇప్పటి వరకు వాళ్ళు ఖుషికి తల్లిదండ్రులుగా ప్రయాణం చేశారు. త్వరలోనే భార్యాభర్తలుగా కూడా మారతారు అని రాజా సర్ది చెప్తాడు.
Also Read: జానకి పనిమనిషని అవమానించిన మల్లిక- కష్టాల సంద్రంలో జ్ఞానంబ కుటుంబం
రాణి వేదకి ఒడి బియ్యం పోస్తుంది. తర్వాత ముత్యాలు పోస్తూ పండంటి మగబిడ్డ పుట్టాలని అంటుంది. ఆ మాటకి అందరూ బాధపడతారు. ముత్యాల నోట ముత్యాల్లాంటి దీవెన ఇచ్చాడు, నువ్వు గర్భవతి కావడానికి ఎంతో కొంత అవకాశం ఉంది. ఇదే విషయాన్ని భగవంతుడు గుర్తు చేశాడు అని రాణి అంటుంది. మాళవిక గదిలో సెంట్ బాటిల్స్ క్రీమ్స్ లేవని అరుస్తుంది. భ్రమరాంబిక వాటిని తీయించిందని పని మనిషి చెప్పడంతో అభిని పిలిచి అడుగుతుంది. అప్పుడే భ్రమరాంబిక వచ్చి ఎవరు ఈ మాళవిక అని అడుగుతుంది. అభి కంగారుగా ఏం చెప్పాలో తెలియక బిక్క మొహం వేస్తాడు. తను మన అతిథి మాళవిక అలాంటి చీప్ కాస్మోటిక్స్ వాడితే తన అందం ఏమవాలి. అందుకే తన కోసం యూఎస్ నుంచి కాస్ట్లీ కాస్మోటిక్స్ తెప్పిస్తున్నా అని చెప్తుంది. ఆ మాటకి మాళవిక పొంగిపోతుంది.
ఫ్యామిలీ బ్యాగ్ రౌండ్ ఏంటి, ఎక్కడ నుంచి వచ్చావ్, అభి ఎలా పరిచయం, ఎన్నాళ్ళు ఇక్కడ ఉంటావ్ అని భ్రమరాంబిక మాళవికని అడుగుతుంది. ఈ వివరాలన్నీ అభి చెప్తేనే బాగుంటుందని మాళవిక వెళ్ళిపోతుంది. ఇక మామూలుగా కాదు డైరెక్ట్ గా మాళవిక మీద అటాక్ చేయాలని భ్రమరాంబిక అనుకుంటుంది. వేద, యష్ తిరిగి ఊరు వెళ్ళడానికి బయల్దేరతారు. ఇంట్లో నుంచి వెళ్తు ఇద్దరు ఆ ఇంట్లోకి అడుగు పెట్టిన క్షణాలు గుర్తు చేసుకుంటారు. వేదది చిన్న పిల్ల మనస్తత్వం, దానికి ప్రేమ ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలియదు. ఇద్దరు స్నేహితులుగా మాత్రమే కాదు ఒకరి మనసు ఒకరు తెలుసుకుని ఉండాలని రాజా చెప్తాడు. మీ ఇద్దరి మధ్య ప్రేమ మాత్రమే మిగలాలి అని రాణి అంటుంది. వేదని చాలా చాలా ప్రేమిస్తున్నా అని యష్ సంతోషంగా చెప్తూ వేద కూడా నన్ను అని ఆగిపోతాడు.
Also Read: వేద చేసిన పనికి షాకైన రాణి- ఈ జంట ఒక్కటయ్యేది ఎప్పుడు?
మీరిద్దరూ సంతోషంగా ఉండాలి ఇదే మా చివరి కోరిక కూడా అని రాజా ఎమోషనల్ అవుతాడు. వేద ణా భార్య, నా కూతురు ఖుషికి అమ్మ తనని నేను సంతోషంగా చూసుకోవడం కాదు మేము సంతోషంగా ఉండేలా తనే చూసుకుంటుంది. నా వల్ల వేదకి ఎ కష్టం లోటు రానివ్వను అని యష్ రాజాకి ప్రామిస్ చేస్తాడు. వేద కారు ఎక్కడానికి వెళ్ళి మళ్ళీ ఏడుస్తూ వెనక్కి వచ్చి వాళ్ళని హగ్ చేసుకుని ఏడుస్తుంది. క్షమించండి తాతయ్య మిమ్మల్ని మోసం చేశాను, మీ ముందు నటించాను అని మనసులో అనుకుంటుంది. వేద వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రాజా చాలా బాధపడతాడు. మన ఆనందం కోసం వాళ్ళు నటించారు అని ఫీల్ అవుతారు.