మల్లిక పనుల నుంచి తప్పించుకోవడానికి ఎందుకు నాటకాలు ఆడుతున్నావని జానకి నిలదీస్తుంది. కానీ మల్లిక మాత్రం తన మాట పెడచెవిన పెడుతుంది. సమస్య ఎలా తీర్చాలి అని నేను ఆలోచిస్తుంటే నువ్వు నీ భర్తతో కలిసి బయటకి వెళ్లాలని చూస్తున్నావ్ అని అంటుంది. బావగారు చేసిన తప్పుకి శిక్ష మేము ఎందుకు అనుభవించాలని మల్లిక గట్టిగా అంటుంది. అఖిల్ కి ఉద్యోగం పేరు చెప్పి రూ.20 లక్షలు కొట్టేశారు, మీ వల్ల అన్నీ పోగొట్టుకుని రోడ్డున పడాల్సి వచ్చింది. మా కష్టాలకి కారణమైన నువ్వు అందరి దృష్టిలో పెద్ద కోడలు కావొచ్చు కానీ నా దృష్టిలో మాత్రం పనిమనిషివే అని ఘోరంగా అవమానిస్తుంది. జానకి దిగులుగా రావడం చూసిన చికిత ఏమైందని అడుగుతుంది.


Also Read: తులసి బ్యాక్ టు పెవిలియన్ - దిగులు పెట్టుకున్న సామ్రాట్, రగిలిపోతున్న లాస్య


తన బాధ బయటకి కనిపించకుండా జానకి కవర్ చేసుకుంటుంది. కాఫీ తన చేతులతో ఇస్తే జ్ఞానంబ తీసుకోదని జానకి చికితతో పంపిస్తుంది. అందరినీ భోజనానికి రమ్మని పిలుస్తుంది. జ్ఞానంబ రాలేదని రామా అనేసరికి జెస్సిని వెళ్ళి పిలుచుకు రమ్మని చెప్తుంది. జానకి తను చేసిన వంట గతంలో తినలేదని గుర్తు చేసుకుని అన్ని జెస్సి చేతుల మీదగా ఇస్తుంది. అందరూ నేలమీద కూర్చుని సైలెంట్ గా తింటూ ఉంటారు. ఏంటి అందరూ సైలెంట్ గా తింటున్నారని గోవిందరాజులు అంటాడు, అందరినీ నవ్వించెందుకు జానకి ట్రై చేస్తుంది. ఇంట్లో అందరూ పడుకున్న జానకి మాత్రం పనులు చేసుకుంటూ ఉండటం చూసి గోవిందరాజులు బాధపడతాడు.


వంటగదిలో పడుకునే పరిస్థితి తీసుకొచ్చాను కదా కోపం రావడం లేదా అని రామా అంటాడు. అదేమీ లేదు ఎవరికి ఏ కష్టం రాకుండా చూసుకుంటుంది మీరని జానకి భర్తకి తోడుగా నిలుస్తుంది. ఇద్దరూ కాసేపు చక్కగా మాట్లాడుకుంటారు. జానకి జెస్సి కోసం పాలు తీసుకొచ్చి మాట్లాడి వెళ్తుంది. కానీ అఖిల్ మాత్రం జానకి గురించి తప్పుగానే అనుకుంటాడు.. జ్ఞానంబ ఆలోచిస్తూ ఉంటుంది. అటు రామా కూడా ఏదో ఆలోచిస్తూ ఉంటాడు.


Also Read: వేద చేసిన పనికి షాకైన రాణి- ఈ జంట ఒక్కటయ్యేది ఎప్పుడు?


జ్ఞానంబ: ఇది దేవుడు రాసిన రాత కాదు మన బిడ్డ రాసిన రాత. మనకి ఎవరికి చెప్పకుండా వాడు చేసిన తప్పు వల్ల కుటుంబం అంతా బాధపడాల్సి వస్తుంది


రామా: నా తప్పు లేకపోయినా అందరూ కష్టపడుతుంది నా వల్లే కదా


జ్ఞానంబ: ఎలా ఉన్నాం, ఎలా అయిపోయాం


రామా: తెలిసి చేసిన తెలియక చేసిన తప్పు తప్పే కదా. ఇంట్లో పరిస్థితులు బాగోలేదు


దేవుడి ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుందని గోవిందరాజులు, జానకి ఇద్దరికీ సర్ది చెప్తారు. జానకి అందరికీ టిఫిన్ చేస్తుంటే రామా వస్తాడు. త్వరగా టిఫిన్ పెట్టండి షాపుకి వెళ్ళాలి అని అంటాడు. ఏ షాపుకి అనేసరికి మన షాపుకే అని అంటాడు. తర్వాత చేసిన విషయం గుర్తుకు వచ్చి బాధపడతారు.