ఇంట్లో వాళ్ళ పరిస్థితి తలుచుకుని తులసి మళ్ళీ ఆ ఇంటికి వెళ్లాలని అనుకుంటున్నట్టు సామ్రాట్ కి చెప్తుంది. స్వేచ్చ కోసం ఇంటి నుంచి బయటకి వచ్చాను కానీ అక్కడ అలా జరగడం లేదు ప్రతిఒక్కరూ బాధపడుతున్నారు, నా దగ్గర దాస్తున్నారు ఇలాగే ఉంటే నా వాళ్ళు అన్యాయం అవుతారు అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా అని తులసి చెప్తుంది. లాస్య ఆగడాలకి చెక్ చెప్పాలంటే మీరు ఆ ఇంట్లో అడుగు పెట్టాల్సిందే అని సామ్రాట్ కూడా తనకి సపోర్ట్ గా మాట్లాడతాడు. ఇల్లు తాకట్టు పెట్టడానికి నందు వడ్డీ వ్యాపారిని తీసుకుని వస్తాడు. ఎవరు ఇతను అని పరంధామయ్య అడుగుతాడు. ఈ ఇల్లు తాకట్టు పెట్టడానికి అని లాస్య చెప్తుంది. ఇంటి డాక్యుమెంట్స్ అతని చేతిలో పెడతారు.


ఇల్లు మీ పేరు మీదే ఉంది కదా సంతకం పెట్టండి అని వడ్డీ వ్యాపారి అడుగుతాడు. అవును అని లాస్య అంటే కాదు నా పేరు మీద ఉందని తులసి ఎంట్రీ ఇస్తుంది. ఇల్లు ఒకప్పుడు తన పేరు మీద ఉన్న మాట నిజమే కానీ తర్వాత తనే స్వయంగా లాస్య పేరు మీద రాస్తూ సైన్ చేసిందని నందు చెప్తాడు. అది చాలని వడ్డీ వ్యాపారి అంటాడు.


Also Read: వేద చేసిన పనికి షాకైన రాణి- ఈ జంట ఒక్కటయ్యేది ఎప్పుడు?


తులసి: ఇంటిని లాస్య పేరు మీద రాస్తూ నేను సైన్ చేసిన విషయం నిజమే కానీ ఇంతవరకు ఆ డాక్యుమెంట్స్ రిజిస్టర్ అవలేదు


వ్యాపారి: అవును కాలేదు, ఇంత మోసమా, రిజిస్ట్రేషన్ కానీ పేపర్లు నాదగ్గర పెట్టి అప్పు ఎలా తీసుకుంటారు. ఇంకెప్పుడు నా దగ్గరకి రావొద్దు


లాస్య: పాతికేళ్లు నీతో కాపురం చేసిన నీ మాజీ భార్య ఎలా వెన్నుపోటు పొడిచిందో చూశావా


నందు: తులసి ఇలా చేస్తుందని ముందే మీకు తెలుసు కదా ఎందుకు నాకు చెప్పలేదు. అందరూ కలిసి నాటకాలు ఆడుతున్నారు


తులసి: మీరు ఏం చేసుకున్నా నాకేంటి, నేను జాగ్రత్త పడేది నా వాళ్ళ గురించి. బెనర్జీ చేతిలో మీరు ఖచ్చితంగా మోసపోతారు. అందుకే మీకు అడ్డం పడాల్సి వచ్చింది


నందు: ఇల్లు వద్దని రాసిచ్చి ఇప్పుడు ఇదేంటి


తులసి: నేను రాసింది అత్తయ్యకి కానీ డాక్యుమెంట్స్ లో మీ ఆవిడ పేరు రాసుకుని మోసం చేసింది గుర్తు చేసుకో నందగోపాల్. ఈ ఇల్లు ఇప్పుడు కావాలంటే అత్తయ్య పేరు మీద రాస్తాను


అనసూయ: వద్దు ఏదో ఒక రోజు వీళ్ళు ఈ ఇంటి కోసం మా గొంతు పిసికి చంపేస్తారు కూడా


Also Read: తులసి షాకింగ్ నిర్ణయం- నందు, లాస్యకి ఇక దబిడి దిబిడే


లాస్య: నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి మిమ్మల్ని చూసుకోవాల్సింది మేమే


తులసి: మీకు ఆ అవసరం లేదు నేను శాశ్వతంగా వచ్చేశాను, నా వాళ్ళని ఇక నుంచి నేను చూసుకుంటాను


కాసేపు లాస్య, తులసి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఆ రోజు ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అత్తయ్య అనుమానించారని తులసి అంటుంది. ఆరోజు జరిగిన దానికి క్షమించమని అడిగాను రమ్మని పిలిచాను అని అనసూయ అంటుంది. ఈ ఇంట్లోకి రావడానికి ఒప్పుకోనని లాస్య అంటుంది. ఒప్పుకోకపోవడానికి మీరెవరు ఇది నా ఇల్లు, వీళ్ళు నా వాళ్ళు. మీకు ఇష్టం లేకపోతే మీరే వెళ్ళండి వద్దని ఆపేవాళ్ళు ఎవరు లేరు అని తులసి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. నందు కోపంగా గదిలోకి వెళ్ళి తన బ్యాగ్ సర్దుకుంటూ ఉంటాడు. అర్జెంట్ గా ఈ ఇంటి నుంచి బయటకి వెళ్లాలని నందు అంటాడు. కానీ లాస్య మాత్రం వద్దని అంటుంది. ఇద్దరికీ సంపాదన లేదు ఇక్కడ అయితే గడిచిపోతుంది, పట్టించుకునే నాధుడు లేదని సర్ది చెప్తుంది. తులసి వెళ్లిపోవడంతో సామ్రాట్ దిగులుగా కూర్చుంటాడు. అప్పుడే తన బాబాయ్ వచ్చి సామ్రాట్ ని తులసి పేరు చెప్పి కాసేపు ఆట ఆడుకుంటాడు.