రామా, జానకి వెళ్లిపోతామని అనేసరికి భానుమతి అలుగుతుంది. బట్టలు తీసుకురాలేదని రామా అనేసరికి భానుమతి తన భర్త డ్రెస్ తెచ్చి రామాకి ఇస్తుంది. జానకికి తన పెళ్లి నాటి చీర ఇస్తుంది. అది చూసి జానకి చాలా సంతోషిస్తుంది. ఇద్దరూ భానుమతి ఇచ్చిన బట్టలు వేసుకుని మురిసిపోతారు. ఒకరినొకరు పొగుడుకుంటారు. రామా సిగ్గు పడుతుంటే జానకి చక్కిలి గిలి పెట్టి మరింత ఆటపట్టిస్తుంది. రామాకి ఇష్టమైన పుట్టగొడుగులు కూర చేస్తానని భానుమతి అంటే తనే చేస్తానని జానకి అంటుంది. కూర ఎలా చెయ్యాలో భానుమతి జానకికి నేర్పిస్తుంది. రామా, జానకి పొయ్యి దగ్గర కూర్చుని వంట చేస్తూ రొమాన్స్ కూడా కానిచ్చేస్తారు.


Also Read: కరెంట్ షాక్ కొట్టిన కాకిలా అయిపోయిన సామ్రాట్- బేరాలు ఆడటంలో మాస్టర్స్ చేసిన తులసి


వంట చేస్తున్న జానకిని చూస్తూ రామా తెగ మురిసిపోతూ ఉంటాడు. జానకి పొయ్యి ఊదుతుంటే కళ్ళలో మట్టి పడుతుంది. ఇదే సందు అని తెగ రొమాన్స్ చేస్తారు. ఆరు బయట చెట్టు కింద భానుమతి భోజన ఏర్పాట్లు చేస్తుంది. అరటి ఆకులో ప్రేమగా అన్నం వడ్డిస్తుంది. భానుమతి ప్రేమగా రామాకి అన్నం తినిపిస్తుంది. అది చూసి కొడుక్కేనా కోడలికి తినిపించిరా అని బుంగమూతి పెడుతుంది. వాళ్ళిద్దరూ కలిసి భానుమతికి అన్నం తినిపిస్తారు. జానకి పరిగెడుతుంటే తనని పట్టుకోవడానికి రామా పరుగులు తీస్తాడు. రామాని జానకి ఫుల్ గా చిక్కిలి గిలి పెట్టి ఆటపట్టిస్తుంది. ఇలా చేస్తే పాత రామా బయటకి వచ్చేస్తాడు అని ఇద్దరూ ఒకరిమీద ఒకరు పడిపోతారు. ఒక రొమాంటిక్ సాంగ్ వేసేసి లాగ్ చేశారు.


జానకి చిలిపి అల్లరి సంతోషం చూసి రామా మురిసిపోతాడు. మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని అంటాడు. దీనికి కారణం ఏంటని అడుగుతాడు. ‘నేను ఈరోజూ చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే అమ్మానాన్న పెళ్లి రోజు. ఈరోజు నేను ఏడిస్తే వాళ్ళు బాధపడతారు. అందుకే నేను అమ్మనాన్నలతో ఎలా ఉంటానో మీతో కూడా అలాగే ఉన్నా’ అని తన సంతోషానికి కారణం చెప్తుంది. ‘ప్రతి తల్లిదండ్రి కూతుర్ని అమ్మానాన్నలాగా చూసుకునే భర్త రావాలని కోరుకుంటారు. నాకు అలాంటి భర్తే వచ్చాడు. నేను మీతో ఉన్నప్పుడు ఎలా ఉంటానో నా భర్తతో ఉన్నపుడు అలాగే ఉంది’ అని జానకి ఎమోషనల్ అవుతుంది. రామా తనని ప్రేమగా దగ్గరకి తీసుకుంటాడు. అమ్మానాన్న లేరనే లోటు ఒక పక్క ఉన్నా వాళ్ళ ప్రేమని మీరు మరిపిస్తున్నారు అని జానకి అంటుంది. మీ అమ్మానాన్న అంటే అంత ప్రేమ ఉంటే మరి వాళ్ళ కోరిక ఎందుకు మర్చిపోయారని అడుగుతాడు.


Also Read: ఇగో మాస్టర్ నిజంగా జెంటిల్మెన్, గౌతమ్ కి థాంక్స్ చెప్పిన రిషి - వసుధారని ఇరికించేందుకు చూసిన దేవయాని


తరువాయి భాగంలో..


నేను ఏదో అన్నానని మీరు నిజాయితీ తప్పి నా తమ్ముడిని బయటకి తీసుకొచ్చారు. ఇప్పుడు మీ చదువు ఆగిపోకూడదు. పోలీస్ ఆఫీసర్ గా మీ తొలి కేసు మాధురిది అనుకోండి, అసలు ఏం జరిగిందో ఒక పోలీస్ ఆఫీసర్ లాగా మొత్తం తెలుసుకోండి, నా తమ్ముడు తప్పు చేయలేదని తెలిస్తేనే నేనన్న మాట క్షమించి మనస్పూర్తిగా కాలేజీకి వెళ్ళండి, ముఖ్యమైన పరీక్షలకి చదవమని రామా చెప్తాడు.