ఇంట్లో వాళ్ళ మెప్పు పొందటం కోసం లాస్య తెగ ప్రయత్నిస్తుంది. పరంధామయ్యకి ట్యాబ్లెట్స్ తీసుకొచ్చి వేసుకోమని ఇస్తుంది. అవి వేసుకుంటే రోగాలు నయం అవడమేమో కానీ మా ప్రాణాలు పోతాయని అనసూయ అంటుంది. అదేంటి అని లాస్య అనేసరికి అవి రాత్రికి వేసుకునే ట్యాబ్లెట్స్ ఇప్పుడు కాదని అంటుంది. ఇప్పుడే మమ్మల్ని పైకి పంపించొద్దు కాస్త మనవరాలి పెళ్లి చూసుకోవాలని పరంధామయ్య అంటాడు. అటు సామ్రాట్ గృహిణి బాధ్యతల్లో తలమునకలై ఉంటాడు. ఇంట్లో బాధ్యతలు తీసుకోవాలని చూస్తున్న సపోర్ట్ చేయకుండా దూరం పెడుతున్నారని లాస్య రగిలిపోతుంది. దానికి భాగ్య మరింత ఆజ్యం పోస్తుంది. తులసి పక్కన లేదు కానీ ఇంట్లో అందరి మనసుల్లో ఉంది ఆఖరికి బావగారి మనసులో కూడా ఉంది. నిన్ను తప్పించి తులసిని మళ్ళీ ఇంట్లోకి తీసుకురావాలని అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని భాగ్య బాగా ఎక్కించి వెళ్ళిపోతుంది.
Also Read: ఇగో మాస్టర్ నిజంగా జెంటిల్మెన్, గౌతమ్ కి థాంక్స్ చెప్పిన రిషి - వసుధారని ఇరికించేందుకు చూసిన దేవయాని
తులసి, సామ్రాట్ బస్సులో వెళ్తుంటారు. బస్సు సడెన్ బ్రేక్ లకి సామ్రాట్ పడిపోతూ ఉంటుంటే తులసి జోకులు వేస్తుంది. కండెక్టర్ వచ్చి టికెట్ తీసుకోమని అంటాడు. టికెట్ కి డబ్బులు తీసుకుని నిలబడలేదని కండెక్టర్ సామ్రాట్ ని తిడతాడు. 2వేల నోటు ఇచ్చి టికెట్ ఇవ్వమనేసరికి టికెట్టు ఇద్దరికేనా, బస్సులో ఉన్న వాళ్ళందరికీ తీసుకుంటున్నావా అని కౌంటర్లు వేస్తాడు. కండెక్టర్ ఛేంజ్ ఇవ్వకుండా టికెట్ వెనుక రాసిస్తాడు. అదేంటి అని సామ్రాట్ వింతగా అడుగుతాడు. అప్పుడే బస్సులో సీటు ఖాళీ అయ్యేసరికి అందులో కూర్చుని తెగ సంబరపడిపోతాడు. అప్పుడే ఒకామే వచ్చి అది లేడీస్ సీట్ అని చెప్పి సామ్రాట్ లేపి తను కూర్చుంటుంది. బిక్క మొహం వేసుకుని సామ్రాట్ మళ్ళీ లేచి నిలబడతాడు. మళ్ళీ సీటు దొరికితే అదేంటో టాప్ యూనివర్సిటీలో సీట్ దొరికినంత ఫీలింగ్ ఇస్తాడు.
Also Read: మోనిత అరెస్ట్ సంగతి తెలుసుకున్న కార్తీక్- దీప రిపోర్ట్స్ చూసి షాకైన డాక్టర్
తులసి దిగాల్సిన స్టాప్ వచ్చిందని చెప్పి డోర్ దగ్గరకి వెళ్ళి నిలబడమని చెప్పి ఛేంజ్ తీసుకోమని కూడా చెప్తుంది. సామ్రాట్ బస్సు దిగి కండెక్టర్ ఇచ్చిన ఛేంజ్ లెక్కపెట్టుకుంటాడు. 30 రూపాయలు తక్కువ ఇచ్చావ్ అని సామ్రాట్ మళ్ళీ బస్సు ఆపి డబ్బులు తీసుకుంటాడు. తులసితో కలిసి షాపింగ్ చేస్తూ ఉంటాడు. బ్యాగ్ కొనడానికి వెళ్ళి సామ్రాట్ రేటు మాట్లాడకుండా తీసుకుంటుంటే తులసి బేరాలు ఆడుతుంది. ఆ బేరాల దగ్గర తులసి ఒక పెద్ద క్లాస్ తీసుకుంటుంది. ఇంకొక షాప్ కి వెళ్ళిన తులసి ల్యాప్ టాప్ బ్యాగ్ చూస్తూ రేటు చెప్పమంటే 2 వేలని చెప్తాడు. దాన్ని రూ.300 కి ఇవ్వమని అడిగేసరికి సామ్రాట్ నోరెళ్ళబెడతాడు. అలా చివరికి గీసి గీసి బేరం ఆడి చివరికి రూ.500 కి బ్యాగ్ తీసుకుంటుంది. అది చూసి సామ్రాట్ కరెంట్ షాక్ కొట్టిన కాకిలా మారిపోతాడు. కొన్న సామాన్లు మొయ్యలేక సామ్రాట్ నానా ఇబ్బంది పడతాడు.