జానకి, అఖిల్ మాట్లాడుకోవడం విని జ్ఞానంబ గుండె ముక్కలు అవుతుంది. నేను చెప్తే జెస్సి వినడం లేదు అబార్షన్ తప్ప వేరే దారి లేదని నువ్వైనా చెప్పు వదిన అని అఖిల్ చెప్పేసి వెళ్లిపోతుంటే రామా ఎదురుగా ఉంటాడు. రామా అఖిల్ ని కొడుతుంటే జానకి అడ్డుపడుతుంది. నేను పెట్టుకున్న నమ్మకానికి వాడు నిలబెట్టిన దానికి మధ్య సమస్య ఇది మీరు తప్పుకోండి అని రామా అఖిల్ ని కొడుతూనే ఉంటాడు. సిగ్గు లేదురా ఆడపిల్ల జీవితం నాశనం చెయ్యడమే కాక అమ్మ మీద ఒట్టేసి అబద్ధం చెప్తావా అని విపరీతంగా కొడుతుంటాడు. నిన్ను ఎంత నమ్మాను, ఇది కావాలి అంటే లేదు అనకుండా తెచ్చి ఇచ్చాను కదరా, మా ఇద్దరి కాలనీ నీ ద్వారా తీర్చుకోవాలని అనుకున్నాం మమ్మల్ని ఇంతగా మోసం చేస్తావా అని రామా తిడుతూ ఉంటాడు. అదంతా జ్ఞానంబ చూస్తూ నిలబడిపోతుంది.
నీలో గెలుపు చూడటం కోసం నా భుజాల మీద మోశాను కదరా, నీ తోడబుట్టిన చెల్లిని ఎదురుగా పెట్టుకుని ఒక అమ్మాయిని ఎలా మోసం చెయ్యాలని అనిపించింది అని రామా చాలా ఎమోషనల్ గా మాట్లాడతాడు. కొడితే సమస్య తీరుతుందా అని జానకి అంటుంది. అమ్మ ముందు నిజం ఒప్పుకోమని రామా అడుగుతాడు. నువ్వు నన్ను చంపేసిన సరే నేను అమ్మ ముందు నిజం ఒప్పుకోను అని అఖిల్ రామా మాట వినకుండా వెళ్ళిపోతాడు. జ్ఞానంబ కింద కూలబడిపోతుంది. తనని రామా, జానకి చూసి ఏమైందని కంగారు పడతారు. నువ్వు బాధ్యతతో మన ఇంటి పరువు, ఒక ఆడపిల్ల జీవితం మసకబారిపోకుండా ఉండాలని ఆరాటపడుతుంటే నేను నా పెంపకాన్ని నమ్మి నిజానికి గ్రహణం పట్టించె ప్రయత్నం చేశాను. జానకి ఇకపై నాకు ఇద్దరే కొడుకులు అఖిల్ ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని జ్ఞానంబ అంటుంది.
Also Read: హనీకి అమ్మగా మారిన తులసి- కుక్కపిల్లని తెచ్చి పెంచుకోమని నందుకి వార్నింగ్
జానకి నువ్వే ఏదో ఒక నిర్ణయం తీసుకో అని జ్ఞానంబ చెప్తుంది. ఇదంతా ఇంట్లో వాళ్ళ ముందు బయటపెడుతుంది జ్ఞానంబ. నా ప్లాన్ ఏంటి ఇలా రివర్స్ అయిపోయిందని మల్లిక తెగ ఫీల్ అవుతుంది. నేను ముందు నుంచి అఖిల్ మీద అనుమానపడుతూనే ఉన్నా జానకి, రామా మన పరువు పోయే పనులు చేయరు అని గోవిందరాజులు అంటాడు. జ్ఞానంబ కోపంగా అఖిల్ చెంపలు వాయిస్తుంది. అమ్మ అంటే ప్రేమ మాత్రమే కాదు నమ్మకం కూడా , నిన్ను నమ్మి రామా జానకిని కూడా బాధపెట్టాను. ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసేంత దుర్మార్గుడు కాదని నమ్మాను మీ నాన్న చెప్పినా వినిపించుకోలేదు. చివరికి అవమానభారాన్ని భరించలేక చావడానికి కూడా సిద్ధపడ్డావ్ అని నేను నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మోసం చేశావ్ అని జ్ఞానంబ అంటుంటే అఖిల్ తన కాళ్ళ మీద పడి క్షమించమని అడుగుతాడు.
ఈరోజు నుంచి నేను నీతో మాట్లాడను ఇది నీకే కాదు నీ భార్యకి కూడా వర్తిస్తుంది. నీ చదువు గురించి నీ భార్య గురించి నాకు ఏ సంబంధం లేదు ఎలా పోషించుకుంటావో అది నీ ఇష్టం. జీవటంలో పైకి ఎదుగుతావని ఆశపడితే ప్రేమ పేరుతో వెధవ పని చేసి నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావ్. ఇక నీ జీవితం గురించి నేనేమీ పట్టించుకోను’ అని జ్ఞానంబ చెప్తుంది. కన్నతల్లి ఎదురుగా ఉండి మాట్లాడకపోతే ఎలా ఉంటుందో నీకు నాకు తెలుసు ఆ బాధ అఖిల్ పడకూడదు దయచేసి నీ నిర్ణయాన్ని మార్చుకో చిన్న మనసులు ఇంకా ఇంకా కుంగిపోతాయి అని రామా నచ్చజెప్పడానికి చూస్తాడు కానీ జ్ఞానంబ మాత్రం వినదు.
Also Read: రుక్మిణిని ఇంటి నుంచి వెళ్లిపొమ్మన్న జానకి- రాధని పెళ్లి చేసుకోవడానికి మాధవ్ ఏర్పాట్లు
నీ వల్లే మాకు పెళ్లి జరిగిందని జెస్సి జానకికి థాంక్స్ చెప్తుంది. అఖిల్ కూడా రామాని క్షమించమని అడుగుతాడు. మల్లిక తన ప్లాన్ ఫెయిల్ అయినందుకు తెగ ఫీల్ అయిపోతుంది. విష్ణు వచ్చి ఏమొచ్చిందని తిడతాడు. అఖిల్ లోపలికి వచ్చి జెస్సిని మాట్లాడమని అడుగుతాడు. కానీ జెస్సి మాత్రం కోపంగా అరుస్తుంది. ఏమని మాట్లాడాలి నువ్వు అబార్షన్ చేయించుకోమన్నప్పుడే నా ప్రాణం పోయింది, మా వాళ్ళు నాకు బాధ అనేది తెలియకుండా పెంచారు. నన్ను గాజు బొమ్మలా చూసిన నా పేరెంట్స్ నన్ను చూసిన చూపులు ఇంకా గుర్తు ఉన్నాయి. నువ్వు ఎప్పుడైతే అబార్షన్ చేయించుకోమని ఫోర్స్ చేశావో అప్పుడే నా వల్ల కాలేదు సూసైడ్ చేసుకోబోయాను. నీ మాటలు నమ్మే రోజులు పోయాయి నా కడుపులో బిడ్డ అనాథ కాకూడదని ఈ పెళ్లి చేసుకున్న అని జెస్సి చెప్తుంది. బయట మాత్రమే మనం భార్య భర్తలం కానీ ఈ నాలుగు గోడల మధ్య నీకు నాకు ఎలాంటి సంబంధం లేదని జెస్సి తెగేసి చెప్తుంది.