అప్పుగా తీసుకున్న డబ్బులు రామచంద్ర ఇచ్చేయడంతో దానిపై రాసుకున్న బాండ్ పేపర్ ఇచ్చేస్తాడు కన్నబాబు. వెంటనే ఆ పేపర్ లు అందుకొని చించేస్తుంది జానకి. తనను మోసం చేసిన నిన్ను బుద్ది చెప్పడం చాలా ఈజీ అని... బయటు లాగి పరువు తీసే ఛాన్స్ కూడా ఉందని కన్నబాబుకు వార్నింగ్ ఇస్తాడు రామచంద్ర. ఎందుకు ఆగిపోయానా నాకు మాత్రమే తెలుసని.. అందుకే నువ్వు బతికిపోయావంటూ కన్నబాబుపై ఫైర్ అవుతాడు రామచంద్ర.
తన భర్తను అమాయకుడిని చేసి మోసం చేసినట్టు మళ్లీ మళ్లీ చేస్తానంటే కుదరదని... తనకు నేను ఉన్నానంటూ అంటుంది జానకి. ఎన్ని కుట్రలు చేసిన ఎదుర్కోవడానికి అడ్డుకోవడానికి తాను ఉన్నానంటూ భరోసా ఇస్తుంది. రాజకీయ పలుకుబడి ఉండొచ్చని... తన భర్త జోలికి వస్తే మాత్రం వాటన్నింటిని తొక్కిపడేయడానికి జానకి ఉందని హెచ్చరిస్తుంది. పేరుకి తగ్గట్టు సౌమ్యంగా ఉండటమే కాదు... తన భర్తకు ఎవరైనా హాని చేయాలని చూస్తే మాత్రం కాళీకా దేవిలో చీల్చి చెండాడుతానంటూ వార్నింగ్ ఇస్తుంది. నిత్యం తన భర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని.. ఇకపై తన కుటుంబం జోలికి, భర్త వైపు కన్నెత్తి చూస్తే మాత్రం మీ రాజకీయ భవిష్యత్తే కాదు అసలు భవిష్యత్తే లేకుండా చేస్తానంటూ గట్టిగానే చెబుతుంది జానకి. జానకి వార్నింగ్‌తో కన్నబాబు, సునంద మైండ్ బ్లాంక్ అవుతుంది. ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోతారు.
తనకు అండగా నిలిచిన భార్య జానకివైపు కన్నార్పకుండా చూస్తూ ఉండిపోతాడు రామచంద్ర. ఏంటి విషయమని అడుగుతుంది. భార్య భర్తల మధ్య సారీలు థాంక్స్‌లు ఉండకూడదని చెప్పారు కానీ... చెప్పకుండా ఉండలేనంటాడు రామచంద్ర. ఇప్పుడు దేని కోసం అంత పెద్ద మాటలు చెబుతున్నారని అడుగుతుంది జానకి. అంత పెద్ద వంటల పోటీల్లో గెలిపించిన జానకికి థాంక్స్ ఎలా చెప్పకుండా ఉండలేనంటాడు. తాను చేసిందేమీ లేదని.. మీ ప్రతిభే మిమ్మల్ని గెలిపించిందని అంటుంది జానకి. అయినా తన ఐపీఎస్ కలకు ప్రాణం పోసిన మీకు ఏం చేసిన తక్కువే అంటుంది జానకి.
మీడియా ఛానల్ వాళ్లు రామచంద్రను వెతుక్కొని వస్తారు. ఇంతలో అటుగా వెళ్తున్న నీలావతిని అడుగుతారు. తనను కూడా టీవీలో చూపిస్తేనే అడ్రెస్ చెప్తానంటూ వాళ్లతో వచ్చి ఇల్లు చూపిస్తుంది. ఇంట్లోకి వాళ్లను తీసుకొచ్చి పరిచయం చేస్తుంది.
వంటల పోటీల్లో గెలిచిన రామచంద్ర ఇంటర్వ్యూ తీసుకుంటామని చెప్తారు మీడియా వాళ్లు. వద్దని చెబుతుంది జ్ఞానాంభ. ఎందుకని గోవిందరాజు అడుగుతాడు. ఇలాంటివి రామచంద్రకు తెలియదని... ఎప్పుడూ మైక్‌ల ముందు మాట్లాడలేదని అంటుంది జ్ఞానాంభ. అవమానం పడటం తనకు ఇష్టం లేదని అంటుంది.
జ్ఞానాంభకు జానకి సర్ది చెబుతుంది. రామచంద్ర మాట్లాడగలడని వివరణ ఇస్తుంది. ఇంతలో మల్లిక కలుగజేసుకొని.. అత్తయ్య అంటే గౌరవం లేకుండా ఆమె చెప్పిన ప్రతి మాటకు ఎదురు చెప్తున్నావని జానకి అంటుంది. గోవిందరాజు కలుగుజేసుకొని పెట్రోల్ పోయడం ఆపని వారిస్తాడు.
Also Read: ఒక్క చెంపదెబ్బతో కథ మొత్తం మార్చేసిన సౌందర్య, శౌర్య కి మళ్లీ అన్యాయం జరిగినట్టేనా!
జానకితోపాటు ఫ్యామిలీ మెంబర్స్ అంతా జ్ఞానాంభను ఒప్పిస్తారు. ఒక్కసారికి ఒప్పుకోమంటారు. అందరి రిక్వస్ట్‌తో జ్ఞానాంభ రామచంద్ర ఇంటర్వ్యూకు అంగీకరిస్తుంది.
లీలావతిని మల్లిక తిడుతుంది. మీడియాను ఎందుకు తీసుకొచ్చావని ప్రశ్నిస్తుంది. అందులో నువ్వు కూడా కనిపిస్తే బాగుంటుందని.. ఏదోలా మల్లికకు లీలావతి మేనేజ్ చేస్తుంది.
మీడియా ఇంటర్వ్యూ కోసం రామచంద్రను ప్రిపేర్ చేస్తుంది జానకి. కంగారు పడకుండా సమాధానాలు చెప్పమని సూచిస్తుంది. జానకి పక్కనే ఉంటే తానెందుకు భయపడతానంటాడు.
జ్ఞానాంభ మాత్రం ఏదో ఆందోళనలో ఉంటుంది. జానకి దాన్ని గమనిస్తుంది. ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది.. రమ్మని జ్ఞానాంభను పిలుస్తుంది జానకి. తానెందుకు అని అంటుంది. ఈ గెలుపు మీదేనంటుంది జానకి. తనకు కూడా కంగారుగా ఉంటుందని వాళ్ల ప్రశ్నలకు తాను సమాధానం చెప్పలేనంటుంది. ఎప్పటి మాదిరిగానే మీరు హుందాగా ఉండాలని ప్రశ్నలు అడగడానికి వాళ్లే భయపడాలని ధైర్యం చెబుతుంది జానకి.