Jagadhatri November 27th Episode: ఈరోజు ఎపిసోడ్ లో నిషి మాట్లాడుతూ వాళ్లని మందలిస్తారనుకుంటే కారు ఇచ్చి షికారు పంపించారేంటి అని అత్తగారిని అడుగుతుంది.


వైజయంతి: తన అల్లుడితో జగద్ధాత్రి వాళ్ళని ఫాలో అవమని చెప్తుంది. వాళ్లు బ్యాంకుకు వెళితే డబ్బులు కోసమే, అప్పుడు వాళ్ళని నిలదీయొచ్చు అంటుంది.


సూపర్ ఐడియా అత్తయ్య నేను వాళ్లని ఫాలో అయ్యి అసలు విషయం కనుక్కుంటాను అని జగద్ధాత్రి కారుని ఫాలో అవుతాడు జగద్ధాత్రి అన్నయ్య. 


మరోవైపు యువరాజ్ బయటికి వెళ్తూ నిషికి ఇన్ఫామ్ చేస్తాడు. మళ్లీ పోలీస్ గుర్తులు పంపించాను ఈ ఉంగరం ఎవరిదైతే వాళ్లే పోలీసు అని చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి నిషిని వెనక్కి పిలిపించి ఆమె చేతికి ఉన్న ఉంగరం చూసి షాక్ అవుతాడు. అంటే నిషి పోలీసా అని అనుమానపడతాడు.


యువరాజ్ : ఈ ఉంగరం ఎక్కడిది.


నిషి: మా పుట్టింటి వాళ్ళు పెట్టారు.


యువరాజు: చాలా బాగుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఇంటరాగేషన్ నుంచి వచ్చిన తరువాత ఈ రింగ్స్ సంగతి తేల్చాలి అనుకుంటాడు.


మరోవైపు కారులో వెళ్తున్న జగద్ధాత్రి వాళ్ళు తమని జగద్ధాత్రి అన్నయ్య ఫాలో అవుతున్నాడు అని గమనిస్తారు. అతని నుంచి తప్పించుకోవటం కోసం కేదార్ పువ్వులు కొనటానికి వెళ్తాడు. అక్కడ నాలుగు మూర్ల మల్లెపూలు అడుగుతాడు కేదార్ 


పూలావిడ: కొత్తగా పెళ్లయిందా ప్రేమించి పెళ్లి చేసుకున్నారా అని అడుగుతుంది.


కేదార్: నేను ప్రేమించాను ఆ దేవుడు పెళ్లి చేశాడు.


పూలవిడ : ఇద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టినట్లుగా ఉన్నారు నెమ్మదిగా తను కూడా మిమ్మల్ని ప్రేమిస్తుంది అని చెప్పి కొన్ని పువ్వులు ఎక్కువ ఇచ్చి మరి పంపించేస్తుంది.


తర్వాత కేదార్ అతని బావమరిది చూస్తూ ఉండగా భార్య తలలో పూలు పెడతాడు. వీళ్లేంటి రోడ్డు మీద రొమాన్స్ చేసుకుంటున్నారు అని చిరాకు పడతాడు జగద్ధాత్రి అన్నయ్య. మళ్లీ అక్కడ నుంచి కార్లో బయలుదేరుతారు కేదార్ వాళ్ళు.


జగద్ధాత్రి : మనం చూసాం కాబట్టి సరిపోయింది లేదంటే అన్నయ్యకి మనం పోలీసులు అని తెలిసిపోయేది.


కేదార్: నా బావమరిది పట్టువదలని విక్రమార్కుడు లాగా ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నాడు అని వెనక్కి చూపిస్తాడు.


జగద్ధాత్రి : ఇప్పుడు ఎలా మనం యువరాజు వచ్చేలోపు ఆఫీసులో ఉండాలి ఏదైనా చెయ్యు.


అప్పుడు కేదార్ ఆడవాళ్లు ముగ్గులు వేసుకుంటుంటే ఆ ముగ్గుల మీద నుంచి కారు పోనీ ఇస్తూ దగ్గరికి వెళ్లాక యూత్ అని తీసుకొని వెళ్ళిపోతాడు కానీ అతను బావమరిది మాత్రం ఆ ముగ్గులని బైక్ తో తొక్కించేసి ఆ ఆడవాళ్ళ చేతిలో తన్నులు తింటాడు.


మరోవైపున రామస్వామిని ఇంటరాగేట్ చేస్తూ ఉంటారు పోలీసులు. తనకి మేననికి ఏ సంబంధం లేదు అని చెప్తాడు రామస్వామి. అంతలోనే అక్కడికి జగద్ధాత్రి, కేదార్ వస్తారు. వాళ్లతో పై ఆఫీసర్ రామస్వామి కి బోర్ కొడుతుంది అంట పంపించేయండి అంటున్నాడు అని చెప్తాడు.


జగద్ధాత్రి: సరే సరే ఎలాగూ యువరాజ్ వస్తున్నాడు కదా ఇక ఇతనితో పని అయిపోయింది పంపించేద్దాం అంటుంది.


రామస్వామి: యువరాజ్ ఇంట్లోనో,చుట్టుపక్కలో పోలీసులు ఉన్నారు అని బాయ్ భయపడేవారు. ఖచ్చితంగా వీళ్ళకి యువరాజ్ కి ఏదో సంబంధం ఉంది. యువరాజ్ కి పోలీసులు ఎవరో క్లూ ఇవ్వాలి అనుకొని సీక్రెట్ గా తన చేతికి గాయం చేసుకుంటాడు. తర్వాత గన్ తీసుకొని పెద్ద ఆఫీసర్ మీద గురిపడతాడు. అయితే జగద్ధాత్రి ఒడుపుగా వాడిని పట్టుకుంటే మిగిలిన పోలీసులు వాడిని బంధిస్తారు. అయితే ఈ పెనుగులాటలో తెలివిగా తన రక్తాన్ని కేదార్ షర్ట్ కి అంటిస్తాడు రామస్వామి. బయటికి వచ్చాక కూడా డౌట్ ఫుల్ గా ఉన్న జగద్ధాత్రిని ఏమైంది అని అడుగుతాడు పై ఆఫీసర్.


జగద్ధాత్రి: లేదు సార్ రామస్వామి ఏదో ప్లాన్ చేశాడు, వాడు ఉన్నది ఒక్కడు, మనం ఇంతమంది ఉన్నామని తెలుసు. వాడు నెగ్గలేడని కూడా తెలుసు అయినా ఇలా చేశాడంటే వాడు మనకు తెలియకుండా ఏదో చేశాడు.


ఆఫీసర్: కాసేపట్లో యువరాజ్ ఇక్కడికి వస్తున్నాడు యువరాజ్ కి మీనన్ కి లింక్ ఉన్నట్లు ఆధారాలు మన దగ్గర లేవు.


జగద్దాత్రి: లింక్ మన కళ్ళ ముందే ఉంది. ఆ లింక్ రామస్వామి. రామస్వామికి మీనన్ కి సంబంధాలు ఉన్నట్లు మనం నిరూపించగలిగితే మీనన్ కి యువరాజ్ కి కూడా సంబంధాలు ఉన్నట్లు మనం నిరూపించవచ్చు. కాబట్టి యువరాజ్, మీనన్ కలిసే ఏర్పాట్లు మనమే చేయాలి అంటుంది.