Prema Entha Madhuram November 27th Episode : మన వల్ల వచ్చిన సమస్యని మనమే తీర్చాలి అంటూ సుగుణ పేపర్ల మీద సంతకం పెట్టబోతుంది. కానీ అందుకు అను ఒప్పుకోదు.
అను: నేను చెప్పేది వినండి పేపర్ల మీద సంతకాలు పెట్టొద్దు అంటూ పేపర్లు చింపేస్తుంది.
రౌడీ: నీ పాప ప్రాణాలతో ఉండాలని లేదా ఎందుకు ఆ పేపర్లు చింపేస్తున్నావు అంటూ కోప్పడతాడు.
అను కోపంతో రెచ్చిపోయి ఆ రౌడీని నా పాప ఎక్కడ అంటూ చితకబాదుతుంది. అను దెబ్బలకి వాడు పారిపోతాడు.
సుగుణ: పాప వాడి చేతిలో ఉందని తెలిసి కూడా ఎందుకు అలా చేశావు.
అను: నావల్ల మీకు అన్యాయం జరగకూడదు పాపని ఎలా రక్షించుకోవాలో నాకు తెలుసు అంటూ సుగుణ వారిస్తున్న వినిపించుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.
మరోవైపు ఛాయాదేవి, మాన్సీ మాట్లాడుకుంటూ ఉంటారు.
ఛాయాదేవి: మనం ఇచ్చిన షాక్ కి అను విలవిలలాడిపోతూ ఉంటుంది.
మాన్సీ : నా గెస్ కరెక్ట్ అయితే ఈపాటికే ఆ సుగుణ చేత సంతకం పెట్టించి ఉంటుంది.
అంతలోనే అక్కడికి ఖాళీ చేతులతో వచ్చిన అనుని చూసి
ఛాయాదేవి : రాను నీ గురించే మాట్లాడుకుంటున్నాము ఇంతలోనే నువ్వు వచ్చావు సైన్ చేసిన పేపర్లు తీసుకువస్తావ్ అనుకుంటే ఇలా ఒట్టి చేతులతో వచ్చావ్ ఏంటి..
మాన్సీ: నీ కూతుర్ని వదిలేయమని బతిమిలాడటానికి వచ్చావా?
నా పాప ఎక్కడ ఉందో చెప్పండి అంటూ పిచ్చిదానిలాగా అరుస్తుంది అను. నా పాపని నాకు అప్పగించకపోతే మీ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడను అంటూ ఛాయాదేవి పీక పట్టుకోబోతుంది. ఇంతలోనే జలంధర్ ఫోన్ చేయడంతో అనుభూతిని వీడియో కాల్ లో చూపిస్తుంది ఛాయాదేవి.
జలంధర్: నీ కూతురికి ఏమవుతుందో అని భయపడుతున్నావా..
అను: నా కూతుర్ని ఏమీ చేయకు నీ శత్రుత్వం నాతో కదా మధ్యలో పిల్లలు ఏం చేశారు తనని వదిలేయ్ అని రిక్వెస్ట్ చేస్తుంది.
జలంధర్: పసిపిల్లల్ని చంపేసేంత కసాయి వాడిని కాదు అయినా నాకు ఇప్పుడు పగ, ప్రతికారాలు కంటే వాళ్ళు ల్యాండ్ పేపర్స్ ముఖ్యం వెళ్లి సుగుణ చేత సంతకాలు చేయించి తీసుకురా..
అను: అది ఆమె కష్టార్జితం తన పిల్లల భవిష్యత్తు కోసం దాచుకుంది ఆ ఆస్తి కోసం ఎలా ఆశపడుతున్నావు.
జలంధర్: బిజినెస్ లో మోరల్ ఎథిక్స్ పనికిరావు, నువ్వు నీ పిల్ల గురించి ఆలోచించు. నా ఆలోచన ఏ నిమిషంలోనైనా మారవచ్చు అని ఫోన్ పెట్టేస్తాడు.
మాన్సీ, ఛాయాదేవి కూడా వెళ్లి సంతకం పెట్టిన పేపర్స్ తీసుకొని రా అని చెప్పటంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అను.
మరోవైపు ఆర్య పాపని వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు.
జలంధర్: మనం ఈ ఏరియాలో ఉన్నట్టు ఎవరికీ తెలియకూడదు. ల్యాండ్ పేపర్స్ నా చేతికి వచ్చిన వరకు ఈ పాప నా హ్యాండ్‌లోనే ఉండాలని తన అనుచరులని హెచ్చరిస్తాడు. మీరు ఎక్కడ ఎలా దాక్కుకుంటారో తెలియదు. ఇక్కడికి మాత్రం ఎవరూ రాకూడదు అని చెప్పడంతో రౌడీలు అందరూ తలో దిక్కున వెళ్లి దాక్కుంటారు.
మరోవైపు ఆర్య జెండేకి ఫోన్ చేసి జలంధర్ ఫోన్ ట్రాప్ చేయమని చెప్తాడు.
జలంధర్: తన అనుచరులతో మాట్లాడుతూ మీ ఎవరి దగ్గర ఫోన్లు లేవు కదా ఎందుకంటే ఫోన్ల ద్వారా కూడా మనల్ని ట్రాప్ చేస్తారు. అందుకే ఫోన్ ఉపయోగించకండి. పోలీసులు గాని.. ఆర్య వర్ధన్ గాని మన ఏరియాలోకి వస్తే నాకు ఇన్ఫార్మ్ చేయండి. అందరూ అలెర్ట్‌గా ఉండండి అని అనుచరులందరినీ హెచ్చరిస్తాడు.
మరోవైపు పాప నన్ను వదిలేయండి నాకు భయంగా ఉంది నేను మమ్మీ దగ్గరికి వెళ్ళిపోతాను అని ఏడుస్తూ ఉంటుంది.
అంతలోనే ఆర్య వచ్చి రౌడీలు అందరినీ చితగ్గొట్టి చివరికి జలంధర్ వరకు వెళతాడు.
జలంధర్ ఆర్య తలకి గురిపెడతాడు. అయితే ఆ గన్ జలంధర్ వైపు తిప్పి ల్యాండ్ కాదు కదా అందులో మట్టిని కూడా ముట్టుకోనివ్వను. చెప్పు నీకు ల్యాండ్ కావాలా నీ ప్రాణం కావాలా అంటూ బెదిరిస్తాడు ఆర్య. భయంతో వణికిపోయిన జలంధర్ అక్కడ నుంచి ప్రాణ భయంతో పరుగులు తీస్తాడు.
మరోవైపు అను కూతురు కోసం ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఆర్య పాపని తీసుకొని ఇంటికి వస్తాడు. అది చూసి ఆనందపడుతుంది అను. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.