Jagadhatri Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో ధాత్రి చేతికి ఉన్న గాయాన్ని చూపించి ఇతనే పోలీసు అని చెప్తాడు యువరాజ్.


నిషిక: ఆ గాయం రాత్రి కూరగాయలు కోస్తుంటే అయింది అని చెప్తుంది.


ఆ మాటలకి షాక్ అవుతాడు యువరాజ్.


అయితే ముందు రోజు రాత్రి కేదార్ ధాత్రి దగ్గరికి వచ్చి యువరాజ్ అనుమానిస్తున్నాడు ఇప్పుడు ఆ గాయం సంగతి ఏమిటి అని అడుగుతాడు.


ధాత్రి: దానికి నేను ఒక ప్లాన్ వేసాను అని చెప్పి కుంకుమ నీళ్లు చేతి మీద వేసుకొని చాకు తెగి గాయం అయినట్లుగా నాటకం ఆడుతుంది. అది చూసిన నిషిక వాళ్ళు వంట జాగ్రత్తగా చేయాలి కదా అని ధాత్రి ని కసురుకుని వెళ్లిపోతారు.


గాయం అవడం చూసిన నిషిక అదే విషయం భర్తకు చెప్తుంది. ఎదుటి వాళ్ళని కొట్టే అంత సీను ధాత్రి కి లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.


మరోవైపు దివ్యాంక నిషిక దగ్గరికి వచ్చి పార్టీ ధూంధాం గా ఉంటుంది అనుకుంటే ఇలా చప్పగా ఉందేంటి అంటుంది.


నిషిక : అంత మాట అనేసారేంటి అయినా పార్టీలో ఇప్పుడు జోష్ వస్తుంది కపుల్ గేమ్ ఆడదాము అంటుంది.


దివ్యాంక : గేమ్ అంటే ఆడియన్స్ ఉండాలి కదా అంటుంది.


నిషిక : మీకు కావలసిన ఆడియన్ ని నేను బయటకు రప్పిస్తాను అంటుంది. తర్వాత కాచిని పిలిచి కీర్తి ఏడుస్తుందని చెప్పి వదినని బయటికి పిలువు అంటుంది. ఇంతలో ఇంట్లో వాళ్ళందరినీ హాల్లోకి రమ్మని చెప్పి కపుల్ గేమ్ పెడుతుంది. అంతలో కూతురు కోసం కౌషికి కూడా బయటకు వస్తుంది.


కౌషికి : ఇద్దరి ఫేసుల మధ్య బెలూన్ పెడతాను ఎవరు ఎన్ని బెలూన్లు పగలగొడతారో వాళ్లే విన్నర్ అంటుంది.


అయితే సురేష్, దివ్యాంక ఫెసస్ మధ్య బెలూన్ పెట్టుకొని ఆడుతుంటే కౌషికి బాధతో రగిలిపోతుంది అది గమనించిన దివ్యాంక ఆనందాన్ని పొందుతుంది. నేరుగా నిషిక దగ్గరికి వెళ్లి నీకు కడుపు మంటగా ఉన్నట్టుంది అంటూ ఆమెని రెచ్చగొట్టేలాగా మాట్లాడుతుంది.


కౌషికి: నేను వద్దనుకున్న వాళ్ళు ఎవరు ఎలా పోయినా నాకు అనవసరం. నీ గేమ్ అయ్యే వరకు నేను ఇక్కడే ఉంటాను అప్పుడైనా మిమ్మల్ని చూసి నేను కుళ్ళుకోవటం లేదు అని మీకు తెలుస్తుంది అంటుంది.


తర్వాత ధాత్రి కౌషికి దగ్గరికి వచ్చి ఆ దివ్యాంక ఎగిరెగిరి పడుతుంది తనని అవమానించే ఈ పార్టీ నుంచి పంపిద్దాము అని కౌషికి కి చెప్తుంది.


మరోవైపు యువరాజ్ మీనన్ కి ఫోన్ చేస్తాడు.


మీనన్: నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను నువ్వు అడిగిన వస్తువు నా మనిషి తీసుకొస్తున్నాడు అని చెప్తాడు.


యువరాజ్: నా ఇంట్లో ఉన్న దొంగ ఎవరో నాకు తెలిసిపోయింది. కానీ అది నిజం అని నిర్ధారించుకోవడానికి ఒక్క క్లూ కోసం వెయిట్ చేస్తున్నాను అంటాడు.


మీనన్: సరే ముందు నీ పని కానీ అని చెప్పి మా వాడు మీ ఇంటి ముందుకు వచ్చి రెండుసార్లు హార్న్ కొడతాడు అప్పుడు వాడు ఇచ్చిన బాక్స్లు తీసుకొని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు.


తర్వాత మీనన్ చెప్పిన వ్యక్తి ఒక బాక్స్ తో యువరాజ్ ఇంటికి వస్తాడు. నేను ఇస్తే అనుమానం వస్తుంది అందుకే నువ్వే ఇవ్వు అని చెప్పి పంపిస్తాడు.


యువరాజ్: నా ఆస్తికి నా తండ్రికి నాతో పోటీకి వస్తావా ఇకమీదట నీ బాధ నాకు ఉండదు ఈ బాంబు తో నీ పని ఫినిష్ అయిపోతుంది అనుకుంటాడు.


మరోవైపు దివ్యాంకని అవమానించడం కోసం బెలూన్స్ లో కలర్ వాటర్ నింపి పెడుతుంది ధాత్రి.


ఎందుకు వదిన అంటుంది మధు.


ధాత్రి : ఈ కలర్ నీళ్లు ఆ దివ్యాంక మీద పడేటట్లు చేస్తే తను ఆ డ్రెస్ తో ఉండలేక ఇంట్లోంచి వెళ్ళిపోతుంది అంటుంది. అయితే ఈ నీళ్లు తనమీద ఎలా పడేయాలా అని ఆలోచిస్తుంటే ధాత్రికి అటుగా వెళుతున్న బూచి కనిపిస్తాడు. అతడిని పిలిచి ఇది ఒక గేమ్ అని చెప్పి ఎవరికీ చెప్పకూడదు అని చెప్పి గేమ్ ఎలా ఆడాలో చెప్తుంది.


విషయం తెలియని బూచి ధాత్రి చెప్పింది నిజం అనుకుంటాడు. ధాత్రి చెప్పిందానికి సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత కేదార్ కి పార్సిల్ రావడంతో దానిని కిచెన్లోకి తీసుకువచ్చి ఓపెన్ చేయబోతాడు. అయితే ధాత్రి ఒక్క నిమిషం ఆగు అంటుంది. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.