Jagadhatri Telugu Serial Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో బూచికి జాగ్రత్త అని హేచ్చరించి వెళ్ళిపోతుంది ధాత్రి. తను ఎందుకు నాకు జాగ్రత్త చెప్తుంది అనుకుంటాడు. భార్యవైపు తిరిగేసరికి ఆమె కోపంగా తనవైపే చూస్తూ తనని చిదకబాదుతుంది.


మరోవైపు వంటగదిలోకి వస్తూనే కాయగూరలు అన్ని చేజార్చేస్తాడు కేదార్. అది చూసిన ధాత్రి మెల్లగా విసుక్కుంటుంది.


ధాత్రి : పనిమనిషి రాలేదని నాకు హెల్ప్ చేస్తానన్నావు ఇప్పుడు బానే చేస్తున్నావ్ అని కిచెన్లోంచి కేదార్ని బయటికి వెళ్లిపోమంటుంది.


కేదార్: నేను వెళ్ళను నీకు ఏదైనా హెల్ప్ చేస్తాను అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు.


ఇంతలోనే అక్కడికి వస్తుంది నిషిక.


నిషిక: ఇక్కడ ఏం చేస్తున్నావే, ఈ గదిలో నీకేం పని, ఇదేమైనా నీ అత్తగారిల్లా? ఇది నా అత్తగారిల్లు నేను వంట చేస్తాను నువ్వు బయటికి పో.


ధాత్రి: నువ్వు వంట చేస్తావా వద్దులే నేను చేస్తాను.


కోపంగా ధాత్రిని నెట్టేస్తుంది నిషిక. అప్పుడే అక్కడికి వచ్చిన కౌషికి ఆమెని పట్టుకుంటుంది.


కౌషికి: అలా నెట్టేస్తావేంటి నీకేమైనా పిచ్చా అని నిషికని మందలిస్తుంది.


నిషిక: తనని సపోర్ట్ చేస్తారు ఏంటి వదిన ఈ ఇంటికి కోడలు నేనా తనా?


కౌషికి: ఇద్దరూనూ. నీకు అక్క అంటే తను కూడా ఈ ఇంటికి కోడలులాంటిదే కదా అయినా తను వంట చేస్తానంటే నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి.


నిషిక : తనని వంట చేయొద్దని చెప్పండి 


కౌషికి: కారణం లేకుండా వద్దని చెప్పడం నాకు అలవాటు లేదు అని చెప్పటంతో నిషిక కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.


కౌషికి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాక నిషిక ఎప్పుడు మారుతుందో, ఎప్పుడు ఎదుటి మనుషుల్ని అర్థం చేసుకుంటుందో అనుకుంటుంది ధాత్రి.


మరోవైపు ఓటరు నమోదు కోసం ఇద్దరు వ్యక్తులు వస్తారు. కొత్త ఓటర్ కార్డు సిద్ధం చేసుకోవాలన్నా, ఉన్న ఓటర్ కార్డు ఐడి చేంజ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు అంటారు.


కౌశికి: నా కార్డు చేంజ్ చేయాలి, నా భర్త పేరు తీసేసి, నా తండ్రి పేరు ఆడ్ చేయాలి.


ధాత్రి: అప్పుడే ఇవన్నీ ఎందుకు.


కౌశికి: ఇది నా పర్సనల్ మేటర్, ఎవరు ఇన్వాల్వ్ కావటం నాకు ఇష్టం లేదు అని చెప్పి ఓటర్ ఐడి చేంజ్ చేయమంటుంది.


వచ్చిన వాళ్ళు డైవర్స్ కాపీ అడుగుతారు. లేదు అని చెప్పడంతో అయితే ఐడి చేంజ్ చేయడం అవ్వదు అంటారు. వేరే ఏమైనా మార్పులు ఉన్నాయా అంటారు.


కౌశికి : కేదార్ వాళ్ళ వైపు చూస్తూ వీళ్ళు నిజంగా పెళ్లి చేసుకున్నారా లేదా అనేది ఇప్పుడు తేలిపోతుంది అనుకుంటూ వాళ్ళని ఆగమని చెప్పి కేదార్ వాళ్ళని చూపించి వీళ్ళకి కొత్తగా పెళ్లయింది వీళ్ళ ఓటర్ ఐడి చేంజ్ చేయాలి. అందుకు మ్యారేజ్ సర్టిఫికెట్ కావాలేమో కదా తీసుకొని రండి అంటుంది.


ధాత్రి: ఇప్పుడెందుకు ఇవన్నీ, తర్వాత చూసుకుందాం.


కౌషికి: ఎప్పటికైనా మార్చుకోవాల్సిందే కదా అయినా ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావ్ అసలు మీకు పెళ్లి అయిందా, పెళ్లయితే మ్యారేజ్ సర్టిఫికెట్ ఉంటుంది కదా.


ధాత్రి: మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకోవటం మర్చిపోయాం.


కౌశికి: మీరు గుడిలో పెళ్లి చేసుకున్నాను అన్నారు కదా అక్కడైనా రిజిస్టర్ చేయించుకున్నారా అది కూడా మర్చిపోయారా..


ధాత్రి: రిజిస్టర్ చేసాం.


కౌషికి: ఇప్పుడు ఫామ్ ఫిల్ చేసేసి సర్టిఫికెట్ తర్వాత ఇవ్వచ్చు కదా అని వచ్చిన వాళ్ళని అడుగుతుంది. వాళ్ళు అలా చేయొచ్చు అంటారు. అప్పుడు ఫోన్ తీసుకుని ధాత్రి వాళ్ళని ఫామ్ ఫిల్ చేయమంటుంది కౌషికి.


ధాత్రి, కేదార్ ఇద్దరు ఫామ్ ఫిల్ చేసి వచ్చిన వాళ్ళకి ఇవ్వబోతాడు కేదార్. ఆ ఫామ్ చూసిన కౌషికి కోపంగా ఫామ్ తో పాటు కేదార్ ని కూడా పక్కకు తీసుకొని వెళుతుంది.


కౌషికి: నీకు ఎంత ధైర్యం ఉంటే వజ్రపాటి ఇంటి పేరు పెట్టుకుంటావు, అయినా ఎలాంటి రుజువులు లేకుండా ఈ ఇంటికి వారసుడివి ఎలా అవుతావు అని కోప్పడుతుంది.


ధాత్రి: ఈ ఇంటికి వారసుడు అని నిరూపించుకోవడానికి మాకు ఇంకా సమయం ఉంది. అయినా అందరూ మనల్ని చూస్తున్నారు ముందు ఫామ్ ఇచ్చేద్దాం తర్వాత మీకు రుజువులు నేను చూపిస్తాను అంటుంది. ఇప్పుడు గట్టిగా మాట్లాడితే రచ్చ అవుతుంది అనుకొని కౌషికి కూడా కామ్ గా ఊరుకుంటుంది.


ఇదంతా చూస్తున్నా నిషికకి వైజయంతికి ఏదో అనుమానం వస్తుంది. అక్కడి నుంచి వెళ్ళిపోతున్న ఓటర్ ఐడి కార్డు కోసం వచ్చిన వాళ్ళని ఆగమని ఒకసారి ఆ ఫార్మ్స్ మేము చూడొచ్చా అని అడుగుతారు. చూడొచ్చు అనడంతో ఆ ఫామ్ నిషిక, వైజయంతి చూస్తారు.


వైజయంతి: ఇంటిపేరును చూసి షాక్ అవుతూ తమ్ముడు తమ్ముడు అంటూనే మన ఇంటి పేరుని ఇచ్చేసింది, రేపు మన ఆస్తి కూడా ఇచ్చేస్తుంది ఉండు ఇప్పుడే వెళ్లి కడిగేస్తాను.


నిషిక: అన్నింటికీ గొడవలు వద్దు అని మీరే అంటారు కదా అత్తయ్య ఆగండి వాళ్ళని ముందు ఇంట్లోంచి పంపించేద్దాం, మన చేతికి మట్టి అంటకుండా పంపించాలి చేయాలి అంటుంది.


మరోవైపు స్వామి చెప్పినట్లు రక్తం అంటిన షర్టు వెతకడం కోసం కేదార్ వాళ్ళ రూంలోకి వెళ్లి వాళ్ల రూమ్ ని చిందరవందర చేసేస్తాడు యువరాజ్. అప్పుడే ధాత్రి వాళ్ళు రావడం చూసి కర్టెన్ వెనక్కి వెళ్లి దాక్కుంటాడు. ధాత్రి వాళ్లు రూమ్ అస్తవ్యస్తంగా ఉండడం చూసి కీర్తి పాపా అలా చేసిందేమో అనుకుంటారు. కానీ అక్కడ పడిపోయి ఉన్న ఒక ఫోటోని చూసి అనుమాన పడుతుంది ధాత్రి. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.