Bigg Boss Telugu 7:  బిగ్ బాస్ సీజన్ 7లో ఇంకా ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈ ఏడుగురిలో ఎవరు విన్నర్ అవుతారు అనేది అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బిగ్ బాస్ చూసే ప్రేక్షకులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ సైతం తమ ఫెవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు అని చెప్తూ.. వారికే సపోర్ట్ చేయమని కోరుతున్నారు. ఇక తాజాగా మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్, సీరియల్ నటి కీర్తి భట్ కూడా తన సపోర్ట్ ఎవరికో బయటపెట్టడంతో అమర్‌దీప్ ఫ్యాన్స్.. తనకు అనవసరమైన మెసేజ్‌లు పంపిస్తున్నారని ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫాలోవర్స్‌తో షేర్ చేసుకుంది. అంతే కాకుండా తనకు వస్తున్న మెసేజ్‌లపై చాలా సీరియస్‌గా రియాక్ట్ అయ్యింది.


కీర్తిపై అమర్ ఫ్యాన్స్ ఫైర్..
బిగ్ బాస్ సీజన్ 7లో గతవారం గౌతమ్ ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్లిపోయాడు. ఈ సందర్భంగా గౌతమ్ ఇంట్లో పార్టీ జరిగింది. ఆ పార్టీకి కీర్తి కూడా వెళ్లింది. అదే సమయంలో అక్కడి వచ్చిన పలు యూట్యూబ్ ఛానెళ్లు.. కీర్తిని ఇంటర్వ్యూ చేశాయి. ఆ సమయంలో అమర్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాడు. కానీ బాగానే ఆడుతున్నాడని చెప్పింది. అంతే కాకుండా ఎవరి సపోర్ట్ లేకుండా, సింగిల్‌గా ఆడుతున్నాడు కాబట్టి తన సపోర్ట్ అర్జున్‌కే అని చెప్పుకొచ్చింది. ఇక తను ఇచ్చిన ఈ రెండు స్టేట్‌మెంట్స్ సోషల్ మీడియాలో దుమారం రేపుతుండగా.. వాటిపై తాజాగా ఒక వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చింది కీర్తి.


బుర్ర పెట్టి మాట్లాడండి..
‘‘నేను ఎవరికి సపోర్ట్ చేస్తున్నాను, ఎవరికి సపోర్ట్ చేయడం లేదు అని మీకు చెప్పానా. ఎవరికీ సపోర్ట్ చేయడం లేదు అని కూడా నేను క్లియర్‌గా చెప్పలేదు. ప్రియాంక, శోభా, అమర్, అర్జున్.. వీళ్లందరూ నా ఫ్రెండ్సే. అందరినీ నేను సపోర్ట్ చేస్తాను. అమర్ కన్ఫ్యూజ్ అవుతున్నాడు అని మాత్రమే నేను అన్నాను. అంతే కాని తను బాగా ఆడడం లేదని నేనేం చెప్పలేదు. అమర్ ఫ్యాన్స్ అని చెప్పుకుంటున్న కొంతమంది నాకు మెసేజ్‌లు చేస్తున్నారు. యూట్యూబ్ వీడియోల కింద కామెంట్స్ పెడుతున్నారు. కొంచెం బుర్ర పెట్టి మాట్లాడండి. సెన్స్ లేకుండా ఇష్టం వచ్చింది మాట్లాడొద్దు. నేను కూడా బిగ్ బాస్ హౌజ్‌లో ఉండి వచ్చినదాన్నే కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు. నేను ప్రేక్షకురాలిగా చూస్తున్నందుకు వరకు అర్జున్ సపోర్ట్ లేకుండా సింగిల్‌గా ఆడి ఫినాలే అస్త్రా గెలిచాడు కాబట్టి తనకు నేను సపోర్ట్ అన్నాను’’ అని కీర్తి.. తన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో చెప్పుకొచ్చింది.


కొట్టాలి అనిపిస్తుంది..
తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో కొందరు పెడుతున్న మెసేజ్‌లపై సీరియస్‌గా రెస్పాండ్ అయ్యింది కీర్తి. ‘‘నువ్వు బిగ్ బాస్ ఉన్నప్పుడు తప్పు చేశాము అంటూ స్టేట్‌మెంట్స్ ఇస్తున్నారు. ఆ మెసేజ్‌లు చూస్తుంటే నాకు రక్తం మరిగిపోతుంది. రోడ్డు మీద కనిపిస్తే కొట్టాలి అనిపిస్తుంది. నేను సపోర్ట్ చేయమని అడిగానా? నా ఆట నచ్చింది కాబట్టి సపోర్ట్ చేసేవాళ్లు చేశారు. సింపతీ గేమ్ ఆడలేదు నేను. నా వేలు బాలేకపోయినా ఆడాను. ఫ్యాన్ వార్స్‌లో మీ సెన్స్ కోల్పోతున్నారు. మీరు చేసే పనుల వల్ల బాండింగ్ పాడవుతుంది. అందరూ కాదు.. కొందరు మాత్రమే ఇలా ఉన్నారు. నీ అమ్మ అంటూ చాలా నీచంగా మాట్లాడుతున్నారు. ఫ్యాన్స్ అయినా కూడా ఆలోచించి మాట్లాడండి, ప్రవర్తించండి’’ అంటూ సలహా ఇచ్చింది కీర్తి భట్.






Also Read: ఆడపిల్ల అని అడ్వాంటేజ్ తీసుకోకు, మంచిది కాదు - శోభాకు శివాజీ వార్నింగ్