Telugu Bigg Boss 7: ఓటు అప్పీల్ విషయంలో అమర్, అర్జున్ కంటెండర్లుగా నిలిచారు. ఇక వీరిద్దరిలో ఎవరికైతే హౌజ్‌మేట్స్‌లో మెజారిటీ సపోర్ట్ దొరుకుతుందో వారు ఓటు అప్పీల్ చేసుకోవచ్చు. ఇక ప్రియాంక, శోభాలు.. అర్జున్‌కే సపోర్ట్ చేసే ఛాన్స్ ఉందని అమర్‌తో చెప్పడంతో తను ఓటు అప్పీల్ విషయంలో ఆశలు వదిలేసుకున్నాడు. ‘స్పై’ బ్యాచ్ తనకు ఓటు వేయరని తెలిసినా కూడా అనవసరంగా వారితో గొడవపెట్టుకోవడం మాత్రమే కాకుండా.. నేను కెప్టెన్ అంటూ వారిపై అధికారం చూపించే ప్రయత్నం చేశాడు. అంతే కాకుండా కెప్టెన్ అంటూ తనకు ఏదైనా చేసే హక్కు ఉంది అన్నట్టుగా శివాజీకి కూడా వార్నింగ్ ఇచ్చాడు. కానీ అమర్ ప్రవర్తన నచ్చని శివాజీ.. తనపై రివర్స్ అయ్యాడు.


అమర్‌కు చేజారిన అవకాశం..
ముందుగా పల్లవి ప్రశాంత్.. వచ్చి అర్జున్‌కు ఓటు వేస్తున్నట్టుగా చెప్పాడు. అమర్‌తో గొడవ పెట్టుకోకుండా తన నిర్ణయాన్ని చెప్పి వెళ్లిపోదాం అనుకున్నాడు. కానీ అమర్ అలా జరగనివ్వలేదు. నన్ను మాట్లాడనివ్వు అంటూ ప్రశాంత్‌ను ఆపాడు. తనకు ఓటు వేయకపోవడానికి కారణం ఏంటని అడిగాడు. అర్జున్.. హౌజ్‌మేట్స్ కోసం కేక్ తిన్నాడని, ఉల్లిపాయలు కూడా తిన్నాడని గుర్తుచేశాడు. అయినా కూడా ఆ కారణాలతో అమర్ తృప్తిపడలేదు. తర్వాత శివాజీ కూడా అర్జున్‌కే తన సపోర్ట్ అని చెప్పాడు. ఓటింగ్ విషయంలో అర్జున్ చివర్లో ఉన్నాడు కాబట్టి తనకు సపోర్ట్ అవసరమని చెప్పాడు. ఇక ‘స్పై’ బ్యాచ్‌లో మిగిలిన యావర్ కూడా అర్జున్‌కే తన సపోర్ట్ అన్నాడు. ఓటు అప్పీల్ అవకాశం చేజారిపోయినందుకు అమర్‌కు కోపం వచ్చింది. ఆ కోపమంతా యావర్‌పై చూపించాడు. 


డర్టీ గేమ్..
యావర్ వచ్చి అర్జున్‌కు తన సపోర్ట్ అని చెప్పగానే ‘‘నీతో మంచివాళ్లు అనిపించుకోవడానికి డ్రామాలు ఇవన్నీ’’ అంటూ అర్జున్‌తో చెప్పాడు అమర్. అయితే అర్జున్‌తో తను ఇంకా మాట్లాడడం లేదని, అయినా కూడా తనకే సపోర్ట్ అని యావర్ క్లారిటీ ఇచ్చాడు. సరే ఇంక వెళ్లు అని వ్యంగ్యంగా అమర్ అనగానే.. యావర్‌కు కోపం వచ్చింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలయ్యింది. ‘‘నువ్వెవరు నన్ను వెళ్లు అని చెప్పడానికి’’ అని ప్రశ్నించాడు. ‘‘నేను ఈ హౌజ్‌కు కెప్టెన్’’ అని అరవడం మొదలుపెట్టాడు అమర్. నువ్వు కెప్టెన్ కాదు అని అనగానే.. కెప్టెన్, కెప్టెన్ అని పదేపదే అంటూ సహనం కోల్పోయాడు. ‘‘నీది సేఫ్’’ అని యావర్‌ను ఆరోపించాడు. అది యావర్‌కు నచ్చక.. ‘‘నీదే డర్టీ గేమ్’’ అని రివర్స్ అయ్యాడు.


యావర్ అన్న ఒక్క మాటకు అమర్ నానార్థాలు తీశాడు. ‘‘నాదే డర్టీ గేమ్, నేనే వేస్ట్ ఫెలో అంట, నేనే పిచ్చోడిని అంట, నేనే పనికిమాలినోడిని అంట’’ అంటూ సంబంధం లేకుండా రెచ్చిపోయాడు. కెప్టెన్ అయితే మెల్లగా చెప్పాలని, కోపంగా చెప్తే తాను వినను అని తేల్చి చెప్పాడు యావర్. అయితే శివాజీ ఏమైనా అంటే తాను సరదాగా తీసుకుంటానని, ఇంకెవ్వరు తన కెప్టెన్సీ గురించి సరదాగా ఏమన్నా కూడా ఒప్పుకోను అని, డెప్యూటీలుగా వారు కూడా ఏమనకుండా తన మాట వినాలి అని సీరియస్‌గా శివాజీకి వార్నింగ్ ఇచ్చాడు అమర్. ఈ మాటకు శివాజీ అంగీకరించలేదు. కెప్టెన్‌గా ఏదైనా చెప్పడం తన బాధ్యత అని, ఒకవేళ అది హౌజ్‌మేట్స్‌కు నచ్చకపోతే తిరిగి అరిచే అధికారం వారికి కూడా ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. ఇన్ని వాగ్వాదాల మధ్య అర్జున్‌కు ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం దొరికింది.


Also Read: 'యానిమల్' వేశారు, నాన్న కోసం వెళితే - హైదరాబాద్ థియేటర్‌లో షాక్!