Jagadhatri December 1st Episode: ఈరోజు ఎపిసోడ్ లో తనకి గిఫ్ట్ ఇచ్చిన సురేష్ ని ఆగమని చెప్తుంది నిషిక.


నిషిక : అన్నయ్య ఈ చీర రేటు ఎంత, ఎక్కడ కొన్నారు అంటుంది. ఓ 1500 ఉంటుందా ఎందుకంటే అంతకుమించిన రేంజ్ కాదు కదా మీది. మీలాంటి చీప్ మనిషిని ఈ ఇంటికి అల్లుడు అని చెప్పుకోవటానికి ఇబ్బందిగా ఉంది. వ్యాపారం చేయాలంటేనే రేంజ్ చూసే మా వదిన మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంది అంటేనే ఆమె రేంజ్ ఏంటో తెలుస్తుంది. మీరు ఇచ్చే గిఫ్ట్ రేంజ్ ఏంటో తెలుసా అంటూ ఆ చీరని పనిమనిషి చేతిలో పెట్టబోతోంది.


ధాత్రి: ఆ చీరని అందుకొని పనిమనిషిని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పి, గిఫ్ట్ ఇవ్వడానికే కాదు అందుకోవడానికి కూడా ఒక రేంజ్ ఉండాలి. ఈ గిఫ్ట్ అందుకునే రేంజ్ నీది కాదు. అయినా పార్ట్నర్ గురించి ఏదో మాట్లాడుతున్నావు నిజానిజాలు తెలుసుకుంటే ఎవరి పార్ట్నర్ ఎలాంటివారో తెలుస్తుంది అని చెప్పి సురేష్ వైపు తిరిగి మీరు ఎంతో అభిమానంతో తెచ్చిన ఈ చీరని నేను ఉంచుకుంటాను అంటుంది. సురేష్ థాంక్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.


మరోవైపు ఆటోలో వస్తున్న మాధురి భయపడిపోతూ ఉంటుంది.


మాధురి: నాకు చాలా భయంగా ఉంది భరత్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోదాం. నేనుగా వెళ్లి చెప్తే నమ్ముతారు వాళ్లకుగా వాళ్ళు వెతుక్కుని వస్తే నేను చెప్పేది నమ్మరు.


భరత్: నువ్వు వెళ్లి చెప్తే డబ్బున్న అమ్మాయి ఒళ్ళు పొగిరెక్కి ఇలా చేసింది అంటారు అంతేకానీ ఎవరూ సానుభూతి చూపించరు. నీ వరకు పోలీసులు వస్తే నేరాన్ని నామీద వేసుకుంటాను అని భరోసా ఇస్తాడు. ఏమి జరిగినట్లే కామ్ గా ఇంటికి వెళ్లిపో అంటాడు.


మరోవైపు ఇంట్లో కీర్తి కేక్ కట్ చేయను అని మారం చేస్తుంది. ఆమెని ఒప్పించి కేక్ కట్ చేసేలాగా చేస్తుంది ధాత్రి. అప్పుడే అందరూ మాధురి ఏది కనిపించడం లేదు అనుకుంటారు. అప్పుడే ఇంటికి వచ్చిన మాధురి కామ్ గా తన రూమ్ కి వెళ్ళిపోతుంటే..


కౌషికి : ఇంతసేపు ఎక్కడికి వెళ్లావు.


మాధురి: చెప్పాను కదా అక్క ఫ్రెండ్ అమెరికా వెళ్ళిపోతుంటే పార్టీ ఇచ్చారు అక్కడికే వెళ్లాను.


వైజయంతి : అందరూ ఇక్కడ ఉంటే కామ్ గా వెళ్ళిపోతున్నవేమి.. కీర్తికి కేక్ తినిపించి వెళ్ళు అనటంతో కీర్తికి కేక్ తినిపించి కంగారు కంగారుగా తన రూమ్ కి వెళ్ళిపోతుంది మాధురి.


మాధురి ఎందుకో కంగారు పడుతుంది అనుకుంటారు ధాత్రి, కేధర్. మరోవైపు కేకు తినటానికి మారం చేస్తూ ఉంటుంది కీర్తి. ఆమెకి తన తండ్రి తెచ్చిన గిఫ్ట్ ని చూపిస్తుంది ధాత్రి. అప్పుడు కీర్తి హ్యాపీగా ఫీల్ అయ్యి కేక్ తింటుంది.


కౌషికి: నా కూతురు మొహంలో తన పుట్టినరోజు నాడు సంతోషం చూడగలిగానంటే నీ వల్లే అని ధాత్రికి థాంక్స్ చెప్తుంది.


ధాత్రి : తన సంతోషం ఎక్కడ ఉందో మీకు తెలుసు కదా అటువంటి అప్పుడు ఆ సంతోషాన్ని ఆమెకి ఇవ్వచ్చు కదా.


కేదార్ : పిల్లలకి తండ్రి ప్రేమ లేకపోతే ఎంత బాధ పడతారో నాకు తెలుసు. కీర్తికి తండ్రి ప్రేమని దూరం చేయొద్దు.


కౌషికి: నేను సురేష్ ని అమితంగా ప్రేమించాను.. అలాంటి మనిషి నాకు ఇంత బాధని మిగిల్చాడు. అతనిని క్షమించేది లేదు నా బిడ్డకి తండ్రి అవసరం లేకుండానే పెంచుతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.


ధాత్రి : తన చుట్టూ ఇంత మంది ఉన్నా తను ఎంత ఒంటరిగా ఫీల్ అవుతుందో వదిన మాటల్లోనే తెలుస్తుంది అంటుంది.


మరోవైపు మాధురి ఏడుస్తూ చీకట్లో తన గదిలో కూర్చుంటుంది. అప్పుడే అక్కడికి వస్తారు ధాత్రి, కేధర్. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply