Jagadhatri Telugu Serial Episode: ఈరోజు ఎపిసోడ్ లో మాధురి గదికి వచ్చిన ధాత్రి, కేధర్ ఏం జరిగింది అని అడుగుతారు.
మాధురి: కొంచెం బాడీ పెయిన్స్.
ధాత్రి : ఇందాక తలనొప్పి అన్నావు.
మాధురి: కంగారుగా అదే తలనొప్పి, ఒళ్ళు నొప్పులు రెండు ఉన్నాయి.
కేదార్: ఏమైనా ప్రోబ్లమా, మేమేమైనా హెల్ప్ చేయగలమా
మాధురి: నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని నేను మీకు చెప్పానా అంటూ ఫ్రెస్టేట్ అయిపోతుంది.
సరే రెస్ట్ తీసుకో ఏమైనా అవసరమైతే మమ్మల్ని పిలువు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ధాత్రి దంపతులు. బయటికి వచ్చిన తర్వాత
కేదార్: తను కచ్చితంగా అబద్ధం చెప్తుంది మనం వెళ్లడానికి ముందు వరకు ఏడుస్తుంది.
ధాత్రి : నాకు తెలిసి తను ఇప్పుడు కూడా ఏడుస్తూ ఉంటుంది. రేపు పొద్దున్నే తనతో మాట్లాడుతాను.
మరోవైపు నిషిక భర్తని 10 లక్షలు డబ్బు అడుగుతుంది.
యువరాజ్: అంత డబ్బు కావాలంటే అక్కని అడగాలి.
నిషిక : ప్రతి దానికి అక్క, అక్క అంటే నీకు ఎలా ఉందో గానీ నాకు కంపరంగా ఉంది. రేపు మన పిల్లలు పుట్టాక కూడా ప్రతిదానికి మీ అక్కని అడుగుతావా అంటూ చిరాకు పడుతుంది. అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను. రేపటి నుంచి నేను కూడా ఆఫీస్ కి వెళ్తాను. కంపెనీకి సీఈఓ అవుతాను.
యువరాజ్: 70% షేర్స్ అక్క పేరు మీదే ఉన్నాయి.
నిషిక: కానీ మిగతా 30% షేర్స్ మన పేరు మీదే ఉన్నాయి. అవి చాలు మీ అక్కని పక్కన పెట్టడానికి.
ఇదంతా విన్న వైజయంతి, కాచి, ఆమె భర్త కిందికి వస్తారు.
వైజయంతి : ఇన్నాళ్లు మాకు ఈ ధైర్యం లేక ఊరుకున్నాము. నీ కళ్ళల్లో కసి చూస్తుంటే సరి అయిన కోడల్ని తెచ్చుకున్నాను అనిపిస్తుంది. నీకు సపోర్టుగా మేము అందరం ఉంటాము.
మరోవైపు స్నానం చేసి తల తుడుచుకుంటున్న భార్యను చూసి ఫ్లాట్ అయిపోతాడు కేదార్. ఆమెకు దిష్టి తగలకుండా దిష్టి చుక్క పెడతాడు.
ధాత్రి : మా నాన్న కూడా ఎప్పుడు ఇలాగే దిష్టి చుక్క పెట్టేవారు. నన్ను మా నాన్నలాగా చూసుకుంటున్నందుకు థాంక్స్.
కేదార్: బయట వాళ్లకి భర్తను కదా ఆ మాత్రం బాధ్యత ఉంటుంది అంటాడు. మనసులో మాత్రం నా ప్రేమని నీకు ఎప్పుడు చెప్తానో, నువ్వు శాశ్వతంగా నా భార్యగా ఎప్పుడు ఉంటావో అనుకుంటాడు.
ఆ తర్వాత కేదార్ షర్ట్ బటన్ ఊడిపోతే ఆ బటన్ కుడుతూ ఉంటుంది ధాత్రి.
కౌషికి: అప్పుడే అటువైపుగా వస్తూ మీ ఇద్దరూ చూడటానికి దగ్గరగా ఉన్నా ఎందుకో దూరంగా ఉన్నారనిపిస్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వారిలో ఉండే దగ్గరతనం మీలో లేదు అంటూ మీరు అడిగిన నెల రోజులు గడువులో అప్పుడే వారం అయిపోయింది. మిగిలిన మూడు వారాలలో మీరు సాక్షాలు తీసుకురాకపోతే ఇంట్లోంచి బయటకు వెళ్లడానికి సిద్ధంగా ఉండండి అని హెచ్చరించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
కేదార్: ఇప్పుడు ఎలా మన దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవు.
ధాత్రి : నువ్వు ఈ ఇంటి వారసుడివి అనే ఆధారాలు ఎక్కడో దగ్గర ఉండే ఉంటాయి. అవి కచ్చితంగా సంపాదించి నువ్వు ఈ ఇంటి వారసుడివని నిరూపిస్తాను.
మరోవైపు కేదార్ వాళ్ళ ఇంటికి పోలీసులు వస్తారు. మా అబ్బాయి నిన్న ఎంక్వయిరీకి వచ్చాడు కదా అతని తప్పేమీ లేదని చెప్పారు కదా మళ్లీ మీరు ఎందుకు వచ్చారు అని అడుగుతాడు యువరాజ్ తండ్రి.
పోలీసు : నేను అందుకోసం రాలేదు మాధురి మీ అమ్మాయే కదా.
యువరాజ్ తండ్రి : అవును ఇప్పుడు తను ఎందుకు
పోలీస్: పిలిపించండి మాట్లాడుతాను అనటంతో మాధురిని పిలుస్తుంది కౌషికి .
కిందికి వచ్చిన మాధురితో నువ్వు నిన్న రిసార్ట్ కి వెళ్ళావా అని అడుగుతాడు. వెళ్లాను అంటుంది మాధురి.
ధాత్రి: ఎందుకు అంత ప్రత్యేకంగా అడుగుతున్నారు.
పోలీస్ : నిన్న అక్కడ ఒక హత్య జరిగింది అని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply