Jagadhatri Serial Today Promo కౌషికి, సురేశ్‌లకు రెండో సంతానంగా బాబు పుడతాడు. కౌసికికి కూతురు కీర్తి పుట్టుకతో మూగది. ఇప్పుడు కొడుకు పుట్టడంతో వారసుడి అయిపోతాడని తనకు ఇబ్బంది అని యువరాజ్, నిషిక, వైజయంతి అనుకొని ఆ బాబుని కిడ్నాప్ చేసి రాష్ట్రం దాటించేసి అడుక్కునేవాళ్లకి ఇచ్చేయాలని ప్లాన్ చేస్తారు. జేడీ, కేడీలు అప్పుడు బాబుని రక్షిస్తారు. అయితే కౌషికి భర్త, అత్త ఆదిలక్ష్మీలు ఇంటికి ఆదిలక్ష్మీతో ఆ బాబు మీ వారసుడు కాదు అని నిషిక, వైజయంతిలు ఆదిలక్ష్మీకి నమ్మించడంతో గతంలో ఆదిలక్ష్మీ నానా రచ్చ చేస్తుంది. బాబుని అనాథాశ్రమంలో వదిలేయాలని ప్రయత్నిస్తుంది. చివరి నిమిషంలో జగాద్ధాత్రి, కేథార్లు బాబుని ఆదిలక్ష్మీ చెర నుంచి రక్షిస్తారు. ఈ తరుణంలో ఇన్నాళ్లు రాని ఆదిలక్ష్మీ మళ్లీ వచ్చి బాబుని కిడ్నాప్ చేయించడం ఆసక్తికరంగా మారింది. అసలు ప్రోమోలో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
“ కౌషికి కుటుంబం మొత్తాన్ని తీసుకొని గుడికి వస్తుంది. ఆ విషయం తెలుసుకున్న ఆదిలక్ష్మీ రౌడీలను పురమాయించి ఏం జరిగిందో తెలిసే లోపు కౌషికి చేతిలో బిడ్డ లేడు అని కౌషికికి తెలిసేలోపు బిడ్డని కిడ్నాప్ చేయాలని చెప్తుంది. దాంతో ఓ రౌడీ ఎవరూ లేని టైంలో కౌషికిని చూసి విజల్ వేయడం మరో రౌడీ వచ్చి కౌషికి కంట్లో కారం కొట్టేస్తాడు. అప్పుడే ఓ మహిళ వచ్చి కౌషికి చేతిలో ఉన్న బాబుని లాక్కొని వెళ్లిపోతుంది. నా బాబు.. బాబు.. నా బాబు అని కౌషికి అరుస్తుంది. దాంతో జగద్ధాత్రి, కేథార్, సుధాకర్, నిషిక, వైజయంతిలు కౌషికి దగ్గరకు వస్తే కౌషికి బాబుని ఎవరో తీసుకెళ్లిపోయారని చెప్తుంది. అందరూ షాక్ అయిపోతారు. కిడ్నాపర్లు బాబుని తీసుకొని పారిపోతుంటారు. జగద్ధాత్రి, కేథార్ పరుగులు పెడతారు. కేథార్ అమ్మవారి ముందు మా అక్క కొడుకు చావుతో యుద్ధం చేసి ఈ భూమ్మీదకి వచ్చాడమ్మా ఆ ప్రాణాన్ని నువ్వు కాపాడాలమ్మా అని వేడుకుంటాడు. అప్పుడే రౌడీ బాబుని ఎత్తుకొని పరుగెడుతూ ఓ అమ్మాయిని ఢీ కొడతాడు. ఆ అమ్మాయి వాళ్లని అనుమానంగా చూస్తుంది. దీంతో ఇవాళ్టి ప్రోమో పూర్తయిపోతుంది.”
యువరాజ్, నిషిక, వైజయంతిలు ఆదిలక్ష్మీతో కౌషికి దగ్గరున్న బాబు నీ కొడుకు వారసుడు కాదు.. ఎవడో అనాథ ఆ బాబుకి కౌషికి చాలా దగ్గరైపోతుంది. అలా అయితే నీ మనవరాలు కీర్తి అన్యాయం అయిపోతుందని రెచ్చగొడతారు. అందుకే ఆదిలక్ష్మీ ఇంట్లో చాలా గొడవలు పెడుతుంది. డీఎన్ఏ టెస్ట్లు కూడా చేయిస్తుంది. యువరాజ్ తన పలుకుబడి వాడు డీఎన్ఏ టెస్ట్లో బాబు కౌషికి కొడుకు కాదు అని వచ్చేలా చేస్తాడు. జగద్ధాత్రి, కేథార్ డీఎన్ఏ రిపోర్ట్స్ చేసిన వ్యక్తి ఫేక్ రిపోర్ట్స్ చేశాడని నిరూపిస్తారు. ఆ క్షణానికి ఆదిలక్ష్మీ తన అనుమానం పక్కన పెట్టి బాబు వారసుడే అని అనుకొని కౌషికి వాళ్లతో కలిసి ఉండలేక వెళ్లిపోతుంది. ఇన్ని రోజుల తర్వాత ఈ కిడ్నాప్ ప్లాన్ చేసింది అంటే యువరాజ్, నిషిక, వైజయంతి వాళ్లు మళ్లీ ఆదిలక్ష్మీకి ఏమైనా చెప్పారా? లేదంటే ఆదిలక్ష్మీ తనంతట తానే బాబుని దూరం చేయాలి అనుకుందా తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే!