Ammayi garu Serial Promo Today అందరూ చనిపోయిందని అనుకున్న రూప తల్లిదండ్రుల్ని కలపడానికి రుక్మిణిగా గెటప్ మార్చుకొని రెండో కూతురిగా ఎంట్రీ ఇస్తుంది. అంతా బాగుంది అనుకునే టైం నేను రూపని చనిపోలేదు బతికే ఉన్నానని నాటకం మొదలు పెడుతుంది కోమలి. విజయాంబిక, దీపక్‌లు కోమలిని రూపగా రప్పించడం వల్ల కోమలి రూప గురించి మొత్తం తెలుసుకొని తానే రూప అందర్ని నమ్మిస్తుంది. కోమలికి ఓ లవర్ ఉండటం, అతను దొంగతనానికి సూర్యప్రతాప్ ఇంటికి రావడం.. రాజు అతన్ని చూడటం.. నిన్నటి ఎపిసోడ్‌లో సూర్యప్రతాప్ ఫ్యామిలీని చంపడానికి బాంబ్ పెట్టారని అశోక్‌ రాజుతో చెప్పడంతో ఇవాళ్టి ప్రోమో ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ప్రమోలో ఏం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

“ రాజు ఇంటి బయట నిల్చొని బాంబ్ బ్లాస్ట్ గురించి ఆలోచిస్తుంటే రుక్మిణి, విరూపాక్షి రాజు దగ్గరకు వస్తారు. రుక్మిణిగా ఉన్న రూప రాజుతో అక్కడ బాంబ్ ఉందని నీకు ముందే తెలుసా రాజు అని అడుగుతుంది. ఇదంతా ఎవరు చేశారు? విజయాంబిక చేయించిందా అని విరూపాక్షి అడుగుతుంది. దానికి రాజు కాదమ్మ గారు పొద్దున్న ఇళ్ల పట్టాల పంపిణీకి వచ్చినప్పుడు నిన్ను ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చిన వాడు కనిపించాడు. వాడిని వెంబడించి పట్టుకున్నాను. వాడిని పెద్దయ్యగారి ముందు ఉంచాలని ఈడ్చుకొస్తుంటే వాడు చెప్పాడు. అమ్మాయి గారి ప్లేస్‌కి వచ్చి అమ్మాయి గారిలా నటిస్తుంది కదా ఆ అమ్మాయి ప్లాన్ ఇదంతా అని రాజు చెప్తాడు. రూప ఆవేశంగా నా కుటుంబం జోలికి వస్తే ఏం జరుగుతుందో దానికి తెలియాలి. భయం అంటే ఏంటో దానికి చూపిస్తాను. అని రూప ఆవేశంగా కోమలి దగ్గరకు వెళ్లి కోమలిని చితక్కొడుతుంది.” దీంతో ప్రోమో పూర్తయిపోతుంది.

 

సూర్యప్రతాప్ ఫ్యామిలీ మొత్తాన్ని లేపేయాలని విజయాంబిక దీపక్‌లు జీవన్‌తో చేతులు కలుపుతారు. తమ్ముడి కుటుంబంతో పాటు తామే రూపగా ఇంటికి తీసుకొచ్చిన కోమలిని కూడా చంపించేస్తే ఇక తమకు ఏ అడ్డు ఉండదు అని విజయాంబిక, దీపక్‌లు కోమలికి కూడా బాంబ్ ప్లాన్ గురించి చెప్పరు. అయితే జీవన్ బాంబ్ బ్లాస్ట్ చేయమని కోమలి లవర్ అశోక్‌ని పురమాయిస్తాడు. అశోక్ బాంబ్ ఏర్పాటు చేసిన తర్వాత మీటింగ్ జరిగే చోట కోమలిని చూసి విషయం చెప్తాడు. కోమలి విజయాంబిక, దీపక్‌లకు విషయం చెప్పి వాళ్లతో పాటు తాను కూడా తప్పించుకోవడానికి రకరకాల ప్లాన్స్ చేస్తుంది. తాజా ప్రోమో ప్రకారం రాజు కోమలిని అనుమానించడం రూప ఆవేశంగా కోమలి దగ్గరకు వెళ్లి చితక్కొట్టడం చూస్తుంటే కోమలితో నిజం చెప్పించే వరకు ఊరుకునేలా లేదు. అయితే కోమలికి ప్లాన్ ముందే తెలియకపోవడం వల్ల అశోక్ పేరు బయట పెడుతుందా! విజయాంబిక దీపక్‌లను ఇరికిస్తుందా! లేదంటే విజయాంబిక, దీపక్‌లే రూప బారి నుంచి కోమలిని రక్షిస్తారా.. కోమలి ఈ సమస్య నుంచి తాను గట్టెక్కి తన లవర్‌ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుందా! ఇంకేమైనా ప్లాన్ చేస్తుందా తెలియాలి అంటే మొత్తం ఎపిసోడ్ వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే.!