Continues below advertisement

Jagadhatri Serial Today Episode జగద్ధాత్రి, నిషికలకు పిల్లలు పుట్టడం లేదని ఇంటికి వచ్చిన వాళ్లు అవమానిస్తారు. కేథార్ బాధగా వెళ్లిపోతాడు. జగద్ధాత్రి కేథార్ కోసం వెళ్తుంది. ఇక మీనన్ యువరాజ్ తనకి నో చెప్పడంతో యువరాజ్‌ని బెదిరించడానికి టీనాని వజ్రపాటి ఇంటికి పంపిస్తాడు.

టీనా మేకప్ ఆర్టిస్ట్‌ అని చెప్పి ఇంట్లోకి వస్తుంది. ప్రియాని పిలిస్తే నువ్వు వచ్చావ్ ఏంటి అని కౌషికి అడిగితే తను పని మీద వెళ్లి నన్ను పంపిందని అంటుంది. ఏం అవసరం లేదు వెళ్లిపో అని నిషిక అంటే వైజయంతి ఆ మాటలు పట్టించుకోవద్దు వెళ్లి ఫేషియల్ చేసుకో అని చెప్పి ఒప్పించి నిషిని పంపిస్తుంది. మరోవైపు జగద్ధాత్రి కేథార్ దగ్గరకు వెళ్తుంది. మనలో ఏం లోపం లేదు అన్నా ఉందీ అంటున్నారు.. కనీసం మనుషుల్లా ప్రవర్తించడం లేదు మనసు చివుక్కుమంటోదని జగద్ధాత్రి అంటుంది. మనమేంటో మన మనసుకి తెలుసు కదా.. ఎందుకు మనకు పిల్లలు వద్దు అనుకుంటున్నామో మనకు తెలుసు కదా.. మనకి పిల్లలు కావాలి అని ఉంది కానీ వాళ్లు నీ తండ్రి ఎవరూ అని అడిగితే చెప్పుకోలేక కదా మనం ఆగుతున్నాం.. మా తాత ఎవరో అని చెప్పుకోలేరు అనే కదా ఆగుతున్నాం అని కేథార్ అంటాడు.

Continues below advertisement

కేథార్ జగద్ధాత్రితో ఇక నా స్వార్థం కోసం నిన్ను బాధ పెట్టాలి అనుకోవడం లేదు.. త్వరలోనే మనం తల్లిదండ్రులు అవుదాం అని అంటాడు. తల్లి ప్రేమ నువ్వు చూస్తావ్.. తండ్రిగా నేను ఆ ప్రేమ ఆస్వాదిస్తా అని అంటాడు. మరోవైపు టీనా నిషికకు మేకప్ చేయడానికి ఐటెమ్స్ తీసి మీనన్‌తో మాట్లాడుతుంది. మీనన్‌ టీనాతో యువరాజ్ భార్య ప్రాణాలు తీసేయ్ అని చెప్తాడు. నీ భార్య శవంతో ఈ భాయ్ అంటే నీకు ఏంటో అర్థమైపోతుందని మీనన్ అనుకుంటాడు.

టీనా గదిలో డోర్ విండోస్ అన్నీ లాక్ చేస్తుంది. తర్వాత నిషిక తలకు మసాజ్ చేస్తా అని ఓ కవరుతో నిషిక ముఖాన్ని బిగించేస్తుంది. ఊపిరి ఆడక నిషికి ఇబ్బంది పడుతుంది. ఇక కేథార్ జగద్ధాత్రిని మాధురి దగ్గరకు వెళ్తాడు. జగద్ధాత్రి బయటకు వచ్చే టైంకి నిషిక ముఖం మీద కవర్ తీసేస్తుంది. దాంతో టీనా నిషికను కొడుతుంది. నిషిక కేకలు జగద్ధాత్రి విని డోర్ దగ్గరకు వెళ్తుంది. ఏదో పడినట్లు సౌండ్ వినిపించింది మరి గదిలో ఎవరు ఉన్నారు అనుకుంటుంది. యువరాజ్ నిషిక ఏమైనా గొడవ పడుతున్నారా అనుకుంటుంది. కానీ యువరాజ్ వదిన గదిలో ఉన్నాడు కదా అని గుర్తొచ్చి అనుమానంతో వెనక వైపు కిటికీ దగ్గరకు వెళ్తుంది.

నిషిక టీనాని బతిమాలుతుంది. టీనా నిషిక గొంతు నులుపి తలగడ అడ్డు పెట్టడం జగద్ధాత్రి కిటికీ నుంచి చూస్తుంది. నిషి నిషి అని అరుస్తుంది. నిషిని టీనా కొట్టడంతో నిషి పడిపోతుంది. టీనా నిషికి గన్ గురి పెట్టే టైంకి జగద్ధాత్రి గదిలోకి వస్తుంది. జగద్ధాత్రి చూసి షాక్ అయిపోతుంది. టీనా జగద్ధాత్రిని చూడదు. జగద్ధాత్రి సెంటు బాటిల్తో గన్ మీద తంతుంది. పోలీస్ జగద్ధాత్రి ఆదిశక్తిలా టీనాని వాయించేస్తుంది. టీనా గన్తోనే టీనాని బెదిరించి ఎవరు పంపించారు అని అడుగుతుంది. టీనా చెప్పకపోవడంతో టీనా అరచేతిలో కాల్చేస్తుంది. బులెట్ సౌండ్ విన్న కేథార్ జేడీ అని అనుకుంటాడు. కౌషికితో పాటు ఇంట్లో అందరూ సౌండ్ విని కంగారు పడతారు.

టీనా జగద్ధాత్రిని తోసేసి పారిపోతుంది. నిషిని ఏమైనా చేసిందేమో అని అందరూ కంగారుగా మేడ మీదకు వస్తారు. అందరూ మేడ మీదకు రావడం జగద్ధాత్రి గన్తీసుకొని టీనా కోసం బయటకు పరుగులు తీయడం కౌషికి చూస్తుంది. కేథార్ కూడా చూస్తాడు. నిషిని అందరూ లేపుతారు. జగద్ధాత్రి ఆలోచించి ఇది వచ్చింది పార్లర్ నుంచి కాదు నిషిని చంపడానికి ఎవరు అయింటారు అని అనుకుంటుంది. అందరూ ఏమైందని అడిగితే టీనా చంపడానికే వచ్చిందని చెప్తుంది. అందరూ షాక్ అయిపోతారు. నిషి కౌషికిని చూస్తూ వదిన నన్ను చంపించాలని అనే దాన్ని రప్పించుంటుందని అంటుంది. అలా ఎలా అనుకుంటావ్ నిషి అని కౌషికి అంటుంది. నేను సాక్ష్యాలు లేకుండా మాట్లాడటం లేదు అది నాతో చెప్పింది చెప్పిన మాట వినకపోతే చంపేస్తా అని అంది అని అంటుంది. యువరాజ్కి వచ్చింది భాయ్ మనిషే అని అర్థమైపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.