Serial Actress Deepthi Manne Introduced Her Boy Friend: కన్నడ సీరియల్స్‌తో ఇండస్ట్రీకి పరిచయం తెలుగులో 'రాధమ్మ కూతురు', 'పద్మావతి', 'జగద్ధాత్రి' వంటి సీరియల్స్‌తో బుల్లితెర ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు నటి దీప్తి మన్నె. ఈ కన్నడ బ్యూటీ తన బాయ్ ఫ్రెండ్‌ను ఇంట్రడ్యూస్ చేశారు. కొద్ది రోజుల క్రితం తాను లవ్‌లో ఉన్నట్లు ఇన్ స్టా వేదికగా పోస్ట్ చేసిన ఆమె తాజాగా తన లవర్‌ను పరిచయం చేస్తూ ఆయనతో దిగిన ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేశారు.
తన ప్రియుడు రోహన్‌తో దిగిన ఫోటోలను దీప్తి మన్నె ఇన్ స్టాలో షేర్ చేశారు. 'డియర్ రోహన్ ఇన్నాళ్లుగా నీ కోసమే నేను ఎదురు చూస్తున్నాను. నువ్వు నేను కోరుకున్న వ్యక్తివి. నాకు దక్కిన మరపురాని బహుమతివి నువ్వు. నన్ను కోరుకున్నందుకు థాంక్స్. ఐ లవ్ యూ.' అంటూ రాసుకొచ్చారు. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. రోహన్‌కు ఇండస్ట్రీతో సంబంధం లేనట్లు తెలుస్తోంది. త్వరలోనే వీరి నిశ్చితార్థం, వివాహం ఉండనున్నట్లు సమాచారం. ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా పలువురు సీరియల్ నటులు, నెటిజన్లు విషెష్ చెబుతున్నారు.
Also Read: సిద్ధూ జొన్నలగడ్డ 'తెలుసు కదా' ట్రైలర్ వచ్చేసింది - అర్జున్ రెడ్డి, డీజే టిల్లు కలిస్తే ఎలా ఉంటుందో?
'రాధమ్మ కూతురు', 'జగద్ధాత్రి' సీరియల్స్‌తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరై తెలుగింటి అమ్మాయిగా మారారు దీప్తి మన్నె. అలాగే 'ఇక సెలవ్' అనే తెలుగు మూవీలోనూ నటించారు. కన్నడలో సీరియల్స్, మూవీస్‌లోనూ నటించారు. యెవన్, దేవదాస్ బ్రదర్స్, కర్త, హింగ్యాకే, సమ్మూర హైక్లు అనే కన్నడ చిత్రాల్లో నటించి మెప్పించారు.