Jagadhatri Serial Today Episode రిసార్ట్‌ బాయ్ గౌతమ్‌కి మీనన్‌కి ఓ వ్యక్తి చాలా డబ్బు ఇస్తా అని డీల్ కుదుర్చుకొని సీసీ కెమెరాలు ఇచ్చి కొత్త జంట సరసాలు రికార్డ్ చేయమని చెప్తాడు. డబ్బుకి ఆశ పడిన గౌతమ్ బెడ్ రూమ్‌లలో సీసీ కెమెరాలు పెట్టి ఆ వీడియోలు అతనికి పంపిస్తాడు. అలాగే సిరి ఆమె భర్తల సీక్రెట్ వీడియోలు పంపిస్తాడు. 

Continues below advertisement

గౌతమ్‌ జేడీ, కేడీల దగ్గర నిజం ఒప్పుకొని తనని క్షమించమని చెప్తాడు. సీక్రెట్ కెమెరా ఇచ్చిన వాడి పేరు అడిగితే చెప్పడు అని ఫోన్ కూడా రకరకాల నెంబర్ల నుంచి చేస్తాడని చెప్తాడు. ఇక జేడీ లాస్ట్ కాల్ డిటైల్స్ తీసుకుంటుంది. గౌతమ్ని పోలీసులకు అప్పగిస్తుంది. జేడీకి తన తండ్రి కాల్ చేసి మళ్లీ కాల్ చేసి బెదిరించారని డబ్బు ఇవ్వకపోతే వీడియోలు వైరల్ చేస్తామని డబ్బు సిరితో పంపమని చెప్పారని అంటాడు. దాంతో జేడీ వాడు చెప్పిన టైంకి సిరితో డబ్బు పంపిస్తామని చెప్పమని అంటుంది. గౌతమ్ చెప్పిన నెంబరు, జేడీ వాళ్లకి వచ్చిన నెంబరు ఒకటే అని కేథార్ చెప్పడంతో ఇదంతా మీనన్ పనే అని జేడీ అనుమానిస్తుంది. 

  మీనన్ వాళ్లు సిరి డబ్బు తెస్తుందని వెయిట్ చేస్తూ ఉంటారు. సిరితో పాటు జేడీ, కేడీలు కూడా వస్తుంటారు. మీనన్ మనిషి దేవా సిరికి కాల్ చేసి త్వరగా రమ్మని చెప్తాడు. జేడీ మనుషులు స్వామి మాలలో వస్తారు. మీనన్ వాళ్ల బండి ముందు ఆగుతారు. మీనన్‌కి అనుమానం వస్తుంది. దేవా మళ్లీ సిరికి కాల్ చేస్తాడు. సిరి కారు అక్కడే ఆపి డబ్బు తీసుకొని నడుచుకొని రమ్మని చెప్తాడు. సిరి వెంటనే జేడీకి విషయం చెప్తే జేడీ వెళ్లమని అంటుంది. 

Continues below advertisement

మీనన్ సిరిని చూసి గుర్తు పడతాడు. దేవా తనేనా అది జేడీ చెల్లిరాఅని అంటాడు. దేవా కంగారు పడతాడు. మీనన్ స్వాముల బండి చూసి నా అనుమానం నిజం అయితే అది స్వాముల బండి కాదురా జేడీ, కేడీల పోలీస్ బండిరా.. అని అంటాడు. దేవాని సిరి దగ్గరకు వెళ్లి సిరిని బెదిరించమని అంటాడు. జేడీ, కేడీలు చూసి దేవా ఉన్నాడు అంటే కారులో మీనన్ కూడా ఉంటాడు అని అంటుంది. దేవా సిరికి గన్ గురిపెడతాడు. అటాక్ చేద్దాం అని కేడీ అంటే జేడీ వద్దని అంటుంది. 

మీనన్ కారు దిగి సిరి దగ్గరకు వస్తాడు. సిరిని పట్టుకొని జేడీ నీ ఎత్తుగడ బాగుంది.. మరి నా ఎత్తుగడని నువ్వు సింక్ చేయలేను అని తెలుసుకోవాలి కదా.. నీ చెల్లికి భయం వేస్తుంది.. నీకు కూడా భయం వేస్తుందా.. నువ్వు ఇక్కడే ఉన్నావ్ అని నాకు తెలుసు.. బయటకు రా అని పిలుస్తాడు. మీ అక్క ఇంకా రాలేదు ఏంటే వస్తే నేను చంపేస్తా అని భయపడుతుందా అని మీనన్ అంటే నీ చావుకి ఇంకా టైం ఉంది అందుకే మా అక్క బయటకు రాలేదు అని అంటుంది. మీనన్ సిరిని కొడతాడు. జేడీ నువ్వు వస్తావా దీన్ని ఇలాగే కొట్టి కొట్టి చంపేయాలా అని అడుగుతాడు. 

సిరిని కొడతాడు. దాంతో జేడీ, కేడీలు బయటకు వస్తారు. సిరికి దేవా గన్ గురి పెడతాడు. జేడీ, కేడీల మీదకు రౌడీలు వెళ్తే ఇద్దరూ రౌడీలను చితక్కొడతారు. చివరకు మీనన్ జేడీ తలపడతారు. మీనన్ జేడీని కొడతాడు. మరో ఇద్దరు రౌడీలు కేథార్‌ని కొడతారు. కేథార్ వాళ్లని చితక్కొడతాడు. జేడీ మీదకు రౌడీలు రావడంతో మీనన్ సిరి దగ్గరకు వెళ్లి సిరిని తీసుకెళ్లిపోతాడు. మరో పోలీస్ చూసి జేడీకి విషయం చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.