Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి కావేరిని ఇంటికి తీసుకొచ్చి కావేరి తన సొంత చెల్లి అని ఇక నుంచి తన పూర్తి బాధ్యత నాది అని అంటాడు. ఎన్నో అనాథాశ్రమాలు ఉంటే  తను మన ఇంట్లో ఎందుకు అని పద్మాక్షి అంటే అలా అయితే తను అనాథ అయిపోతుందని విహారి అంటాడు. అందరు ఎన్ని అడిగినా విహారి మాత్రం తను ఇక్కడే మన ఇంట్లోనే ఉంటుంది. ఇక ఎవరు ఏం మాట్లాడొద్దు అని అంటాడు.

Continues below advertisement

విహారి మాటతో అందరూ లోపలికి వెళ్లిపోతారు. యమున లక్ష్మీ, కావేరిలను తీసుకెళ్తుంది. అంబిక సుభాస్‌కి కాల్‌ చేసి రుక్మిణి చనిపోతూ లక్ష్మీకి కళ్లు ఇచ్చిందని చెప్తుంది. రోజు రోజుకీ నీ పవర్ తగ్గిపోతుందని సుభాష్ అంటాడు. లక్ష్మీ పక్కన విహారి ఉండటం వల్ల ఇదంతా అయింది.. ఈ సారి లక్ష్మీ చనిపోయేలా ప్లాన్ చేయాలి అని అంటుంది.  సుభాష్‌ తనని పార్థసారధి 200 ఎకరాల గురించి అడుగుతున్నాడని అంటాడు. అదే పనిలో ఉన్న త్వరలో సంతకాలు పెట్టిస్తా అని అంటుంది అంబిక. 

లక్ష్మీని పండు గదిలోకి తీసుకెళ్లి నీకు చూపు రావాలి అని ఆ భగవంతుడుని చాలా కోరితే మా కోరిక ఇలా నెరవేర్చాడని అంటాడు. నీకు కళ్లు వస్తే విహారి బాబుని చూడాలి సంతోషపడతారు అని అంటాడు. విహారి అప్పుడే వస్తాడు. పండు చెప్పబోతే ఏం అనొద్దు అంటాడు. ఇక విహారి పండుతో లక్ష్మీకి కళ్లు వస్తే నేను ఎలా తన ముఖం చూడాలిరా.. తన ముందు ఎలా నిలబడాలో అర్థం కావడం లేదు అని అంటాడు. విహారి బాధ పడుతుంటే యమున చూస్తుంది. యమున కూడా ఏడుస్తుంది. 

Continues below advertisement

యమున అందరికి వడ్డిస్తుంది. పండు లక్ష్మీని తీసుకొస్తాడు. కావేరి కూడా వస్తుంది. కావేరి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చీ లాగి కూర్చొబోతుంది.. ఇంతలో అంబిక, పద్మాక్షి కోపంగా చూడటంతో కింద కూర్చొంటుంది. విహారి వచ్చి చూసి ఇక్కడ కూర్చొన్నావేంటమ్మా అని తీసుకెళ్లి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొపెడతాడు. తనది మన స్థాయే అని విహారి అంటాడు. అందరూ అలా చూస్తే అంటే మనిషి అనే స్థాయి అని అంటాడు. లక్ష్మీ అందరితో అమ్మ మరోలా అనుకోకండి కావేరికి తక్కువ ఆస్తి ఏం లేదు.. అని అంటుంది. అందరూ భోజనాలు చేస్తారు. 

పద్మాక్షి విహారితో రేపు నువ్వు, సహస్ర హాస్పిటల్‌కి వెళ్లాలిరా.. చిన్న చెక్‌అప్ ఉందిరా అని అంటుంది. ఏంటి ఆ చెక్‌అప్ అని విహారి అంటే మీ ఇద్దరికీ రేపు పుట్టబోయే బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలి అని హెల్త్‌ చెక్‌అప్ అని అంటుంది. ఈ రోజుల్లో ఇవన్నీ కామనే కదా అని పద్మాక్షి చెప్తుంది. ఇద్దరూ వెళ్లాల్సిందే అని చెప్తుంది. అమ్మ మన మంచికే చెప్తుంది కదా సహస్ర అంటుంది. అపాయింట్ మెంట్ కూడా తీసుకున్నా అని చెప్తుంది. యమున సైలెంట్‌గా ఉంటే ఇంటి వారసుడి కోసం ఇంటిళ్లపాది ఎంతలా ఎదురు చూస్తున్నాం కదా అని అంటుంది. యమున కూడా వెళ్లమని అంటుంది. నాకు వేరే పని ఉంది అని విహారి అంటాడు. ఏ పని ఉన్నా ఈ పని ముఖ్యం ఒక్క అరగంట చాలు అని పద్మాక్షి అంటుంది. ఈ ప్రోగ్రాం తర్వాత మీరు ఎక్కడికైనా వెళ్లండి ఏమైనా చేసుకోండి అని  అంటుంది. సహస్ర కూడా విహారితో బావ మనకు పుట్టబోయే బిడ్డలు బాగుండాలి కదా అంటుంది. 

విహారి లక్ష్మీ ఈ మాటలు ఎలా భరిస్తుందా అని బాధ పడతాడు. ఇక సహస్ర బయట ఉన్న విహారి దగ్గరకు వచ్చి వెనకనుంచి హగ్ చేసుకుంటుంది. బావ చాలా థ్యాంక్స్ బావ.. మనకు పుట్టబోయే పిల్లల కోసం నువ్వు ఆలోచిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది. విహారి వదిలించుకుంటే సహస్ర ప్రశ్నిస్తుంది. నేను నచ్చడం లేదా అని అంటే అలా ఏం లేదు నా మూడ్‌ బాలేదు అంటాడు. నువ్వు అలా చేస్తే నేను ఎంత బాధ పడతానో నీకు అర్థం కావడం లేదా అని అంటుంది. విహారి సారీ చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.