Jagadhatri Serial Today Episode వైజయంతి ఏడుస్తూ శ్రీవల్లి నా కూతురు కాదు అని అంటుంది. సుధాకర్ వైజయంతితో నువ్వు ఎన్ని చెప్పినా మేం నమ్మము.. శ్రీవల్లిని వదిలించుకోవాలని ఇలా చేశావని అంటాడు. అంతా నా ఖర్మ అని వైజయంతి అంటుంది. దాంతో శ్రీవల్లి పరుగున వెళ్లి వైజయంతిని హగ్ చేసుకొని అమ్మా నేను నీకు నచ్చకపోతే చెప్పమ్మా ఆత్మహత్య చేసుకుంటాను.. అంతే కానీ ఇలా పరాయి వాళ్ల చేతుల్లో పెట్టి నా గొంతు కోయకు అమ్మా నీ కాళ్లు పట్టుకుంటా అని ఏడుస్తుంది.

Continues below advertisement

వైజయంతిని ఇంట్లో అందరూ తిడతారు. తలా ఓ మాట అంటారు. అందరూ కలిసి తిట్టి నన్ను కన్ఫ్యూజ్ చేయకండి ఎవరు తిట్టిన దానికి ఏడ్వాలో అర్థం కావడం లేదు అని వైజయంతి అనుకుంటుంది. ఇక సుధాకర్ వైజయంతితో ఇంట్లో అందరూ నీ తప్పుని ఒప్పుకున్నా.. నువ్వు ఎందుకు ఇలా చేశావే.. ఇంకోసారి ఇలా చేస్తే నీకు విడాకులు ఇస్తా అని సుధాకర్‌ అంటాడు. కౌషికి బాధ పడొద్దు అని శ్రీవల్లితో చెప్తుంది. 

కేథార్ జగద్ధాత్రితో పిన్ని మన దగ్గర ఏదో దాస్తుంది. మనం అనుకున్నట్లు శ్రీవల్లి పిన్ని సొంత కూతురు కాదు.. కన్న తల్లి అయితే ఎవరూ అలా పరాయి వాళ్ల చేతుల్లో పెట్టాలి అనుకోరు అని అనుకుంటారు. ఎలా అయినా వైజయంతి మనసులో ఏం ఉందో ఎలా అయినా తెలుసుకోవాలని.. వైజయంతి నోటితోనే శ్రీవల్లి ఎవరో చెప్పేలా చేద్దాం అని జగద్ధాత్రి కేథార్‌కి తన ప్లాన్ చెప్తుంది. ప్లాన్ సూపర్ అని కేథార్ అంటాడు.

Continues below advertisement

వైజయంతి చావు తప్పి కన్ను లొట్ట పోయినట్లు అయిపోయింది నా పరిస్థితి కొట్టలేదు ఒక్కటే అన్ని బాగా జరిగాయి అని అనుకుంటుంది. కౌషికి వైజయంతి దగ్గరకు వచ్చి జరిగిన వన్నీ చూసి నాకు మీ మీద అనుమానం కలుగుతుంది. మీరు మా దగ్గర ఏదో రహస్యం దాస్తున్నావ్ అది చెప్పు అని అంటుంది. నిజంగా శ్రీవల్లి మీ కన్న కూతురు కాదా అని అడుగుతుంది. కాదు అని వైజయంతి అంటే మరి ఎవరి కూతురో చెప్పండి అని అంటుంది. వనజ కూతురే ఆ శ్రీవల్లి అని కానీ ఏదో జరిగింది అని వైజయంతి అంటుంది. ఇప్పుడు నిజం చెప్తే మీకు అండగా ఉంటాం లేదంటే మిమల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు అని కౌషికి అంటుంది. 

నిషిక ఉదయం కౌషికి దగ్గరకి వచ్చి తన చెల్లికి గిఫ్ట్ కొనాలి అనుకుంటున్నా జస్ట్‌ పాతిక లక్షలు ఇస్తే మన స్థాయికి తగ్గట్టు దానికి గిఫ్ట్ ఇస్తా అని అంటుంది. కౌషికి జగద్ధాత్రిని పిలిచి మీ చెల్లికి ఏమైనా గిఫ్ట్ కొన్నావా అని అంటుంది. దానికి జగద్ధాత్రి నెక్లెస్ కొన్నానని చెప్తుంది. డబ్బు నాకు అడిగావా నీ దగ్గర ఉన్న దానితో కొన్నావా అని అంటుంది. దానికి జగద్ధాత్రి నేను కేథార్ దాచుకున్న డబ్బుతో కొన్నాం అని చెప్తుంది. కౌషికి నిషితో విన్నావు కదా మీ అక్క కేథార్ సాయంతో తను దాచుకున్న డబ్బుతో చెల్లి కోసం నెక్లెస్ కొంది. నువ్వు కూడా మీ చెల్లికి గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే నీ భర్త సంపాదన లేకపోతే నీ సంపాదనతో కొనివ్వు అప్పుడు నీకు తెలుస్తుంది. జస్ట్ పాతిక లక్షల విలువ అని అంటుంది. వైజయంతి మనసులో నిషి తిక్క కుదిరింది నన్ను ఎన్నో మాటలు అన్నది అని అనుకుంటుంది. 

నిషి కోపంతో ఇదా నాకు ఈ ఇంట్లో విలువ.. నా భర్త అసమర్థతే నాకు ఈ పరిస్థితికి కారణం.. నా భర్తకే ఆస్తులు బిజినెస్‌లు ఇచ్చుంటే నాకు  ఈ పరిస్థితి వచ్చేది కాదు.. విన్నావు కదా యువరాజ్ ఇది మన పరిస్థితి అని అంటుంది. కౌషికి నిషితో మీకు అసలు డబ్బు ఇవ్వనట్లు మాట్లాడుతున్నావ్.. బిజినెస్ చేస్తా అంటే పది కోట్లు ఇచ్చా.. ఈ ఇంటి డబ్బు ముట్టనట్లు మాట్లాడకు అని అంటుంది. నీ భర్తని అడుగు వాడు సవ్యంగా ఉండుంటే ఈ పాటికి నీకు కావాల్సినంత వచ్చేది అని అంటుంది. యువరాజ్‌ తండ్రితో అక్క అన్న మాటలు పడలేకపోతున్నాం.. నువ్వు డబ్బు ఇవ్వు అని అంటాడు. అదేంట్రా ఇంట్లో నుంచి వెళ్లిపోతా అంటారు అనుకున్నా,, అయినా మీ అక్కేం తప్పుగా మాట్లాడలేదు డబ్బు విలువ తెలుసుకోవాలని అంటుంది.. కౌషికి మాటే ఫైనల్ అని సుధాకర్ అంటాడు.

జగద్ధాత్రి నిషితో ఇది అంతా ఆపేయ్ నేను కొన్ననెక్లెస్ నీకు ఇస్తా నువ్వు ఇచ్చేయ్ అని అంటుంది. నిషి కోపంగా మీ ఎవ్వరి డబ్బు నాకు అవసరం లేదు.. మీకు ఒక్క రూపాయి అడిగితే చెప్పు ఇచ్చి కొట్టండి అని అంటుంది. కౌషికి 10 లక్షలు ఇస్తాను అంటే ఒక్క రూపాయి అవసరం లేదు.. నేను నా చెల్లికి గిఫ్ట్ ఇస్తా అని నిషిక అంటుంది. నిషిక ఏం చేస్తుందా అని జగద్ధాత్రి ఆలోచిస్తుంది. నిషిక యువరాజ్‌తో మీ అక్క నన్ను ఏం అనుకుంటుంది అని ఆవేశ పడుతుంది. నిషి యువరాజ్‌తో నేను కోటి అడిగినా మా నాన్న ఇస్తారు అని అంటుంది. వెంటనే తల్లికి కాల్ చేసి నాకు పాతిక లక్షలు కావాలి నాన్నకి అడుగు అంటుంది. నిషి తండ్రితో మాట్లాడి నాకు 25 లక్షలు కావాలి పంపు అని అంటుంది. ఎందుకమ్మా అని ఆయన అడిగితే ఎప్పుడూ లేనిది కారణం అడుగుతున్నావేంటి నాన్న అని అంటుంది. ఇంట్లో జరిగింది చెప్పి చెల్లికి గిఫ్ట్ ఇవ్వాలి అంటుంది. ఆయన కుదరదు అని చెప్తారు. ఇన్‌కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్ అయింది బ్యాంక్‌ అకౌంట్స్ అన్నీ సీజ్ చేశారు అని అంటారు. నిషిక షాక్ అయిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.