Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode అంబిక దగ్గరకు పండు రావడంతో అంబిక పండుని లాగిపెట్టి కొట్టి పొద్దున్నుంచి కాఫీ ఇవ్వకుండా ఎక్కడికి వెళ్లావ్రా అని తిడుతుంది. అంబికమ్మా పని వాళ్లు అంటే మీ బానిసలు కాదు ఇష్టం వచ్చినట్లు కొట్టడానికి అని లక్ష్మీ అంబికను అంటుంది. దాంతో అంబిక ఎక్కువ మాట్లాడావు అంటే నీకు కళ్లు లేవు అని కూడా చూడను అంటుంది. ఇక అంబిక అక్కడే ఉన్న పడక చూసి ఈ చాప దిండు ఇక్కడ ఉన్నాయి ఏంటి అని అడుగుతుంది. 

Continues below advertisement

పండు తడబడితే లక్ష్మీ అంబికతో పండు రాత్రి ఇక్కడే పడుకున్నాడు అని చెప్తుంది. అంబిక అనుమానంగా చూస్తుంది. కొత్తగా ఇక్కడ పడుకోవడం ఏంట్రా నీకు రూం ఉంది కదా అని అడుగుతుంది. నిద్ర పట్టలేదు అని పండు చెప్పగానే కాఫీ తెమ్మని అంబిక వెళ్లిపోతుంది. ఇక రుక్మిణి రెడీ అయి వస్తుంది. వెళ్లిపోతా అని చెప్తే టిఫెన్ తినేసి వెళ్లమని లక్ష్మీ చెప్తుంది. 

విహారి లక్ష్మీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. డాక్టర్ లక్ష్మీకి ఇక చూపు రాదు అని చెప్పడం గుర్తు చేసుకొని బాధ పడతాడు. లక్ష్మీకి సరిపోయే కళ్లు ఎక్కడ ఉంటాయా అని ఆలోచిస్తూ తన ఫ్రెండ్‌కి ఫోన్ చేసి నాకు బాగా తెలిసిన అమ్మాయికి చూపు పోయిందిరా.. ఐ బ్యాంక్‌లో నీకు పరిచయం ఉంది కదా ప్రయత్నించురా అని అంటాడు. దానికి అతను రేయ్ అది చాలా ప్రాసెస్‌రా.. కాకపోతే నువ్వు తన రిపోర్ట్స్‌ పెట్టురా అన్ని ఐ బ్యాంక్‌లకు పంపి ఎమర్జెన్సీ అని పెడతా అని అంటాడు. ఇక విహారి లక్ష్మీ రిపోర్ట్స్‌ నా గదిలోనే ఉన్నాయి అని వెళ్తాడు.

Continues below advertisement

సహస్ర గదిలో తన రిపోర్స్ చూస్తూ  ఏడుస్తూ నాకు గర్భసంచి లేదు అని తెలిస్తే బావ నన్ను పట్టించుకోడు.. అందరూ ఆ లక్ష్మీనే కోడలిగా అంగీకరిస్తారు అని ఏడుస్తుంది. ఇక రిపోర్ట్స్ పెట్టి వాష్‌రూంకి వెళ్తుంది. విహారి వచ్చి లక్ష్మీ రిపోర్ట్స్ కోసం వెతుకుతాడు. విహారి వచ్చి సహస్ర రిపోర్ట్స్‌ చూస్తాడు. అది చూసిన సహస్ర కంగారుగా ఏం చేస్తున్నావ్‌ బావ అని అంటుంది. ఈ రిపోర్ట్స్‌ ఏంటి అని విహారి అడిగితే నాకు యాక్సిడెంట్ అయింది కదా బావ అప్పటి రిపోర్ట్స్‌ అని అంటుంది. అయినా నువ్వు నా గురించి ఎప్పుడు పట్టించుకుంటావ్‌ బావ.. ఎప్పుడూ బయట వాళ్ల గురించి ఆలోచిస్తావ్ కానీ నా గురించి ఆలోచించవు కదా అని అని అంటుంది. ఇక రిపోర్ట్ తన గదిలో ఉంటే ఎప్పుడో ఒకసారి బావ చూసేస్తాడు అని పద్మాక్షి దగ్గరకు తీసుకెళ్తుంది. 

విహారి లక్ష్మీ రిపోర్ట్స్ కోసం వెతుకుతాడు. బెడ్ కింద రిపోర్ట్స్ ఉంటాయి.. వాటిని ఫొటో తీసి తన ఫ్రెండ్‌కి పంపిస్తాడు. సహస్ర పద్మాక్షి దగ్గరకు వెళ్లి కొంచెం ఉంటే బావ ఈ రిపోర్ట్స్ చూసేసేవాడమ్మా.. అని అంటుంది. అంత నిర్లక్ష్యంగా ఉన్నావా నువ్వు అని పద్మాక్షి అంటుంది. ఇక నుంచి ఈ ఫైల్ ఎవరికీ కనిపించకూడదు అని సహస్ర అంటుంది. 

లక్ష్మీ, పండు రుక్మిణికి టిఫెన్ పెడతారు. రుక్మిణి లక్ష్మీని చూసి అమ్మా లక్ష్మీ నీకు పెళ్లి అయిందా అని అడుగుతుంది. నా చెల్లికి పెళ్లి అయింది అని పండు చెప్తాడు. పండు ఎమోషనల్ అయి నా చెల్లి పెళ్లి అయిన దగ్గర నుంచి రాముడికి దూరంగా లంకలో ఉన్నట్లు ఉందని అంటాడు. నీ మంచి మనసుకి అంతా మంచే జరుగుతుందమ్మా అని రుక్మిణి అంటుంది. ఇంతలో యమున లక్ష్మీని పిలవడంతో రుక్మిణిని పంపేస్తారు. రుక్మిణి హాల్‌లో నుంచి వెళ్తుంది కానీ హరికృష్ణ ఫోటో చూడదు.. యమున లక్ష్మీకి హారతి ఇస్తుంది. నీకు త్వరగా కళ్లు వస్తాయి.. నీ జీవితం బాగు పడుతుంది అని అంటుంది. 

రుక్మిణి బయటకు వెళ్తూ తన కూతుర్ని ఎలా కాపాడుకోవాలా అని అనుకుంటుంది. ఇంతలో యమున విహారి అని పిలవడం రుక్మిణి వింటుంది. సంతోషంగా ఇంట్లోకి వెళ్లి విహారి బాబు.. విహారి బాబు.. ఎక్కడ అని అడుగుతుంది. యమున రుక్మిణిని గుర్తు పడుతుంది. పద్మాక్షి కూడా రుక్మిణి అని దగ్గరకు వెళ్తుంది. పద్మాక్షి రుక్మిణి నువ్వేంటి ఇక్కడ అని అడిగితే పద్మాక్షి అవన్నీ తర్వాత చెప్తా ముందు నా కూతురు  ప్రమాదంలో ఉంది.. విహారి బాబు నా కూతుర్ని కాపాడు అని అంటుంది. అమ్మిరాజు, వీర్నాజుల దగ్గర నా కూతురు ఉంది.. నా ఆస్తి కోసం వాడు నన్ను బంధించేసి నా కూతుర్ని అక్కడ ఉంచేశాడు.. నా కూతురికి రేపు 18 ఏళ్లు నిండుతాయి. నా ఆస్తి కోసం వాడు నా కూతుర్ని అమ్మిరాజు పెళ్లి చేసుకుంటాడు అని మొత్తం చెప్తుంది. అమ్మిరాజు, వీర్రాజులకు ఎన్ని కొట్టినా ఎన్ని పంచాయితీలు అయినా సిగ్గు రాదు అని పద్మాక్షి అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.