Jagadhatri Serial Today Episode జగద్ధాత్రి, కేథార్‌ ఇద్దరూ పవన్ నిజస్వరూపం అందరి ముందు బయట పెడతారు. ఎనిమిదో తరగతి చదివిన పవన్ 7 మంది అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నాడని తెలిసి ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు. ఆడపిల్లకి పెళ్లి చేసే ముందు చక్కగా ఎంక్వైరీ చేయాలని పుట్టింటి వాళ్ల ఆడపిల్లలకు ధైర్యం ఇవ్వాలని అంటారు. 

బూచి పవన్‌ని తీసుకొని జైలుకి వెళ్తాడు. మేఘన వాళ్ల బామ్మ జగద్ధాత్రితో మీకు పెళ్లి సంబంధాలు తేవడం మా వల్ల కాదు అంటుంది. ఇక మేఘన కేథార్‌తో మన పెళ్లి గురించి తేల్చుకుందామని అంటుంది. బామ్మ కేథార్‌, జగద్ధాత్రిలను మేఘన తండ్రి డీజీపీ గారి దగ్గరకు వెళ్దామని అంటుంది. దాంతో కేథార్ పెళ్లి చేసుకుంటాను మూఢం తర్వాత చేసుకుంటా అంటాడు. మేఘన వాళ్లు వెళ్లిపోయిన తర్వాత జగద్ధాత్రి కేథార్ పని చెప్తా అని కేథార్‌ని తీసుకెళ్తుంది. 

తాయారు కొడుకుతో మీనన్‌ని ఓ చావు అని ఎవరైనా చావుని ఎలా చంపుతారు అని అంటుంది. మీనన్‌ని జేడీ కాల్చిన టైంలో మీనన్‌ బాడీకి ఉన్న బులెట్ ప్రూవ్ ఉండటంతో చనిపోడు. జేడీ మీనన్ చనిపోయి ఉంటుందని అనుకుంటుందని మీనన్ అనుకొని తాయారుకి కాల్ చేస్తాడు. తాయారు షాక్ అయిపోతుంది. జేడీ నిన్ను కాల్చేసింది నువ్వు చనిపోయావు అనుకున్నా అంటుంది. దాంతో మీనన్ తనకు చావు ఉండదు జేడీ ముందు అలా నటించాను.. జేడీని చంపేవరకు నేను బతికే ఉన్నానని ఎవరీకీ తెలీకూడదు అని అంటాడు. ఇప్పటి నుంచి జేడీతో అసలు ఆట మొదలు పెడతా అంటాడు. 

కౌషికి చాలా సంతోషంగా ఉంటుంది. కేథార్, జగద్ధాత్రి ఇద్దరూ కౌషికి ఫ్యామిలీతో చాలా సంతోషంగా ఉందని నిషిక వాళ్ల మారిపోతే చాలా బాగుంటుందని అనుకుంటారు. డీఎన్‌ఏ టెస్ట్ గురించి మాట్లాడుకుంటారు. టెస్ట్ అవసరం లేదని కౌషికి అంటే అవసరం అని ఆదిలక్ష్మీ వస్తుంది. వీడు నా కొడుకే ఎలాంటి టెస్ట్‌లు అవసరం లేదు అంటుంది. డీఎన్‌ఏ టెస్ట్‌లో మన బిడ్డ అని రాకపోతే అనాథాశ్రమానికి పంపేద్దామని కౌషికి పిన్ని అంటుంది. కౌషికి బాబాయ్ బాబుని ఎత్తుకొని దగ్గుతారు. ఆదిలక్ష్మీ అది చూసి కౌషికిని చాటుగా పిలిచి ఆ పెద్ద మనిషి అలా దగ్గుతున్నాడు ఏం రోగం ఉందో తెలీదు కదా వెళ్లి పిల్లాడిని తీసుకో అంటుంది. నేను తీసుకుంటే ఎలా ఉంటుందో తెలుసుకదా అని అంటుంది. ఆ మాటలకు కౌషికి బాధ పడుతుంది. యవరాజ్‌ తల్లి, నిషిక చూసి కోపంగా వెళ్లిపోతారు. 

కౌషికి అందర్ని తినడానికి వెళ్లమని చెప్పి బాబుని పడుకోపెట్టడానికి అని బాబుని తీసుకుంటుంది. వైజయంతి కౌషికిని ఆపి నిజంగా బాబుని పడుకోపెట్టడానికే తీసుకున్నావా మీ బాబాయ్ కళ్లలోకి చూసి చెప్పు అంటుంది. కౌషికి కన్నీరు పెట్టుకుంటుంది. ఇక నిషిక అందరితో మీరు దగ్గుతున్నారు మీకు ఏదో జబ్బు ఉందని పిల్లాడిని కౌషికి తీసుకుందని అంటుంది. కౌషికి అలా చేయదు అని జగద్ధాత్రి, కేథార్ అంటే ఆదిలక్ష్మీ నిజమే అంటుంది. కౌషికి చాలా బాధ పడి తల దించుకుంటుంది. మీకు కౌషికి ఇచ్చే విలువ ఇదే అని అంటారు. బాబాయ్ బాధ పడి వెళ్లిపోతారు. సురేశ్ తల్లి మీద కోప్పడతాడు.  

రాత్రి కౌషికి బాబాయ్ బాధ పడుతుంటే అక్కడికి వెళ్తుంది. బాబాయ్‌తో మాట్లాడకుండా వెనక్కి వెళ్లిపోతుంది. జగద్ధాత్రి, కేథార్ ఎందుకు వెళ్లిపోతున్నారు అంటే తప్పు చేశాను అందుకే వెళ్లిపోతున్నా అంటుంది. ఇద్దరూ కౌషికిని ఓదార్చుతారు. కౌషికిని తీసుకెళ్తారు. కౌషికి సారీ బాబాయ్ అని చెప్తుంది. తండ్రి లేని లోటు తీర్చిన మిమల్ని కష్టపెట్టాను అని ఏడుస్తుంది. 

ఉదయం డీఎన్ఏ రిపోర్ట్స్ గురించి ఇంట్లో అందరూ టెన్షన్ పడతారు. కౌషికి బాబుని బాబాయ్‌కి ఇస్తుంది. ఆయన ఆదిలక్ష్మీ మాటలు తలచుకొని ఆగిపోతారు. వైజయంతి వాళ్లు వచ్చి నీ దృష్టిలో మా స్థానం అర్థమైంది అని అంటారు. జగద్ధాత్రి మామయ్యతో బాబుని ఎత్తుకోవడం మీ హక్కు దాన్ని ఎవరూ కాదనలేరు అని అంటుంది. ఆయన బాబుని తీసుకుంటారు.  అది చూసిన ఆదిలక్ష్మీ కౌషికి అని అరుస్తుంది. కౌషికి అత్తతో మా బాబాయ్‌కి ఏం జబ్బు లేదు ఉన్నా ఆయన బాబుకి ఇబ్బంది పెట్టే పని చేయరు సో పర్లేదు అంటుంది. నా మాటకు విలువ లేదా అని ఆదిలక్ష్మీ అరుస్తుంది. విలువ ఉంది కానీ ఎలా పడితే అలా చేస్తే ఊరుకోను అంటుంది. ఇంతలో డీఎన్ఏ రిపోర్ట్స్ వస్తాయి. 

జగద్ధాత్రి రిపోర్ట్ చూసి షాక్ అయిపోతుంది. కేథార్ చూసి డీఎన్‌ఏ మ్యాచ్ అవ్వలేదని చెప్తాడు. అందరూ షాక్ అయిపోతారు. నిషిక వాళ్లు చాలా సంతోషపడతారు. అక్క దగ్గర మార్కులు కొట్టేయడానికి జగద్ధాత్రి, కేథార్‌లు వేరే బిడ్డని తెచ్చి నిన్ను మోసం చేశారు అంటే కౌషికి బాబు నా కొడుకే అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: 100 కోట్ల స్కామ్‌లో లక్ష్మీ.. సస్పెండ్ చేసిన విహారి..!