Jagadhatri Serial Today Episode జేడీ, కేడీలు గంగాధర్‌ని తీసుకెళ్లి సాధుసార్‌తో కలిసి ఇంటరాగేషన్ చేస్తారు. జేడీ గంగాధర్‌తో తాయారు గురించి మీకు ఏం తెలుసో చెప్పండి అని అడుగుతుంది. దానికి గంగాధర్ తాయారు తమ ఇంట్లో పని మనిషిగా చేసిందని తన అన్న కుటుంబం మొత్తాన్ని చంపిన తర్వాత తెలిసింది తాయారుకి మీనన్‌, కార్పొరేటర్‌తో సంబంధం ఉందని తెలిసిందని గంగాధర్ చెప్తాడు. 

గంగాధర్: కొన్ని రోజుల తర్వాత తాయారు కార్పొరేటర్ పెళ్లి చేసుకున్నారని తెలిసి ఆ తాయారుని నేనే చంపాలి అనుకున్నా.కేడీ: మీ అన్నయ్య ఫ్యామిలీ చనిపోయిన రోజు ఏం జరిగిందో చెప్పండి.గంగాధర్: ఇన్నేళ్ల తర్వాత ఆ కేసు ఎందుకు ఓపెన్ చేశారు.సాధుసార్: కావ్య గారి కేసు రిఓపెన్ చేశాం మీరు చెప్పేది చూస్తే  ఇప్పుడు బాలాజీ కేసు ఓపెన్ చేయాలని అర్థమైంది. గంగాధర్: కావ్య గారి కేసు ఓపెన్ చేశారా. నేను చూసిన వాళ్లతో ఆవిడ చాలా సిన్సియర్ ఆఫీసర్. మా ఫ్యామిలీకి ఆమె మంచి ఫ్రెండ్. ఆవిడ చావు గురించి ఆ చావు మీద పడిన నింద విన్నప్పుడు నా రక్తం మరిగిపోయింది. ఆవిడ గురించి నిజం తెలిసినా ఏకాకినైపోయా ఆవిడ కోసం పోరాడలేకపోయా. ఒక్క రోజులో అంతా కోల్పోయా మేడం నేను. జేడీ: అప్పుడు ఏం చేయలేకపోయా. కానీ ఇప్పుడు ఏం జరిగిందో చెప్పండి. గంగాధర్ ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. బాలాజీ, అతని భార్య, గంగాధర్ తమకు దొరికిన నిధులు గురించి  మాట్లాడుకుంటారు. వందల కోట్లు విలువ చేసే నగలు గవర్నమెంట్‌కి అప్పగించాలని అంటారు. ఇది ఇంటికి ఎందుకు తెచ్చావు అన్నయ్య మీనన్‌ కూడా వీటి కోసం ఎదురు చూస్తున్నాడు కదా అంటే ఎవరో ఆఫీసర్ ఇంకా రాలేదని తనకు తన పీఏకి మాత్రమే విషయం తెలుసని బాలాజీ చెప్తాడు. బాలాజీ భార్య చాలా భయపడుతుంది. బాలాజీ ఆమెతో కావ్య గారిని పిలవమని చెప్తాడు. గంగాధర్ సరే అంటాడు. తాయారు అదంతా సీక్రెట్‌గా వింటుంది. బాలాజీ కావ్య గారికి పిలవకముందే తాయారు వాళ్లు బాలాజీ ఫ్యామిలీని చంపేశారని అంటారు.

గంగాధర్ బయటకు వెళ్తుంటే తాయారు ఎవరితోనో మాట్లాడటం చూసి తనని కోప్పడి ఫ్రెండ్‌ని కలవడానికి వెళ్లానని ఇంటికి తిరిగి వచ్చేసరికి అందరూ చనిపోయారు. కావ్య గారు ఇంటికి వచ్చినప్పటికే అందరూ చనిపోయారని అంటారు. నిధి దొరికిందని అందరికీ తెలుసు కానీ మా ఇంట్లో ఉందని కేవలం కొంత మంది మాత్రమే తెలుసు అంటాడు. ఆ కేసు తర్వాత కొట్టేశారు కానీ కావ్య గారు ఆ కేసు వదల్లేదు. సీక్రెట్‌గా ఇన్వెస్టిగేట్ చేయడంతో ఆవిడను చంపేశారని అంటారు. 

గంగాధర్ కేడీ, జేడీలు మాట్లాడని మాటలు మొత్తం జేడీకి పడని పోలీస్ త్రిపాఠి వినేసి మొత్తం మినిస్టర్‌కి చేరవేస్తే లాభం ఉంటుందని అంటాడు. ఇక జేడీ గంగాధర్‌కి సాక్ష్యం చెప్తారా అని అడుగుతుంది. దాంతో గంగాధర్ ఏమైనా చేస్తానని అంటాడు. కేసు కోసం ఇంకా సాక్ష్యాలు సరిపోవని అప్పటి వరకు గంగాధర్‌ని జాగ్రత్తగా చూసుకోమని సాధు గారు కేడీ, కేడీలకు చెప్తారు. తాయారు, విక్కీ గంగాధర్ గురించి టెన్షన్ పడుతుంటారు. మన వాళ్లకి దొరక్కుండా  ఏమైపోయాడో అర్థం కావడం లేదని అంటుంది. ఇంతలో తాయారుకి త్రిపాఠి కాల్ చేస్తాడు.  

గంగాధర్ గురించి మీరు టెన్షన్ పడుతున్నారని నాకు తెలుసు. ఆ గంగాధర్‌కి మీ గతం మొత్తం తెలుసు అని తనని పరిచయం చేసుకుంటాడు. తాను సాధుసార్ టీమ్‌లో పని చేస్తున్నానని మీనన్‌కి  బాగా కావాల్సిన వాడిని అని చెప్తాడు. తాయారు గంగాధర్ గురించి అడుగుతుంది. నీకు పైసలు ప్రమోషన్ ఇస్తాను అని అంటుంది. దాంతో త్రిపాఠి గంగాధర్‌ని జేడీ, కేడీలు సాధుసార్‌తో కలిసి ఇంటరాగేషన్‌ చేస్తున్నారని మీరు సాధు సార్‌కి కాల్ చేసి అతన్ని అప్పగించమని అంటాడు. 

తాయారు సాధుసార్‌కి కాల్ చేసి గంగాధర్‌ని అరెస్ట్ చేశారు కదా వాడిని తీసుకొని మా ఇంటికి రా అని అంటుంది. జేడీ మనసులో ఎలా తెలిసింది అని త్రిపాఠిని గుర్తు చేసుకుంటుంది. సాధు గంగాధర్‌ పేరుతో ఎవర్ని అరెస్ట్ చేయలేదని ఒక వేళ చేసినా కోర్టులో జడ్జి ముందు అప్పగించాలి కానీ మీకు కాదు అని చెప్పి కట్ చేస్తాడు. కేడీ సాధుసార్‌తో త్రిపాఠి మీద యాక్షన్ తీసుకోవాలని అంటాడు. డిసిప్లిన్ యాక్షన్ తీసుకోవడానికి సాక్ష్యాలు లేవు కాబట్టి నేను త్రిపాఠితో మాట్లాడుతా ఈ కేసుకి దూరంగా ఉంచుతా అని సాధుసార్ అంటారు. మినిస్టర్‌కి గంగాధర్ గురించి తెలిసింది కాబట్టి గంగాధర్‌ని పాత కేసులో సీజ్ చేసిన ఫాం హౌస్‌లో పెడదామని అంటారు. 

విక్కీ తల్లితో అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగిందని అడుగుతాడు. నిధి ఇంట్లో ఉందని తెలిసిన వెంటనే మీనన్‌కి మీ నాన్నకి కాల్ చేశానని ఇంట్లో వాళ్లకి వజ్రాలు, నగలు, రాగిపత్రాలు చాలా చాలా విలువైనవి ఉన్నాయని చెప్తుంది. మీనన్ తాయారుకి విషం ఇచ్చి ఇంట్లో అందరికీ పెట్టి వాళ్లు చనిపోతే మాకు చెప్పమని అంటారు. తాయారు ఇంట్లో అందరూ తిన్ని ఫుడ్‌లో విషం కలిపేస్తుంది. అందరూ సంతోషంగా తిని రక్తం కక్కుకొని చనిపోతారు. తాయారు వాళ్లకి కాల్ చేసి రమ్మని చెప్తుంది. నగలు, వజ్రవైడూర్యాలు చూసి కళ్లు చెదిరిపోతాయి. ఇంతలో ఇనస్పెక్టర్ కావ్య లోపలికి వచ్చే లోపు దొరికినంత దోచేయాలని బ్యాక్ నుంచి పట్టుకొని వెళ్లిపోతారు. అందర్నీ చంపేశామని కానీ ఈ గంగాధర్ ఉండిపోయాడని తాయారు అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: చిన్ని సీరియల్: లోహిత భర్త్‌డే పార్టీని నాశనం చేసిన మధు.. ఏదో ఒకటి చేయ్ మ్యాడీ అంటూ నడిరోడ్డు మీద రచ్చ!