Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీ పండుకి రిసెప్షన్ దగ్గరకు పిలిచి నేను బయటకు వెళ్తున్నా విహారి గారిని నువ్వు ఒక్క నిమిషం కూడా వదలొద్దు కనిపెడుతూ ఉండు ఆయనకు ప్రమాదం పొంచి ఉందని చెప్పి ఎస్‌ఐ దగ్గరకు చెప్తుంది. ఎస్‌ఐతో కలిసి వేలిముద్రలు చేసే చోటుకి వెళ్తుంది. సహస్ర లక్ష్మీని ఫాలో అవుతుంది. సీక్రెట్‌గా వాళ్లని చూస్తుంది.

ఎస్‌ఐ ఆ ముబైల్ షాప్ అతన్ని పట్టుకొని ఫోన్ రిపేర్ చేస్తావా అని అడిగి డూప్లికేట్ వేలిముద్రలు చేస్తావా అని అడుగుతారు. అతను భయపడటంతో చితక్కొట్టి వాడిని అడుగుతుంది. దాంతో అతను పారిపోవడంతో ఎస్‌ఐ, లక్ష్మీ ఇద్దరూ వాడి వెంట పరుగెడతారు. సహస్ర వాడికే తను వేలిముద్రలు ఇచ్చిందా వాడికి ఏమైనా తెలుసా అని ఆ షాప్‌లో ఓ గది చూసి అందులోకి వెళ్తుంది. అక్కడ చాలా సర్టిఫికేట్లు అన్నీఉంటాయి. ఒక సిస్టమ్ కూడా ఉంటుంది. అందులో సహస్ర లక్ష్మీ వేలిముద్రలు ఇచ్చిన వాటి సాక్ష్యాలు ఉంటాయి. సహస్ర వాటిని డిలీట్ చేసేస్తుంది. మరోవైపు ఎస్‌ఐ అతన్ని పట్టుకొని షాప్‌కి తీసుకొచ్చి చితక్కొడుతుంది.

షాప్‌ అతను వెళ్లి ఆ గదిలో పడతాడు. అది చూసి సహస్ర దాక్కుంటుంది. ఎస్ఐ అదంతా చూసి ఏంట్రా ఇందంతా అని అడుగుతుంది. లక్ష్మీ వాడితో నా వేలిముద్రలు వాడుకొని వందల కోట్లు హ్యాక్ చేశారు. అని అతని గురించి అడుగుతుంది. హ్యాకర్ ఇదంతా చేయించాడని అంతకు మించి తనకు ఏం తెలీదు అంటాడు. ఇంతలో ఆ హ్యాకర్ వస్తాడు. షాప్ అతను అతనే హ్యాకర్ అని చూపిస్తాడు. ఎస్‌ఐ అతన్ని పట్టుకొని చితక్కొడుతుంది. నిజం చెప్పమని అడుగుతుంది. 

సహస్ర అక్కడే దాక్కొని భయంగా చూస్తుంది. ఆ హ్యాకర్ వంద కోట్లు హ్యాక్ చేశానని ఒప్పుకుంటాడు. ఒక వ్యక్తి ముసుగులో వచ్చి హ్యాక్ చేయమని చెప్పాడని ఆ వంద కోట్లు ఏం చేశారని అడిగితే సెల్‌ కంపెనీలకు పంపానని ఓ ఏజెంట్‌కి పంపానని చెప్తాడు. ఇక ఆ హ్యాకర్‌ని తీసుకొని సైబర్‌ సెల్‌కి పంపిస్తే మొత్తం తెలుస్తుందని అతన్ని తీసుకెళ్తారు. ఇక సహస్ర అయితే వీడియోలు డిలీట్ చేసేశా కాబట్టి నాకు ఏం ప్రాబ్లమ్ లేదు అనుకుంటుంది. 

విహారికి మెలకువ వస్తుంది. పండు వచ్చి మీరు లేచారా బాబు పడుకోండి అని చెప్తాడు. విహారి లక్ష్మీ గురించి అడిగితే నన్ను ఇక్కడ కాపాలా పెట్టి బయటకు వెళ్లారని చెప్తాడు. లక్ష్మీ ఇక్కడే ఉన్నా నాకు ఎందుకు చెప్పలేదురా అని పండుని విహారి అడిగితే సహస్ర అమ్మ రావొద్దని చెప్పారని సహస్ర, పద్మాక్షిలు అంబికను అవమానించడం గురించి చెప్తాడు. నా కోసం ఇంత చేసిన లక్ష్మీని నేను వెంటనే కలవాలి అని అనుకుంటాడు. చారుకేశవ విహారికి ఎదురు పడి ఎక్కడికి వెళ్తున్నావ్ అంటే అందరూ లక్ష్మీని పంపేశారు లక్ష్మీ కనిపించడం లేదు మామయ్య అంటాడు. విహారి, చారుకేశవలు బయటకు వెళ్తారు. ఇక చారుకేశవ వంద కోట్లు సెల్ కంపెనీలకు ట్రాన్స్‌ఫర్ అయ్యావని మరో 30 కోట్లు ఓ ఇండియన్ అకౌంట్ అడ్రస్ దొరికిందని అంటాడు. 

చారుకేశవ లక్ష్మీకి కాల్ చేస్తాడు. విషయం చెప్తాడు. లక్ష్మీ వాళ్లతో హ్యాకర్ దొరికాడని చెప్తుంది. అంతా చారుకేశవకు దొరికిన అడ్రస్‌కి బయల్దేరుతారు. మరోవైపు విహారి కనిపించడం లేదని యమున, సహస్ర వాళ్లు మొత్తం వెతుకుతారు. ఇంటికి వచ్చి వెతుకుతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Also Read: చిన్ని సీరియల్: లోహిత భర్త్‌డే పార్టీని నాశనం చేసిన మధు.. ఏదో ఒకటి చేయ్ మ్యాడీ అంటూ నడిరోడ్డు మీద రచ్చ!