Jagadhatri  Serial Today Episode:  20 ఏళ్ల క్రితం మిస్సయిన ఫైల్‌ కోసం వెతుక్కుంటూ మిలటరీ క్యాంపు దాకా వెళ్తారు ధాత్రి, కేదార్‌. మిలటరీ మేజర్‌ షర్మిల ఠాకూర్‌ మాత్రం ఆ ఫైల్‌ ఇక్కడ లేదని ఇక్కడి నుంచి మీరు వెళ్లండని పంపించి వేస్తుంది. అయితే ఫైల్‌ ఎక్కడున్నట్లు అసలు కమీషనర్‌ నిజం చెప్పాడా? అబద్దం చెప్పాడా? అని ఆలోచిస్తూ.. బయటకు వస్తారు. గేటు దగ్గర ఉన్న సత్యప్రసాద్‌ నేను 20 ఏండ్ల నుంచి వెతుకుతున్నా ఆ ఫైల్‌ దొరకలేదని మీకు ఆల్‌ ది బెస్ట్‌ అని చెప్పి వెళ్లిపోతాడు. తర్వాత కేదార్‌, ధాత్రి ఇంటికి వస్తారు.


ధాత్రి: ఏంటి కేదార్‌ ఇది. మా అమ్మ ఏ తప్పు చేయలేదని నిరూపించుకునే అవకాశమే లేదా?


కేదార్‌: బాధపడకు ధాత్రి. సమస్య పెట్టిన ఆ దేవుడే దానికి తగ్గ పరిష్కారం పెడతారు అంటారు. నీ సమస్యకు నా దగ్గర పరిష్కారం ఉంది.


ధాత్రి: నీ దగ్గర పరిష్కారం ఉందా? ఏంటది..?


కేదార్‌: సాధు సార్. సాధు సార్‌ కు ఫోన్‌ చేస్తే షర్మిల ఠాగూర్‌ గారితో మాట్లాడి మనకు ఏదైనా హెల్ఫ్‌ చేయొచ్చు.


ధాత్రి: అవును కదా నువ్వు చెప్పింది కూడా నిజమే..ఈ ఐడియా నాకెందుకు రాలేదు. వెంటనే సాధు సార్‌ కు ఫోన్‌ చేయ్‌.


 అని ధాత్రి చెప్పగానే కేదార్‌ అటూ ఇటూ చూసి సాధుకు ఫోన్‌ చేస్తాడు. సాధుతో ధాత్రి జరిగింది మొత్తం చెప్తుంది. షర్మిల గారితో మాట్లాడి మీరే నాకు సాయం చేయాలని రిక్వె్స్ట్‌ చేస్తుంది. అయితే తాను హెల్ఫ్‌ చేయలేనని మేమిద్దరం ఒకేసారి ఐపీఎస్‌ సెలెక్ట్‌ అయ్యాము ఆమె ఒక్కసారి నో అంటే ఇక ఒప్పుకోదు. అని చెప్తాడు. కానీ ధాత్రి రిక్వెస్టు చేయగానే ఆమె అక్కడ ఉండగా ఆ క్యాంపులో మనమేం చేయలేమని ఫోన్‌ కట్‌ చేస్తాడు సాధు. దీంతో ధాత్రి ఏడుస్తుంది. కేదార్‌ ఓదారుస్తాడు. తర్వాత తినడానికి ఏదైనా చేస్తాను ఉండు అని కేదార్‌ కుకింగ్‌ చేయబోతుంటే ఇంతలో కేదార్‌కు ఫోన్‌ లో సుధాకర్‌ బర్తుడే అలర్ట్‌ వస్తుంది. దీంతో ఇద్దరూ కలసి బర్తుడే చాలా గ్రాండ్‌ గా చేయాలని డిసైడ్‌ అవుతారు. మరోవైపు యువరాజ్‌ మత్తుగా ఊగుతూ ఇంటికి వస్తాడు.


నిషిక: యువరాజ్‌ వచ్చేశావా? రోజూ లాగే ఆలస్యం చేస్తావనుకున్నాను. కానీ ఈరోజు తొందరగానే వచ్చేశావే..


యువరాజ్‌: అవును అమ్మాడి నేను వచ్చేశా..


నిషిక: ఏంటి డ్రింక్‌ చేశావా?


యువరాజ్‌: అంటే ఫ్రెండ్‌ బర్తుడే అమ్మాడి. అందుకే వాడు పార్టీ ఇచ్చాడు. బలవంతంగా తాగించేశాడు


 అని చెప్పగానే నిషిక కోపంగా యువరాజ్‌ ను తిడుతుంది. మీరిలా రావడం ఇంట్లో ఎవరైనా చూశారా?  అని అడుగుతుంది. లేదని యువరాజ్‌ చెప్పగానే సరే నేను చూసి వస్తాను అని బయటకు వెళ్లి చూసి వచ్చి యువరాజ్‌ ను తిడుతుంది. నువ్విలాగే ఉంటే ఏదో ఒకరోజు వాణ్ని కొడుకుగా స్వీకరిస్తారు అని నిషిక చెప్తుంది. ఇంతలోనే వైజయంతి రాగానే యువరాజ్‌ గుడ్‌ మార్నింగ్‌ చెప్పడంతో వైజయంతి తాగి వచ్చావా? అని యువరాజ్‌ ను కొడుతుంది.


    నువ్వు తాగుడుకు అలవాటు పడతావని అనుకోలేదు. నిన్ను మీ నాన్న ఇలాంటి పరిస్థితుల్లో చూస్తే ఆయన భరించలేడని తిడుతుంది. సుధాకర్‌ గుమ్మం దగ్గర నిలబడి అంతా వింటుంటాడు. తర్వాత అందరూ పడుకున్నాక సుధాకర్‌ కోసం సర్‌ప్రైజ్‌ ప్లాన్‌ చేసిన ధాత్రి, కేదార్‌ వెళ్లి డోర్‌ కొడతారు. ఉలిక్కిపడి నిద్ర లేచిన సుధాకర్‌ తో వైజయంతి ఎవరైనా దొంగలు వచ్చారేమో అని భయపడుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: ‘మేఘసందేశం’ సీరియల్‌: భూమికి ఘనస్వాగతం పలికిన అపూర్వ – చంద్రను చూసి ఎమోషన్ అయిన భూమి