Jagadhatri Serial Today Episode: వైజయంతి పూజ చేసి వచ్చి యువరాజ్ కు హారతి ఇచ్చి కేదార్ ను నమ్మొద్దని చెప్తుంది. దీంతో కౌషికి ఎందుకు పిన్ని అలా చెప్తున్నావు అంటూ కేదార్ ను వెనకేసుకొస్తుంది. ఇంతలో సత్యప్రసాద్ వచ్చి మాధురి ఎంగేజ్‌మెంట్ ఎప్పుడు పెట్టుకుందామని అడుగుతాడు. ఈ మూహూర్తాల్లోనే పెట్టుకుందామని సుధాకర్ చెప్తాడు.
మరోవైపు ధాత్రి వాళ్ల అమ్మ ఫోటో తీసుకుని చూస్తూ ఎమోషనల్ అవుతుంది. సంవత్సరీకం ఎప్పుడూ చేయలేదని.. ఈసారి అయినా చేద్దామని అనుకుంటున్నట్లు కేదార్ కు చెప్తుంది. అందుకే క్యాటరింగ్ వాళ్లకు చెప్పాను అంటుంది. మరోవైపు కింద అందరూ ఎంగేజ్‌మెంట్ గురించి మాట్లాడుతుంటే క్యాటరింగ్ అతను వస్తాడు. మేము ఎంగేజ్ మెంట్ గురించి ఇప్పుడే మాట్లాడుతున్నాం. అప్పుడే నీకు ఎవరు చెప్పారని అడుగుతారు. ఇంతలో పైనుంచి కేదార్, ధాత్రి వస్తారు.
ధాత్రి: నేనే చెప్పాను..
నిషిక: ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి అన్నట్లు మా ఇంట్లో పెళ్లికి మీరు క్యాటరింగ్ వాళ్లను పిలవడమేంటి?
ధాత్రి: నిషిక నీకు ఆవేశపడటం తప్పా ఒక్క నిమిషం ఆలోచించడం తెలియదా? నేను క్యాటరింగ్ అతన్ని పిలిచింది మాధురి ఎంగేజ్‌మెంట్ ఫంక్షన్ కోసం కాదు. వచ్చే వారం మా అమ్మ సంవత్సరీకం. అందుకే ఒక వంద మందికైనా అన్నదానం చేయాలనుకుంటున్నాను. దానికోసమే వివరాలు కనుక్కోవడం కోసం ఇతన్ని పిలిపించాను.
అని ధాత్రి చెప్పగానే సత్యప్రసాద్ నవ్వుతూ మంచి వాళ్లు పోతేనే అన్నదానం చేస్తారో లేదో కానీ ఒక క్రిమినల్ పేరు మీద అన్నదానం జరిపిస్తామంటే నవ్వొస్తుంది నాకు అంటాడు. దీంతో ధాత్రి కోపంగా సత్యప్రసాద్‌ను తిడుతుంది. దీంతో ఇంట్లో పెద్ద గొడవ అవుతుంది. వైజయంతి, నిషిక, కమలాకర్, యువరాజ్ అందరూ కలసి ధాత్రిని తిడతారు. నువ్వు ఓపెన్ గా అన్నదానం చేస్తే ఒక క్రిమినల్ కూతురుకు మా ఇంటికి రిలేషన్ ఉందని తెలిస్తే ఈ ఇంటి పరువు పోతుంది అందుకే నువ్వు చేయోద్దని చెప్తాడు. దీంతో కౌషికి అడ్డు పడుతుంది. వాళ్ల సంవత్సరీకం జరుపుకుంటే మనకేంటి నష్టం అంటుంది. ఇంతలో ధాత్రి కోపంగా మా అమ్మ నిజాయితీ నిరూపిస్తాను మా అమ్మపై నేరం మోపిన వాళ్ల లెక్కలన్నీ బయటకు తీస్తానని ఛాలెంజ్ చేస్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు.
వైజయంతి: చూశారా? పెద్దంతరం.. చిన్నంతరం లేకుండా.. ఎంత మాట్లాడి పోయిందో..
కౌషికి: పిన్ని తల్లిని అవమానిస్తే జగధాత్రికి ఏంటి? ఎవరైనా అలాగే స్పందిస్తారు. అయినా వాళ్లు అమ్మను అనాల్సిన అవసరం ఏంటి? వాళ్ల అమ్మా ఏ నేరం చేసిందో మనం ఏమైనా చూశామా?
(అంటూ కోపంగా కౌషికి వెళ్లిపోతుంది. దీంతో సత్యప్రసాద్ కూడా వెళ్లిపోతాడు.)
సుధాకర్: మీరు మారరా? వాడు మనకు కాబోయే వియ్యంకుడు. ఇకనైనా నోటి దురుసు తగ్గించుకోండి.
నిషిక: అత్తయ్య మనం అనకూడని మాటేమైనా అన్నామా? మామయ్య ఏంటి అంత సీరియస్‌గా వెళ్లిపోతున్నారు.
అనగానే వైజయంతి ఆయన అంతేలే అమ్మా అంటుంది. మరోవైపు ఇంట్లో వాల్లు తన తల్లిని అన్న మాటలు గుర్తు చేసుకుని బాధపడుతుంది ధాత్రి. తన తల్లిని గుర్తు చేసుకుని ఎమోషనల్ అవుతుంది. కౌషికి, కేదార్ వచ్చి ధాత్రిని ఓదారుస్తారు. తర్వాత ఒక జిమ్ కు వెళ్లిన ధాత్రి, కేదార్ కుమార్ అనే వ్యక్తిని కలిసి మీనన్ లా మిమిక్రీ చేయాలని అడుగుతారు. సినిమా డైరెక్టర్ గౌతమ్ మీనన్ లా అనుకుని మిమిక్రీ చేయబోతే మీనన్ అంటే ఆయన కాదని మాఫియా డాన్ మీనన్ లాగా చేయాలని చెప్తారు. సరే చేస్తానని చెప్తాడు కుమార్. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.