Jagadhatri  Serial Today Episode:  జిమ్ములో ఉన్న డ్రగ్స్‌ డబ్బాను కాచి తీసుకుంటే యువరాజ్‌ లాక్కుని వద్దని వారిస్తాడు. దీంతో ధాత్రి, కేదార్‌.. యువరాజ్‌ ను  అనుమానిస్తారు. ఇంతలో లోపలి నుంచి హీరో తూలుతూ బయటకు వస్తారు. నిషికను చూసి బేబీ అనుకుంటూ హగ్‌ చేసుకోవడానికి వస్తాడు. దీంతో యువరాజ్‌ డీహైడ్రేట్‌ అయ్యుంటాడని కవర్‌ చేస్తాడు. నువ్వు ఎక్కువ తూలుతే బిజినెస్‌ కు ప్లాబ్లమ్‌ అవుతుంది అని హెచ్చరిస్తుంది. తర్వాత అందరూ వెళ్లిపోతారు. ధాత్రి మాటలు గుర్తు చేసుకున్న టోనీ ఆ అమ్మాయిని చూస్తుంటే నాకేదో డౌట్‌ గా ఉందని అంటాడు. మనల్ని భాగా అబ్జర్వ్‌ చేస్తున్నట్లు ఉంది. ఇంకోసారి ఆ అమ్మాయిని ఇటు వైపు రానివ్వకు అని చెప్తాడు. మరోవైపు కిచెన్‌ లో ఉన్న ధాత్రి, జిమ్‌ ల జరిగిన విషయం గుర్తు చేసుకుంటుంది.


ధాత్రి: జిమ్‌ లో ఏదో జరుగుతుంది. ( మనసులో అనుకుంటుంది.)


కేదార్: ఏంటి ధాత్రి మనిషివి ఇక్కడే ఉన్నావు. మనసు ఎక్కడో ఉన్నట్లుంది.


ధాత్రి: ఆ జిమ్‌ గురించి ఆలోచిస్తున్నాను కేదార్‌.


కేదార్: టోనీని క్లోజ్‌ ఫ్రెండ్‌ అంటున్నాడు. కానీ ఒక్కటి కూడా సింక్‌ అవ్వట్లేదు. వచ్చీ రాగానే బిజినెస్‌ అన్నాడు. అక్కడ చూస్తే ఒక్కడూ కూడా సరిగ్గా కనిపించడం లేదు.


ధాత్రి: బూచి అన్నయ్యా ఆ హీరో ఇద్దరూ ఒకేలా బిహేవ్‌ చేశారు కదా కేదార్‌.


కేదార్‌: అవును ధాత్రి. బావ బాడీలో మత్తు మందు ఉందని డాక్టర్‌ చెప్పారు. అంటే..


ధాత్రి: యువరాజ్‌ పబ్లిక్‌లో అంత పని చేస్తాడా?


కేదార్‌: అన్ని కేసుల్లో బయటపడతాడేమో కానీ మత్తు పదార్థాల దందాలో ఇరుక్కుంటే పరిస్థితేంటి..? ఇంత రిస్క్‌ చేసి యువరాజ్‌ ఆ మత్తు పదార్థాలు అమ్ముతాడా?


ధాత్రి: యువరాజ్‌ ఎలాంటి ఇల్లీగల్‌ పనులు అయినా చేసే సామర్థ్యం ఉన్నవాడు.


 అని ఇద్దరూ కలిసి జిమ్‌ లో ఎం జరుగుతుందో కనిపెట్టాలని డిసైడ్‌ అవుతారు. తర్వాత కేదార్‌ వంట చేస్తాడు. మరోవైపు కాచి, బూచిపై అలిగి డైనింగ్‌ టేబుల్‌ దగ్గరకు వెళ్తుంది. అక్కడే ఉన్న వైజయంతి ఏమైందని కాచిని అడుగుతుంది. దీంతో నిన్న మొత్తం ఏదే చేశారని అలిగానని చెప్తుంది. ఇంతలో కేదార్‌, ధాత్రి వస్తారు. కేదార్‌ వడ్డిస్తుంటే.. నువ్వెందుకు వడ్డిస్తున్నావని కౌషికి అడుగుతుంది.


కేదార్‌: ధాత్రి వంట చేస్తుంటే చెయ్యి కాలింది అక్క.


కౌషికి: ధాత్రి కొద్ది రోజులు నువ్వు వంట చేయకు అసలు వంటే చేయకు అని ఎన్నిసార్లు చెప్పాను నీకు.


నిషిక: అబ్బో ఏం ప్రేమలండి. సోంత మరదలు మీద మాత్రం ప్రేమలుండవు కానీ ఎన్నాళ్లుంటుందే తెలియదు కానీ ఆ మరదలు మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారు వదిన.


కౌషికి: ఎదుటివాళ్లు మనకు ఏది ఇస్తే తిరిగి వాళ్లకు అదే ఇవ్వాలనిపిస్తుంది. జగధాత్రి మనకు ప్రేమను ఇస్తుంది. అందుకే మనకు తెలియకుండానే తనకు ప్రేమను పంచుతాం.


వైజయంతి: అవునమ్మీ మీరిద్దరూ మాత్రమే ప్రేమించుకోవడానికే పుట్టారు. మేము మాత్రం కొట్టుకోవడానికి తిట్టుకోవడానికే పుట్టాము.


   అని వెటకారంగా మాట్లాడుతుంది. కౌషికి ధాత్రిని పక్కన కూర్చోబెట్టి భోజనం వడ్డిస్తుంది. భోజనం తింటున్న కౌషికి వంటలు బాగా చేశావని ధాత్రిని మెచ్చుకుంటుంది. దీంతో ఇవాళ నేను వంట చేయలేదని కేదార్‌ చేశారని చెప్పడంతో బూచి వెటకారంగా మాట్లాడతాడు. ఇంతలో సుధాకర్‌ వచ్చి భోజనం చేస్తాడు. వంటలు ఎలా ఉన్నాయని కౌషికి అడుగుతుంది. చాలా బాగున్నాయని సుధాకర్‌ చెప్పడంతో కేదార్‌ థాంక్స్‌ చెప్తాడు. తర్వాత వైజయంతి పూజ చేసి వచ్చి యువరాజ్‌ కు హారతి ఇచ్చి కేదార్‌ ను నమ్మొద్దని చెప్తుంది. దీంతో కౌషికి వైజయంతిని తిడుతుంది. ఇంతలో దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: అపర్ణను చంపేందుకు రాహుల్, రుద్రాణి ప్లాన్ – రాహుల్ ను వదిలేసిన పోలీసులు