Brahmamudi Serial Today Episode:  సీతారామయ్య  దగ్గరకు వెళ్లిన రుద్రాణి ఎమోషనల్‌ గా ఫీలవుతూ.. రాహుల్‌ ను బయటకు తీసుకురావాలని కోరుతుంది. అయితే అందుకు సీతారామయ్య ఒప్పుకోడు. రాహుల్‌కు ఎంతో పెద్ద బాధ్య‌త అప్ప‌గిస్తే స్వార్థంతో ఈ ఇంటికే మ‌చ్చ తీసుకురాబోయాడ‌ని తిడతాడు. నా ముఖం చూసైనా రాహుల్‌ను విడిపించ‌మ‌ని రుద్రాణి...రిక్వెస్ట్ చేస్తుంది. నీ ముఖం చూస్తే అస‌లు రాహుల్‌ను క్ష‌మించాల‌నే అనిపించ‌ద‌ని ఇందిరాదేవి అంటుంది.


    తర్వాత రాజ్‌ దగ్గరకు వెళ్లి రాహుల్‌ ను జైలు నుంచి విడిపించుకురావాలని కోరుతుంది. ఎమోషనల్‌ గా ఫీలవుతూ రాజ్‌ కు సెంటిమెంట్‌ డైలాగులు చెప్తుంది. అయితే రాజ్‌ కూడా తాను ఆ పని చేయలేనని చెప్తాడు. అయితే స్వప్న కోసమైనా ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసమైనా రాహుల్‌ ను విడిపించమని వేడుకుంటుంది రుద్రాణి. ఇంతలో అక్కడకు అపర్ణ వస్తుంది.


అపర్ణ: ఇన్నాళ్లకు నా కొడుకు మంచితనం నీకు గుర్తుకు వచ్చిందా? రుద్రాణి. రాజ్ త‌ప్పు చేశాడ‌ని పోలీసులు అరెస్ట్ చేసిన‌ప్పుడు వాడిపై నింద‌లు వేశావు. క‌నీసం మేన‌ల్లుడు అనే జాలి చూపించ‌లేదు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని రాజ్ ద‌గ్గ‌ర‌కు వచ్చావు. సాయం అడ‌గ‌టానికి సిగ్గులేదా నీకు.


రుద్రాణి: అది కావు వదిన నీ కొడుకు త‌ప్పు చేస్తే ఇలాగే మాట్లాడుతావా..?  


అపర్ణ: ఏం మాట్లాడుతున్నావు రుద్రాణి.. నా కొడుకు రాజ్ అస‌లు త‌ప్పు చేయడు. మాయ విష‌యంలో రాజ్ త‌ప్పు చేశాడ‌ని ఆరోప‌ణ‌లు రావ‌డంతో వాడిని ఇంట్లోంచి వెళ్లిపోమ్మని నేనే తీర్పు ఇచ్చాను. కానీ కడిగిన మత్యంలా తిరిగి ఇంట్లోకి వ‌చ్చాడు.


 అని అపర్ణ తిట్టడంతో రుద్రాణి కోపంతో రగిలిపోతుంది. నా కొడుకునే జైలు పంపిస్తారా? ఈ కుంటుంబాన్ని ముక్కలు చేయకపోతే నాపేరే రుద్రాణి కాదు అన్నంతగా మనసులో అనుకుని వెళ్లిపోతుంది. మరోవైపు స్వప్న బిర్యాని తింటుంది. అది చూసిన రుద్రాణి కోపం మరింత పెరుగుతుంది.


రుద్రాణి: నీ మొగుడు పోలీస్ స్టేష‌న్‌లో ఉన్నాడ‌నే బాధ లేదా.. కూర్చుని బిర్యాని తింటున్నావు.


స్వప్న: కుట్ర‌లు, కుతంత్రాలు చేసిన వారు జైలుకే పోతారు. చేసిన త‌ప్పుకు రెండు, మూడేళ్లు జైలు శిక్ష త‌ప్ప‌దు. రాహుల్ గురించి ఆలోచించ‌డం మానేసి నువ్వు బిర్యాని తిను అత్త.


అని స్వప్న చెప్తుండగానే పోలీసులు రాహుల్‌ ను తీసుకొచ్చి ఇంట్లో వదిలేసి.. మీ కంపెనీ పేరుతో.. రాహుల్‌ పేరుతో ఎవరో తప్పు చేశారని.. వారిని పట్టుకునే ప్రయత్నంలో డిపార్ట్‌ మెంట్‌ ఉందని వెళ్లిపోతారు. దీంతో ఇంట్లో వాళ్లందరూ షాక్‌ అవుతారు. త‌న కొడుకు జైలు నుంచి రిలీజ్ కావ‌డంతో రుద్రాణి ఆనంద‌ప‌డుతుంది.


 రుద్రాణి: నిన్న నా కొడుకు త‌ప్పు చేశాడ‌ని తీర్మాణించిన వాళ్లు ఇప్పుడు ఏమంటారు. నా కొడుకును క‌ట‌క‌టాల రుద్రాయ్య‌లా చూడాల‌ని మీ ఆశ అడుగంటిపోయినందుకు అవాక్కైయ్యారా..?  ఇప్పుడు చెప్పండి మీ  నీతి సూత్రాలు,  ఇప్పుడు చెప్పండి మీ సుభాషితాలు


కావ్య: నీ కొడుకు ఇంటికి వ‌చ్చినంత మాత్రాన నిర్ధోషి అని రుజువు అయిన‌ట్లు కాదు. స‌త్యాన్వేష‌ణ మొద‌లుపెడితే నీ కొడుకు బాగోతాలు మొత్తం బ‌య‌ట‌ప‌డ‌తాయి. ఇంట్లో పెద్దవాళ్లను, నా భర్తను, నా అత్తను ఏక‌వ‌చ‌నంతో సంబోదిస్తే ఊరుకునేది లేదు.


 అని కావ్య, రుద్రాణికి వార్నింగ్ ఇస్తుంది.  నిన్నటి సాక్ష్యాలు ఇవాళ ఎలా చెల్లకుండా పోయాయో.. మా ఆయన్ని ఈ కేసులో ఎవరు ఇరికించాలని అనుకున్నారో అంతా బయటపెడతానని కావ్య చాలెంజ్‌ చేస్తుంది. తర్వాత రాహుల్‌, రుద్రాణి కలిసి అపర్ణను చంపేసి ఆ నేరం కావ్య మీద పడేలా చేయాలనుకుంటారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.