Jagadhatri Serial Today Episode: పంతులు ప్రాణప్రతిష్ట చేసి పూజ మొదలుపెడదాం అంటాడు. ఇంతలో నిషిక, యువరాజ్ కు ఫోన్ చేసి పూజ మొదలవుతుంది అని చెప్పగానే నేను వచ్చేవరకు ఆగమని చెప్పు అంటాడు యువరాజ్, ధాత్రి కూడా యువరాజ్ వచ్చే వరకు ఆగమంటున్నాడా? అని అడగ్గానే అవునని చెప్తుంది. దీంతో ధాత్రి పంతులును అడుగుతుంది. పంతులు అంత టైం లేదని చెప్తాడు. కౌషికి ఫోన్ తీసుకుని యువరాజ్ మేము పూజ మొదలుపెడతాం మీరు మధ్యలో వచ్చి జాయిన్ అవ్వండి అని చెప్తుంది. మరోవైపు సేమ్ విగ్రహం తీసుకురావడానికి షాపు వెళ్లి సేమ్ విగ్రహం తీసుకుని వస్తుంటారు. ఇంటి దగ్గర పూజ మొదలు పెడతారు.
ధాత్రి: యువరాజ్ వాళ్లు వచ్చేలోపే ప్రాణ ప్రతిష్ట అయిపోవాలి కేదార్. అప్పుడే మనం డబ్బును ఇక్కడ లాక్ చేసి వాళ్ల ఆటలు కట్టడి చేయగలుగుతాం.
కేదార్: పంతులుగారికి అన్ని చెప్పే తీసుకొచ్చాం ధాత్రి. మనం అనుకున్న టైంకు ప్రాణప్రతిష్ఠ అయిపోతుంది.
మరోవైపు కమలాకర్, యువరాజును నిషికకు ఫోన్ చేసి మనం వచ్చే వరకు పూజ ఆపమని చెప్పు అంటాడు యువరాజ్ ఫోన్ చేస్తే నిషికి ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇంకోవైపు కేదార్ పంతులుకు సైగ చేయగానే పంతులు ఇక ప్రాణప్రతిష్ట చేద్దాం అని చెప్పి చేస్తాడు. ఇంతలో మరో విగ్రహంతో ఇంటికి వచ్చిన యువరాజ్ లోపలికి వచ్చి చూసే లోపు పూజ మొదలవుతుంది. ఆగండి అంటూ ప్రాణప్రతిష్ట జరిగిన విగ్రహాన్ని చూసిన యువరాజ్ షాక్ అవుతాడు.
సురేష్: యువరాజ్ ఇంట్లో విగ్రహం ఉంది కదా? మళ్లీ ఆ విగ్రహం ఎందుకు తీసుకొచ్చారు.
యువరాజ్: ఆ విగ్రహం ఇక్కడ పెట్టి ఈ విగ్రహం తీసుకెళ్లడానికి. ఇది ఆఫీసు విగ్రహం బాబాయ్ మన వాళ్లను వచ్చి ఈ విగ్రహం తీసుకెళ్లి ఆఫీసులో పెట్టమనండి.
కేదార్: ఏం మాట్లాడుతున్నావు యువరాజ్ ఒక్కసారి ప్రాణప్రతిష్ట చేసిన విగ్రహాన్ని ఎలా కదుపుతావు.
యువరాజ్: నా విగ్రహం కదుపుకుంటాను. కుదుపుకుంటాను. నీకెందుకు.?
ధాత్రి: పెద్దలు పిల్లలు ఉన్న ఇల్లు ఇది యువరాజ్. పద్దతులు, పట్టింపులు అని కొన్ని ఉంటాయి. ఒక సారి ప్రాణప్రతిష్ట జరిగిన విగ్రహాన్ని కదిలించకూడదు. అది మన ఆచారం. ఆచారాన్ని కాదంటే అపచారం జరగుతుంది.
వైజయంతి: ఈ అమ్మీ చెప్పేది నిజమేరా అబ్బోడా.
యువరాజ్: ఈ ప్రాణ ప్రతిష్ట నేను ఒప్పుకోను అమ్మా.. అయినా ఇది మనదా కాదా? అని కొంచె కూడా ఆలోచన లేకుండా పూజలు చేసేస్తారా?
కాచి: ఈ విగ్రహం మనదే కదా అన్నయ్యా..
యువరాజ్: మనది కాదు.. నాది. నాకోసం నేను కొన్న విగ్రహం. అయినా అలాంటి విగ్రహమే కదా అది. అది పెట్టుకుని దీన్ని ఇచ్చేయండి. ఆఫీసు దగ్గర పెట్టుకోవాలి.
సుధాకర్: రేయ్ ఏమైందిరా నీకు ఏదేదో మాట్లాడుతున్నావు. అయినా రెండు ఒకేలా ఉన్నాయి కదా? ఆ విగ్రహమే ఆఫీసు దగ్గర పెట్టు.
యువరాజ్: ఒక్కటే కాదు నాన్నా ఈ విగ్రమం వేరు ఆ విగ్రహం వేరు.
కమలాకర్: అదే అన్నయ్యా మొదటగా నిన్న ఆఫీసు దగ్గర పెట్టాడు కదా అందుకే కొంచెం సెంటిమెంటుగా ఫీలవుతున్నాడు.
కౌషికి: నిషిక అడిగిందని నిన్న వాడే ఇంటికి తీసుకొచ్చాడు కదా బాబాయ్. మళ్లీ ఇలా మాట్లాడుతున్నాడేంటి..?
యువరాజ్: నేనెందుకు తీసుకొస్తాను అక్కా ఆ విగ్రహం ఎలా వచ్చిందో నాకు తెలియదు.
నిషిక: అంటే నాకోసం విగ్రహం తీసుకురాలేదా? అయినా ఈ మనిషి నాకు టైమే ఇవ్వడు. ఇక నమ్మడం వేస్టే..
అంటూ నిషిక ఆలిగి ఇంట్లోకి వెళ్లిపోతుంది. ఆమెతో పాటు వైజయంతి, కాచి వెళ్లిపోతారు. కూల్ గా కేదార్ ఫ్రెష్ అయ్యి పూజలో కూర్చుందువురా అంటాడు. అందరూ ష్రెష్ అవ్వడానికి లోపలికి వెళ్తారు. తర్వాత కమలాకర్, యువరాజ్ డబ్బు ఎలాగైనా విగ్రహంలోంచి తీసేయాలని ప్లాన్ చేసి మీనన్‌కు ఫోన్ చేసి చెప్తారు. మీనన్, యువరాజ్ కు వార్నింగ్ ఇస్తాడు. మరోవైపు యువరాజ్, కమలాకర్ విగ్రహంలోంచి డబ్బు తీయడానికి ప్లాన్ చేస్తారని ధాత్రి, కేదార్ కు చెప్తుంది.
తర్వాత కంపెనీ నుంచి రాఘవరావు ఫోన్ చేసి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ కు ఏర్పాటు చేశామని అందరూ మన వైపే ఉన్నారని చెప్తాడు. అదే విషయం కౌషికి అందరికీ చెప్పగానే సీఈవో పదవిపై గొడవ జరుగుతుంది. గొడవలో నిషిక, కౌషికిని తోసేస్తుంది. దీంతో ధాత్రి కంగారుగా నొప్పి ఏమైనా ఉందా? అని అడుగుతుంది. దీంతో ఇవాల్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఈ రాశిలో జన్మించినవారు ఆత్మలతో మాట్లాడతారా! వీరికి అతీంద్రీయ శక్తులు సైతం