Jagadhatri  Serial Today Episode:  విగ్రహంలోనే ఫేక్‌ కరెన్సీ ఉందని నిర్దారించుకున్న ధాత్రి, కేదార్‌ రాత్రికి తమ టీంతో వెళ్లి అటాక్‌ చేస్తారు. మరోవైపు ఆఫీసు దగ్గరకు వస్తుంటారు యువరాజ్‌, కమలాకర్‌. రేపటి నుంచి డబ్బులు డిస్టిబ్యూట్‌ చేద్దామనుకుంటారు. మరోవైపు రౌడీలను కొట్టిన ధాత్రి, కేదార్‌ లు వినాయక విగ్రహాన్ని తీసుకుని వెళ్లిపోతారు. ఇంతలో అక్కడికి వచ్చిన యువరాజ్‌, కమలాకర్‌ విగ్రహం లేకపోవడంతో టెన్షన్‌ పడతారు. కమలాకర్‌ సీసీటీవీ పుటేజీ చూసి వచ్చి సీసీ కెమెరాలు కూడా పనిచేయడం లేదని చెప్తాడు. యువరాజ్‌ కంగారుపడుతుంటాడు.  


కమలాకర్‌: ముందు ఈ విషయం మీనన్‌ కు ఎలా చెప్పాలో అది ఆలోచించు. ముందు ఫోన్‌ చేయ్‌.


యువరాజ్‌: ముందు మీనన్‌ కు ఈ విషయం ఎలా చెప్పాలి బాబాయ్‌.


కమలాకర్‌: ముందైతే ఫోన్‌ చేయ్‌ ఎలాగో మేనేజ్‌ చేద్దాం.


మీనన్‌: చెప్పు యువరాజ్‌..


యువరాజ్‌: భాయ్‌ మన వాళ్లను ఎవరో కొట్టి విగ్రహం తీసుకెళ్లిపోయారు.


మీనన్‌: విగ్రమం పోవడం ఏంటి యువరాజ్‌ దాని విలువ తెలుసా? నీకు ఈ డీల్‌ కానీ ఫినిష్ చేయకుంటే మనకు జరిగే నష్టం తెలుసా?


యువరాజ్‌: సారీ భాయ్‌ విగ్రహం ఎవరు తీసుకెళ్లినా.. ఎక్కడికి తీసుకెళ్లినా రేపు పొద్దున వరకు తీసుకొచ్చే బాధ్యత నాది. నన్ను నమ్ము భాయ్‌. నా నుంచి విగ్రహాన్ని తీసుకెళ్లి వాళ్లు ఎంత తప్పు చేశారో వాళ్లకు తెలిసేలా చేస్తాను.


 అని కమలాకర్‌ ను తీసుకుని సిటీలో వెతుకుదాం పద అని వెళ్తారు. సిటీలో గల్లీ గల్లీ తిరుగుతూ విగ్రహం వెతుకుతుంటారు. మరుసటి రోజు ఉదయం బూచి ఇంటి తలుపులు తెరవగానే వినాయకుని విగ్రహం కనిపిస్తుంది. అందర్నీ పిలుస్తాడు. నిషిక వచ్చి చూసి హ్యాపీగా ఫీలవుతుంది. కమలాకర్‌ వచ్చి విగ్రహం చూసి షాక్‌ అవుతాడు.


కమలాకర్‌: విగ్రహం ఇక్కడికి ఎలా వచ్చింది.


ధాత్రి: గాల్లో ఎగురుకుంటూ వచ్చింది మామయ్యగారు.


కమలాకర్‌: వినాయకుడి విగ్రహం ఎగురుతుందా? అది సాధ్యమేనా..?


కౌషికి: ఏమైంది బాబాయ్‌ అలా బిగుసుకుపోయారేంటి?


బూచి: అయ్యో మామయ్యా ఇంత చిన్న వయసులోనే మీకు పక్షవాతం వచ్చిందా? కాచి ఇక మీ నాన్న బల్లాల దేవ నాన్నలాగా ఇలా చేయి పెట్టుకుని నా కూతురు అనాల్సిందే. మీరేం బయపడకండి మామయ్య ఇకనుంచి నీ పెగ్గులు కూడా మీ పేరు చెప్పుకుని నేనే తాగుతా..?


 అనగానే కమలాకర్‌ కంగారుగా ఈ విగ్రహం గురించి యువరాజ్‌ కు తెలుసా? అని అడుగుతాడు. తెలియకుండానే  నిషికకు ఇష్టమని  ఈ విగ్రహం ఇక్కడికి తీసుకొస్తాడా? మామయ్య అంటుంది ధాత్రి. ఏమో అనుకున్నాం నిషిక, యువరాజ్‌ కు నువ్వంటే ఇంత ఇష్టం అని ఎప్పుడూ అనుకోలేదు అంటాడు కేదార్‌. వైజయంతి, యువరాజ్‌ను తీసుకురాపో అని చెప్తుంది. నిషిక లోపలికి వెళ్లి   యువరాజ్‌ను నిద్రలేపి విగ్రమం గురించి నాకు తెలిసిపోయింది అని చెప్తుంది. నిద్రమత్తులో బయటకు వచ్చిన యువరాజ్‌ విగ్రహాన్ని చూసి షాక్‌ అవుతాడు. మెల్లగా కమలాకర్‌ దగ్గరకు వెళ్లి..



యువరాజ్‌: బాబాయ్‌ ఇది మన ఆఫీసు  విగ్రహం కదా?


కమలాకర్‌: అవును యువరాజ్‌


యువరాజ్: ఇక్కడికి ఎలా వచ్చింది.


కమలాకర్‌: నాక్కూడా తెలియదురా?


యువరాజ్‌: బాబాయ్‌ డబ్బుల విషయం తెలిసిపోయిందా?


కమలాకర్‌: ఇంకా తెలియదురా? నువ్వు బయట పెట్టకు.


 అని చెప్పగానే యువరాజ్‌ విగ్రహం ఇక్కడికి ఎలా వచ్చింది అని అడుగుతాడు. దీంతో కౌషికి నువ్వే తీసుకొచ్చావని మాకు తెలుసులేరా? అంటుంది. యువరాజ్‌ నేను తీసుకురాలేదని ఎంత చెప్పినా వినరు. అందరూ కలిసి పూజ చేద్దామని రెడీ అవుదామని ధాత్రి చెప్పగానే అందరూ లోపలికి వెళ్లిపోతారు. సేమ్‌ ఇలాంటి విగ్రహమే ఇంకోటి తీసుకొచ్చి విగ్రమం మార్చేద్దామని యువరాజ్‌ చెప్పగానే సరే అని కమలాకర్‌ చెప్పగానే ఇద్దరూ వెళ్లిపోతారు. తర్వాత విగ్రహాన్ని మండపం ఏర్పాటు చేసి పూజలకు అన్ని రెడీ చేస్తుంటారు. ధాత్రి, యువరాజ్‌ ఎక్కడ అని నిషికను అడుగుతుంది.  ఏమో తెలియదని చెప్తుంది. పంతులు ముందు ప్రాణప్రతిష్ట చేసి పూజ మొదలుపెడదాం అంటాడు. ఇంతలో నిషిక, యువరాజ్‌ కు ఫోన్‌ చేసి పూజ మొదలవుతుంది అని చెప్పగానే నేను వచ్చేవరకు ఆగమని చెప్పు అంటాడు యువరాజ్‌  దీంతో ఇవాల్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: డార్జిలింగ్ వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఈ టైం అస్సలు మిస్ అవ్వద్దు