Jagadhatri Serial Today Episode: ఆదిలక్ష్మీని బయటకు తీసుకెళ్లిన వైజయంతి, కౌషికి మీదకు మరింతగా రెచ్చగొడుతుంది. ఇప్పుడ అవసరం తీరాక నిన్ను అసలు పట్టించుకోదు. నీ కొడుకు నీకు కాకుండా చేస్తుందని చెప్పడంతో నేను పడిన బాధ ఆ కౌషికి పడేలా చేస్తాను. బిడ్డ దగ్గర లేకుంటే ఎలా ఉంటుందో ఆ కౌషికికి తెలిసేలా చేస్తాను అని వెళ్లి కీర్తిని కిడ్నాప్ చేస్తుంది ఆదిలక్ష్మీ. అది చూసి హ్యాపీగా లోపలికి వెళ్తుంది వైజయంతి. ఏమ తెలియనట్టు లోపల ఫంక్షన్ లో పాల్గొంటుంది.
నిషిక: ఏంటత్తయ్యా విధ్వంసం జరిగిపోతుంది. అందరి నవ్వులు పోయి ఏడుపులు మొదలవుతాయి అని చెప్పారు. ఇక్కడ చూస్తే చాలా ప్రశాంతంగా ఉంది.
వైజయంతి: ఇది సునామికి ముందు వచ్చే ప్రశాంతత అమ్మీ. కాసేపట్లో ఆదిలక్ష్మీ సృష్టించే సునామీ ఎలా ఉంటుందో చూడు.
మాధురి: అక్కా కీర్తి కనిపించడం లేదక్కా…
కేదార్: కనిపించకపోవడం ఏంటి మధు ఇక్కడే ఎక్కడో ఆడుకుంటూ ఉంటుంది వెతకండి.
మాధురి: ఇల్లంతా వెతికాము అన్నయ్యా ఎక్కడ కనిపించడం లేదు.
ధాత్రి: వదినా మీరేం కంగారు పడకండి. కీర్తి ఇక్కడే ఎక్కడో ఆడుకుంటూ ఉంటుంది. మేము వెళ్లి వెతుకుతాం. కేదార్ పద.
సుధాకర్: అంతా వెతికావా? అమ్మా..
మాధురి: అంతా వెతికాము నాన్నా..
కేదార్, ధాత్రి వెతుకుతుంటారు. ఇంతలో నిషిక కనిపించనిది కీర్తి ఒక్కతే కాదు ఆదిలక్ష్మీ పిన్ని కూడా అని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. సురేష్ అవును అమ్మ కూడా ఎక్కడా లేదు అంటాడు. అంటే చెల్లెమ్మా కీర్తి పాపను తీసుకెళ్లిందా? అంటాడు. దీంతో ఎక్కడో ఏదో తప్పు జరిగింది. అత్తయ్య అలాంటిది కాదు అంటుంది కౌషికి. దీంతో వైజయంతి, నిషిక మిమ్మల్ని బాధపెట్టడానికి కీర్తిని తీసుకుపోయిందేమో అంటారు. ధాత్రి కూడా ఉండొచ్చని చెప్పి ఆదిలక్ష్మీ కోసం వెళ్తారు. కౌషికి, సురేష్ కూడా వెళ్తారు. వాళ్ల వెనకాల నిషిక, వైజయంతి వెళ్తారు. వీలైతే ఇవాళే కౌషికి ప్రెగ్నె్న్సీ కూడా పోగొట్టాలని ప్లాన్ చేస్తారు నిషిక, వైజయంతి. మరోవైపు ఆదిలక్ష్మీ ఆటోలో కీర్తిని తీసుకుని వెళ్తుంది. సురేష్, ఆదిలక్ష్మీకి ఫోన్ చేస్తాడు. భయపడుతూ లిఫ్ట్ చేయదు.
కేదార్: అత్తయ్యకు సీమంతం జరగడం నచ్చలేదు సరే. కీర్తిని ఎందుకు తీసుకెళ్లింది.
ధాత్రి: నిషిక చెప్పింది నిజమే ఉంటుంది కేదార్. తన కూతురు తనకు దూరం అవ్వడానికి కారణం కౌషికి వదిన అనుకుంటుంది. అదే బాధ వదిన కూడా పడితే చూడాలని కీర్తిని తీసుకుని వెళ్తుంది.
సురేష్: ఊరుకో కౌషికి
కౌషికి: సురేష్ నాకెందుకో భయంగా ఉంది.
సురేష్: కీర్తి అంటే అమ్మకు ఎంత ఇష్టమో తనకు దూరంగా ఉన్న ఈ ఆరేళ్లు చూశాము కదా! కోపంలో ఇలా చేసింది కానీ కీర్తికి ఏ కీడు చేయదు.
నిషిక: ఆహా వదిన ఏడుపు.. ఆ జగధాత్రి ముఖంలో కంగారు అబ్బా ఇవి కదా అత్తయ్య మనకు ఆనందాన్ని ఇచ్చేది.
వైజయంతి: అయినా మనకు ఈ తలనొప్పులన్నీ ఆ కడుపు వల్లనే అమ్మీ.. ముందు ఆ కడుపు పోగొట్టాలా? అప్పుడే మనకు భవిష్యత్తు ఉంటాది.
అని మాట్లాడుకుంటూ అందరూ ఒక్కొక కారులో ఆదిలక్ష్మీ ని వెతుకుతుంటారు. ఇంతలో ధాత్రి ఆదిలక్ష్మీ పిన్ని కచ్చితంగా బస్టాండుకే వెళ్లి ఉంటుంది. మనం అక్కడికే వెళ్దాం పద అని ఇద్దరూ కలిసి బస్టాండు వైపు వెళ్తుంటారు. మరోవైపు ఆదిలక్ష్మీ వెళ్తున్న ఆటో ఆగిపోతుంది. అక్కడి నుంచి ఆదిలక్ష్మీ కీర్తిని తీసుకుని బస్టాడు వైపు పరుగెడుతుంది. వెనకాలే వచ్చిన కేదార్, ధాత్రి ఆటో డ్రైవర్ ను అడగ్గానే ఇటు వైపు వెళ్లారని చెప్తాడు. బైక్ అక్కడే వదిలి ధాత్రి, కేదార్ అటువైపు వెళ్తారు. ఆదిలక్ష్మీని చూసి కీర్తి ఎక్కడ అని అడగడంతో ఇవాల్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: పొరపాటున కూడా ఇప్పుడు ఉప్పు, బట్టలు లాంటి వస్తువులు కొనద్దట!