Jagadhatri Serial Today Episode: ధాత్రి, యువరాజ్ గురించి ఆలోచిస్తుంటారు. ఇన్ని ఆస్తులున్నా.. యువరాజ్, మీనన్‌తో ఎందుకు చేతులు కలిపాడని ఆలోచిస్తుంది. ఇంతలో కేదార్ చిన్న గిఫ్ట్ తీసుకుని వచ్చి నీకో చిన్న సర్‌ప్రైజ్ అంటాడు. గిప్ట్ చూసిన ధాత్రి నవ్వుతుంది. దీంతో మొత్తానికి నవ్వేశావు అంటూ.. ఈ అద్దం ఒకసారి పట్టుకో అంటు అద్దాన్ని ధాత్రికి ఇచ్చి అద్దం చూడకుండా ధాత్రిని రొమాంటిక్ గా చూస్తుంటాడు. దీంతో హలో మాస్టారు అద్దం ఇక్కడ ఉంది అంటుంది. అయినా కేదార్ రొమాంటిక్ గా చూస్తూనే ఉంటాడు. దీంతో నువ్వు మారవు అంటుంది ధాత్రి. ఇంతలో కేదార్ ధాత్రిని అద్దంలో చూస్తూ ముద్దు పెట్టబోతుంటే ధాత్రి అక్కడి నుంచి కిందకు పరుగెత్తుకుపోతుంది. ధాత్రి వెనకాలే కేదార్ పరుగెడతాడు. కింద అందరూ సీరియస్ గా ఆలోచిస్తూ ఉంటారు.
నిషిక: ఏమైందే...
ధాత్రి: ఏమైంది..? ఏం కాలేదే..
కేదార్: ఏం కాలేదనే బాధ.
సత్యప్రసాద్: ఇలా సడెన్ గా వచ్చినందుకు ఏమీ అనుకోవద్దమ్మా కౌషికి. ఇవాళ షాపింగ్ కు మంచి రోజు అంటే వచ్చేశాను.
కౌషికి: అయ్యో ఏం పర్వాలేదు అంకుల్. ఇంకా ఎవ్వరూ రెడీ అవ్వలేదు. ఒక అరగంటలో వెళ్దాం.
కాచి: అక్కా ఇవాళ ఏదో ఇంటర్వూ ఉందని చెప్పావు కదా?
కౌషికి: అది లంచ్ తర్వాత కాచి.
వైజయంతి: అయితే ఆ లోపు బట్టలు కొనుకున్ని వచ్చేదాం.
కౌషికి: అందరూ త్వరగా రెడీ అయి వచ్చేయండి.
నిషిక: వదిన షాపింగ్ కు మన ఫ్యామిలీ మాత్రమే కదా వెళ్తున్నాం.
కౌషికి: అవును నిషిక..
నిషిక: జగధాత్రి. విన్నావు కదా ఇంట్లో వాళ్లే నట నువ్వు మీ ఆయన ఇంట్లోనే ఉండి మాకు భోజనాలు ఏర్పాటు చేయండి.
కౌసికి: నిషికా.. ధాత్రి, కేదార్ లను మన ఫ్యామిలీ నుంచి వేరు చేసి మాట్లాడొద్దు అని గొడవ జరిగిన ప్రతిసారి నీకు చెప్తున్నాను.
వైజయంతి: అట్టా చెప్పిన ప్రతి తూరి మేము కూడా వాళ్లకు ఈ ఇంటికి ఏ సంబందం లేదని చెప్తూనే ఉన్నాం కదమ్మీ..
యువరాజ్: నీకు సంబంధించిన విషయాల్లో వాళ్లను కలుపుకో అక్కా.. కానీ ఇది మాధురి పెళ్లికి సంబంధించిన విషయం. వాళ్లు మనతో కలిసి రావడానికి కానీ కలిసి పోవడానికి కానీ వీల్లేదు.
మాధురి: ధాత్రి వదిన కేదార్ అన్నయ్యా ఈ ఇంటికి ఏమవుతారో నాకు తెలియదు కానీ నాకు మాత్రం చాలా కావాల్సిన వాళ్లు. నా శ్రేయోభిలాషులు. నా మంచి కోరే వారు. నాకోసం ఏమైనా చేసేవాళ్లు. వాళ్లు రాకుంటే నేను షాపింగ్ కు రాను.
అని మాధురి తెగేసి చెప్పగానే ధాత్రి వారిస్తుంది. దీంతో పర్వాలేదు వదిన మీరు నాకోసం ఎవరూ లేనప్పుడు నిలబడ్డారు అంటుంది. ఇంతలో కమలాకర్, నిషిక, మాధురిని వారిస్తారు. దీంతో అన్నయ్య, వదిన షాపింగ్ కు రాకుంటే నేను షాపింగ్ కు రాలేను అంటుంది. దీంతో కౌషికి అందరూ వెళ్లి రెడీ అవ్వండని చెప్తుంది. దీంతో ఎవరిమటుకు వాళ్లు వెళ్లిపోతారు. తర్వాత సూర్యకు వినబడేటట్టు మాధురి గురించి నిషిక ఎవరితోనో ఫోన్ లో బ్యాడ్ గా మాట్లాడుతుంది. దీంతో సూర్య అక్కడి నుంచి నేరుగా మాధురి రూంలోకి వెళ్లి మాధురిని బలవంతం చేస్తాడు. దీంతో మాధురి, సూర్యను కొడుతుంది. దీంతో కిందకు వచ్చిన సూర్య పెళ్లి వద్దంటాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. మోసం చేసి పెళ్లి చేయడం తప్పు కాదా? ఒక అబ్బాయి మీ చెల్లి వెంట తిరగడం నిజం కాదా? అంటూ సూర్య ప్రశ్నించగానే అందరూ మౌనంగా ఉండిపోతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ‘మేఘసందేశం’ సీరియల్: అపూర్వకు వార్నింగ్ ఇచ్చిన శోభ – చెర్రికి నిజం చెప్పిన భూమి