Brahmamudi Serial Today Episode:  అమ్మ చావు బతుకుల్లో ఉంటే.. దానికి కారణమైన మనిషిని వెనకేసుకొస్తూ.. మన బ్లడ్‌ రిలేషన్‌‌ నే అనుమానిస్తున్నావా? కళ్యాణ్‌ అంటూ రాజ్‌ ఎమోషనల్‌ గా ఫీలవుతాడు. ఎవరి కోసమో మన ఇద్దరి మధ్య ఆవేశాలు వద్దు కళ్యాణ్‌ నువ్వు ప్రశాంతంగా ఉండు అంటాడు రాజ్. నేను ప్రశాంతంగా ఉండాలంటే ముందు నువ్వు వెళ్లి వదినను ఇంటికి తీసుకురావాలని కళ్యాణ్‌ చెప్తాడు.


రాజ్: నేను ఎప్పటికీ అలా చేయను. తను తప్పు చేసిందని ఫీల్ అయింది కాబట్టే వెళ్లిపోయింది.


కళ్యాణ్‌: వదిన పారిపోలేదు అన్నయ్య. భర్తగా నువ్వు నిలబడాల్సిన విధంగా, నమ్మాల్సిన విధంగా నమ్మలేదు కాబట్టి మనసు విరిగిపోయి వెళ్లిపోయింది.


రాజ్‌: నేను వెళ్లమనలేదు. రమ్మనలేను. నేను ఏ తప్పు చేయలేదు. తీసుకొచ్చే ప్రసక్తే లేదు.


కళ్యాణ్‌: ఇంత బండరాయిలా ఎలా మారావ్ అన్నయ్య. ఏదో ఒక రోజు నిజం తెలుస్తుంది. అప్పుడే నీకు వదిన విలువ తెలుస్తుంది.


 అని కళ్యాణ్‌ వెల్లబోతుంటే ధాన్యలక్ష్మీ వచ్చిపరాయి ఇంటి ఆడదాన్ని బాగా అర్థం చేసుకున్నావు. కానీ ఈ కన్నతల్లిని ఎందుక అర్థం చేసుకోలేదు అని అడుగుతుంది. దీంతో కళ్యాణ్‌ కోపంగా ధాన్యలక్ష్మీని తిడుతూ వదిన ఇల్లు వదిలి వెళ్లిపోవడంలో నీ పాత్ర ఎంత ఉందని నిలదీసి వెళ్లిపోతాడు.  తర్వాత తాము  అనుకున్నది సక్సెస్ అయిందని రుద్రాణి, రాహుల్ సంతోషంగా డ్యాన్స్ చేస్తుంటారు.


రుద్రాణి: కల్యాణ్‌ను రాకుండా చేశాం.  కావ్యను కూడా పంపించాం.  మా వదిన ప్రాణాలు పోయేలా చేశాము.


రాహుల్‌: అత్తయ్య తిరిగి ప్రాణాలతో రాదు. దాంతో రాజ్ పిచ్చోడు అయిపోతాడు. అప్పుడు ఆస్తి గురించి పట్టించుకోడు. సో.. మనదే రాజ్యం.    


  ఇంతలో స్వప్న వస్తుంది. ఇద్దరూ డాన్స్‌ చేయడం చూసి తిడుతుంది. స్వప్నను చూసిన రాహుల్‌, రుద్రాణి తాము మాట్లాడుకుంది వినేసిందా? అని టెన్షన్‌ పడుతుంటారు. ఇంట్లో ఇంత పెద్ద గొడవ అయింది. అపర్ణ అత్త హాస్పిటల్‌లో ఉన్నారు. అవేం పెట్టించుకోకుండా తాగి చిందులేస్తున్నారా? మీరు మనుషులేనా అసలు అంటూ.. మా చెల్లి, అపర్ణ అత్త విషయంలో మీ హస్తం ఏమైనా ఉందా? ఉంటే మీకు చిత్తడే అంటూ వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతుంది స్వప్న. మరోవైపు కనకం, కృష్ణమూర్తి కావ్య గురించి మాట్లాడుకుంటూ బాధపడుతుంటారు. కనకం ఇందిరాదేవికి ఫోన్‌ చేస్తుంది.


కనకం: నమస్కారం అమ్మా..


ఇందిరాదేవి: కూతురు పుట్టింటికి వచ్చినా ఇంకా నమస్కారం చెబుతున్న నీ సంస్కారం నన్ను ఇంకా సిగ్గుపడేలా చేస్తుంది కనకం.


కనకం: తప్పు చేస్తే నిలదీసే పెద్దరికి మీకుంది. అలాగే నా కూతురు తప్పు చేయదన్న నమ్మకం నాకుంది. అసలు ఏం జరిగిందో తెలియక కంగారుపడుతున్నాం మేము.


ఇందిరాదేవి: మీరు కంగారు పడటానికి తప్పు చేసింది నీ కూతురు కాదు కనకం నా మనవడు.


కనకం: కానీ శిక్ష పడింది మాత్రం నా కూతురుకు. ఇప్పుడు నా కూతురు బతుకు ఏంటి?


ఇందిరాదేవి:  మా పెద్దరికాన్ని పక్కన పెట్టి ఎవరి నిర్ణయాన్ని వారే తీసుకున్నారు. నువ్వు అడిగే ఏ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. నన్ను క్షమించు కనకం.


 అంటూ ఇందిరాదేవి ఫోన్‌ కట్‌ చేస్తుంది. మరోవైపు కళ్యాణ్‌, అప్పు బాధపడుతుంటారు. వదిన వెళ్లిపోయినందుకు నాకు చాలా బాధగా ఉంది అంటూ ఏడుస్తుంటాడు. వాళ్లిద్దరూ ఎప్పటికీ దూరంగా ఉండాల్సిందేనా అంటూ బాధపడతాడు. తర్వాత ఇందిరాదేవి రాజ్‌ దగ్గరకు వెళ్లి తిడుతుంది. మీ పంతాలకు పోయి మా మనసులు కష్టపెడుతున్నారు అంటూ నువ్వు ఎన్ని పొరపాట్లు చేసినా ఆ పిచ్చిది నిన్ను భరించింది కానీ తెలియకుండా అది ఒక్క పొరపాటు చేసిందని ఇంట్లోంచి వెళ్లిపోతుంటే ఆపకుండా ఉండిపోయావు అంటూ బుద్ది చెప్తుంది. తర్వాత అపర్ణ కళ్లు తెరిచి కావ్యను అడగడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: ‘మేఘసందేశం’ సీరియల్‌: అపూర్వకు వార్నింగ్ ఇచ్చిన శోభ – చెర్రికి నిజం చెప్పిన భూమి