Jagadhatri  Serial Today Episode:  యువరాజ్‌ను కొట్టి.. ఆయన కేదారే నా కొడుకు అని చెప్పేదాకా తీసుకొచ్చారంటే హాస్పిటల్‌ లో మీరేం చేశారో నాకు తెలియదు అనుకోవద్దు. మీరేం చేసినా ఆ కేదార్‌ కంటే ముందే చేయాల్సింది అంటుంది. నిషికను కూడా తిడుతూ నువ్వు ఆ ధాత్రిని చూసి నేర్చుకో అంటూ వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతుంది. మరోవైపు ఆఫీసులో కేదార్‌, ధాత్రిలను డీజీపీ వచ్చి అభినందిస్తాడు. వాళ్లిద్దరికీ మెడల్స్‌ ఇస్తాడు. అంతా గమనిస్తున్న త్రిపాఠి ఈర్ష్య పడుతుంటాడు.


ధాత్రి: మీనన్‌ను ఎదురుకునే ప్రయత్నంలో అభిమన్యు, కదీర్‌ ల పాత్ర కూడా చాలా ఉంది సార్‌. ఒకరకంగా చెప్పాలంటే వాళ్లు లేకుంటే మేము ఈ ఆపరేషన్‌ ను ఇంత విజయవంతంగా సాధించలేకపోయేవాళ్లం. ఆ ఆపరేషన్‌లో కదీర్‌ కూడా గాయపడ్డాడు.


డీజీపీ: అభిమన్యు, కదీర్‌ లతో పాటు సాధును కూడా అప్రిసియేట్‌ చేయాలి.  ఏమోషన్‌ కు తలవంచకుండా డ్యూటీనే ప్రాణంగా భావించి ఆపరేషన్‌ కు రెడీ అయ్యాడు. హాట్సాప్ సాదు.


సాధు: థాంక్యూ సార్‌..


డీజీపీ: గాయపడిని కదీర్‌ కుంటుంబాన్ని.. కదీర్‌ ను మన డిపార్ట్‌ మెంట్‌ ఆదుకుంటుంది.


ధాత్రి: థాంక్యూ సార్‌..


డీజీపీ: ఇక మిగిలింది ఆ మీనన్‌. వాణ్ని కూడా ముగించేస్తే మన రాష్ట్రానికి పట్టిన పీడ విరగడై పోతుంది.


సాధు: తొందరలోనే వాడి కథ కూడా ముగించేస్తాం సార్‌.


అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు. తమ చాంబర్‌ లోకి వెళ్లిన సాధు కూడా ధాత్రి, కేదార్‌ లను అభినందిస్తాడు. ఇంతలో త్రిపాఠి అక్కడకు వచ్చి ఏంటి సార్‌ వాళ్లు చేసింది.. ఆ మాత్రం మేము చేయలేమా..? అంటూ ప్రగల్బాలు పలుకుతాడు. దీంతో సాధు.. త్రిపాఠీని తిడతాడు. తర్వాత డ్రైవర్‌ గురించి ఇన్ఫర్మేషన్‌ ఇస్తాడు సాధు. మరోవైపు మీనన్‌, త్రిపాఠీకి ఫోన్‌ చేసి జేడీ డీటెయిల్స్‌ కావాలని అడుగుతాడు. ఇస్తానని చెప్తాడు త్రిపాఠీ.  ఎవ్వరికీ తెలియకుండా త్రిపాఠీ వెళ్లి దాత్రి వాళ్ల కారు డిక్కీలో దాక్కుంటాడు. ధాత్రి, కేదార్‌ వచ్చి కారులో వెళ్తుంటారు. రోడ్డు బ్లాక్‌ అయ్యుంటుంది.


ధాత్రి: రోడ్డు బ్లాక్‌ అయినట్టు ఉంది.


త్రిపాఠి: ఇంటికి వచ్చినట్టు ఉంది.


కేదార్‌: కారు ఇక్కడే ఆపి దిగి నడుచుకుంటూ వెళ్దాం.


ధాత్రి: ఈరోజు ఎలాగైనా నిజం తెలుసుకోవాలి.


అని వెళ్లిపోతారు. వాళ్లు వెళ్లిపోయాక డిక్కీలోంచి దిగిన త్రిపాఠీ కారు ఆగి ఉన్న ఇంటి ఫోటో తీసి మీనన్‌కు పెడతాడు. ప్రస్తుతానికి జేడీ ఇంటి అడ్రస్‌ పట్టుకున్నాను అని మీనన్‌ కు ఫోన్‌ చేస్తాడు.


మీనన్‌: తెలిసిందా? ఏమైనా త్రిపాఠీ..


త్రిపాఠీ: ప్రస్తుతానికి జేడీ ఇంటి అడ్రస్‌ కనుక్కున్నాను. ఆ ఇంటి లోకేషన్‌ మీకు షేర్‌ చేశాను. ఆ ఇంటి అడ్రస్‌, ఫోటోస్‌  కూడా మీకు పంపించాను.


మీనన్‌: సూపర్‌ త్రిపాఠీ నా మీద నీకున్న అభిమానానికి చాలా థాంక్స్‌.  


త్రిపాఠీ: ఇది నీ మీద నాకున్న అభిమానం కాదు. ఆ జేడీ మీద నాకున్న పగ.


మీనన్‌: ఆ జేడీతో పాటు ఇంకొకడు ఉంటాడు కదా? వాడి గురించి ఏదైనా తెలిసిదా?


  లేదని త్రిపాఠీ చెప్పగానే పర్వాలేదు ముందు ఆ జేడీని చంపేస్తాను తర్వాత ఆ కేడీ గాని పనిపడతా.. అంటాడు. తర్వాత ఆ మీనన్‌ గాడు జేడీని చంపేస్తే ఆ ప్లేస్‌ లోకి నేను వెళ్తాను అనుకుంటూ  అక్కడి నుంచి వెళ్లిపోతాడు త్రిపాఠీ. మరోవైపు డ్రైవర్‌ ఇంటికి వెళ్లిన ధాత్రి, కేదార్‌ లు కోపంగా గన్‌ తీసుకుని భయపెడుతూ నిజం చెప్పమని అడుగుతారు. దీంతో డ్రైవర్‌ ధాత్రి, కేదార్‌ లను తోసేసి పారిపోతుంటాడు. కొద్ది దూరం పరిగెత్తగానే కారులో ఎవరో వచ్చి ఆ డ్రైవర్ గొంతు కోసి వెళ్లిపోతారు. వెనకే వచ్చిన  ధాత్రి, కేదార్‌.. అతన్ని  హాస్పిటల్ కు తీసుకెళ్తారు. ఇంతలో  ఇవాల్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!