Jagadhatri  Serial Today Episode:  ధాత్రి వాళ్లు ఎంత వెతికినా ఆరాధ్య అచూకీ లభించదు. అభి బయట కార్లన్నీ చెక్‌ చేసి ఎక్కడ లేదని డిసప్పాయింట్‌ అవుతాడు. మరోవైపు సీక్రెట్‌ గా కలుసుకున్న ధాత్రి, కేదార్‌ టెర్రస్‌ మీద ఉన్న రూం చెక్‌ చేశావా అని దాత్రి అడుగుతుంది. లేదని కేదార్‌ చెప్పడంతో ఇద్దరు కలిసి టెర్రస్‌ మీదకు వెళ్లబోతుంటే ఒక రౌడీ వెళ్లి ఆపి పైన ఎవ్వరూ లేరు మీరు వెళ్లండి అని కోపంగా గన్‌ తీసి బెదిరిస్తూ.. వెళ్లగొడతాడు. రూంలోకి వెళ్లిన ధాత్రి, కేదార్‌ ఇద్దరూ ఆరాధ్య పైనే ఉందనకుంటారు.

కేదార్:  కన్‌ఫం ఆరాధ్య పైనే ఉంది జేడీ. అందుకే వాడు మనల్ని పైకి వెళ్లనివ్వలేదు.

ధాత్రి: అవును కేడీ..

కేదార్‌: మనం వాడిని ఈజీగా హ్యాండిల్‌ చేయోచ్చు వెళ్దాం పద.

ధాత్రి: వద్దు కేడీ పైన ఉంది ఆరాధ్య అని మనం ముందు కన్‌ఫం చేసుకోవాలి. ఆ తర్వాతనే మనం యాక్షన్‌ తీసుకోవాలి. మన అంచనా తప్పైతే ఆరాధ్యను వాళ్లు దాచేస్తారు.

అభి: మేడం తెలిసి గ్యాంగ్‌ లో అందరిని ఆరాధ్య గురించి  అడిగాను. ఎవరికీ తెలియదు అంటున్నారు.

ధాత్రి: టెర్రస్‌ పైన ఉన్న రూంలో ఉందేమోనని డౌట్‌గా ఉంది.

అభి: అయితే ఇప్పడు ఏం చేద్దాం మేడం.

ధాత్రి: ముందు పైన ఉన్నది ఆరాధ్యనేనా అని విజువల్‌ గా చూసి కన్‌ఫం చేసుకోవాలి.

అభి: అయితే నేను వెళ్తాను మేడం.

కేదార్‌: నువ్వు కానీ దొరికితే వాళ్లకు నీ మీద అనుమానం వస్తుంది అభి. అదే జరిగితే మీనన్‌ నిన్ను ప్రాణాలతో వదలడు.

ధాత్రి: అవును అభి.. ఇప్పడు నిన్ను కూడా రిస్క్‌ లో పడేయలేం.

  కేదార్‌, కిరణ్‌లను పైకి పంపిస్తుంది. కదీర్‌ను మీనన్‌ వాళ్లును గమనిస్తుండు అని తాను రమ్య పెళ్లికూతురు వాళ్లకు జ్యూస్‌ ఇద్దామని చెప్తుంది. అలాగేనని అందరూ వెళ్లిపోతారు. కేదార్‌, కిరణ్‌, అభిలు పైకి వెళ్తుంటే టోనీ గమనిస్తాడు. దేవాను పిలిచి వాళ్లను ఫాలో అవ్వు అనుమానం వస్తే కాల్చిపడేయ్‌ అంటాడు. సరేనని దేవా వెళ్తాడు.  

అభి: ఇక్కడ ఇంత మంది ఉన్నారేంటి?

కేదార్‌: ఆరాద్య ఇక్కడే ఉంది. వాళ్ల అంతు చూద్దాం.

అభి: ఆగండి వాళ్లను దాటుకుని వెళ్లడం అంత ఈజీ కాదు.

కేదార్‌: మరి ఎలా..?

అభి: బ్యాక్‌ నుంచి పైకి వెళ్లటానికి ఒక రూట్‌ ఉంది.

కేదార్‌: సరే నేను పైకి వెళ్తాను. మీరు నాకు బ్యాకప్‌ ఇవ్వండి. అభి ఎటు వెళ్లాలి.

అభి: అటు..

దేవా: రేయ్‌ ఇక్కడికి ఎవరైనా క్యాటరింగ్‌ వాళ్లు వచ్చారా?

రౌడీలు: రాలేదు భాయ్‌. మూడో వాడు ఏడీ.. వీళ్లు ఎటు వెళ్లారు.

అని కేదార్‌ వాళ్లను వెతుక్కుంటూ వెళ్తాడు దేవా..?

అభి: దేవా మనల్ని వెతుకుతూ వచ్చాడు అంటే భాయ్‌ కి డౌట్‌ వచ్చిందని అర్థం. నేను నువ్వు మేడంకు చెప్పు నేను కదీర్‌ను కలుస్తాను

 అని అభి వెళ్లిపోతాడు. మరోవైపు కేదార్‌.. పైకి వెళ్తాడు. ఆరాధ్య ఉన్న రూం డోర్‌ ఓపెన్‌ చేసి లోపలికి వెళ్తాడు. మరోవైపు పైకి వచ్చిన ధాత్రి రౌడీలను చూసి ఆగిపోతుంది. రూంలోకి వెళ్లిన కేదార్‌ ఆరాధ్యన పలకరిస్తాడు. అక్కడ కాపలాగా ఉన్న రౌడీ కేదార్‌ను కొడతాడు. దీంతో ఇద్దరి మధ్య ఫైట్‌ జరుగుతుంది.  దీంతో ఇవాల్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ:  ‘బ్రహ్మముడి’ సీరియల్‌:   కావ్యను ఒప్పించిన రాజ్‌ – నిజం తెలుసుకున్న రుద్రాణి