Jagadhatri  Serial Today Episode: తనను ఇంట్లోంచి బయటకు వెళ్లమంటారా? అంటూ అందరూ కోప్పడుతుంది నిషిక. ఈ ఇంట్లో మనం పరాయివాళ్లం అయిపోతున్నామని ఏదో ఒకటి చేసి మనం చేతుల్లోకి తీసుకోకపోతే మనం భవిష్యత్తు ఉండదు అని ప్లాన్‌ చేస్తుంటారు వైజయంతి, యువరాజ్‌, నిషిక, కమలాకర్‌లు. మరోవైపు ధాత్రి, కేదార్‌ గార్డెన్‌ లో కూర్చుని నిషిక వాళ్ల గురించి మాట్లాడుకుంటారు. నిషిక అపాయింట్‌మెంట్‌ ను క్యాన్సిల్‌ చేశారంట అని చెప్తుంది ధాత్రి. ఇంతలో సాధు ఫోన్‌ చేసి మీనన్‌ మనుషులు రెడీగా ఉన్నారని వాళ్లను తీసుకెళ్లవచ్చని చెప్తాడు.


ధాత్రి: సార్‌ మీనన్‌ ఎక్స్‌చేంజ్‌ చేసుకుందామని చెప్పిన ప్లేస్‌ దగ్గరలోనే వాడి తమ్ముడి పెళ్లి జరుగుతున్నట్టు మాకు ఇన్మర్మేషన్‌ వచ్చింది సార్‌. కన్మర్మేషన్‌ కోసం మేము అభితో కూడా మాట్లాడాము. తను కూడా కన్‌ఫం చేశాడు సార్‌.


సాధు: అయితే.. ఏంటి..?


ధాత్రి: మీరు మాకు రెండు గంటలు టైం ఇస్తే నేను మా టీంతో వెళ్లి మీనన్‌ను పట్టుకుని అలాగే ఆరాద్యను కూడా సేవ్‌ చేస్తాం సార్‌.


కేదార్‌: ప్లానింగ్‌ తోనే వెళ్తాం సార్‌ మీనన్‌కు అనుమానం వచ్చేలోపు మీనన్‌ మన కస్టడీలో ఉంటాడు. ఆరాద్య మీ ఇంట్లో ఉంటుంది. సార్‌.


ధాత్రి: సార్‌ మాకు ఎక్కడ ప్లాన్‌ ఫెయిల్‌ అవుతుందన్న అనుమానం వచ్చినా.. వెంటనే మేము మిషన్‌ ను అబార్ట్‌ చేస్తాం సార్‌.


సాదు: ఓకే.. అప్పటి వరకు మీనన్‌ ను నేను డైవర్ట్‌ చేస్తాను. మీరు మాత్రం జాగ్రత్త.


ధాత్రి: కేదార్‌.. మీనన్‌ మనల్ని చాలా మిస్‌ అవుతుంటాడు. వెళ్లి హాయ్‌ చెప్పి వద్దాం.


కేదార్‌: అక్క ఒక్కతే ఉంటుంది కదా? మనం లేనప్పుడు నిషిక వాళ్లు అక్క ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే..


ధాత్రి: దానికి నేను ఒక ప్లాన్‌ చేశాను


 అని చెప్తుంది. కేదార్‌ ఏం చేశావు అని అడుగుతాడు. చూస్తావుగా అంటుంది ధాత్రి. మరోవైపు మీనన్‌ కు ఫోన్‌ చేసిన సాధు ఇంకో మూడు గంటలు ఇవ్వమని అడుగుతాడు. మీనన్‌ సరే అంటాడు. తర్వాత టోనీతో మాట్లాడతుంటాడు మీనన్‌. ఇంతలో దేవా వస్తాడు.


దేవా: జేడీ ఆఫీసులో లేదంటా భాయ్. పొద్దటి నుంచి ఆఫీసుకు కూడా రాలేదంట భాయ్‌.


మీనన్‌: అయితే కన్‌ఫం గా జేడీ ఇక్కడకు వస్తుంది. దేవా సెక్యూరిటీని టైట్‌ చేయండి. అందరినీ ఒకటికి రెండు సార్లు చెక్‌ చేసి పంపండి. రా జేడీ నీ కోసమే ఎదరుచూస్తూ ఉంటాను.


అభి: వీళ్లల్లో భయం మొదలై పోయింది అంటే సీన్‌ లోకి జేడీ మేడం ఎంటర్‌ అయిపోయి ఉంటుంది.


 మరోవైపు మీనన్‌ మనుషులు వెహికిల్స్‌ చెక్‌ చేస్తుంటారు. ధాత్రి, కేదార్‌లు సిక్కుల వేషం వేసుకుని అక్కడికి వెళ్తారు. మీనన్‌ మనుషులు అడ్డగిస్తే మేము క్యాటరింగ్‌ వాళ్లమని చెప్తారు.


రౌడీ: ఎప్పుడో రావాల్సిన వాళ్లు ఇప్పుడా వచ్చేది. అందరూ లైన్‌ లో నిలబడండి చెక్‌ చేయాలి.


ధాత్రి: అన్నా ఇప్పటికే మాకు చాలా లేట్ అయిపోయింది. లోపలికి ఒకసారి వెళ్లి కనిపించి వస్తాము. తర్వాత మీరు చెప్పినంత సేపు ఉంటాము.


రౌడీ: లోపలికి వెళ్లడానికే చెక్‌ చేస్తున్నాము. మీలో కృష్ణ ఎవరు?


కేదార్: నేనే అన్నా..


రౌడీ: వాయిస్‌ అలా లేదే.. ఒకసారి నీకు ఫోన్‌ చేస్తాను లిఫ్ట్‌ చేయ్‌.


అని రౌడీ ఫోన్‌ చేస్తాడు. రింగ్‌ సౌండ్‌ కాదు. దీంతో రౌడీ అనుమానంగా వీళ్లను చూస్తుండండిరా అంటూ మిగతా రౌడీలకు చెప్పి నేను భాయ్‌ ని తీసుకొస్తాను అని లోపలికి వెళ్తుంటే కేదార్‌ జేబులోంచి ఫోన్‌ తీసి కాల్‌ వచ్చిందన్నా ఫోన్‌ సైలెంట్‌ లో ఉన్నది అని చూపిస్తాడు. రౌడీ అవును నిజమే అని కారు చెక్‌ చేసి పంపిస్తారు. తర్వాత లోపల మీనన్‌, టోనీ బంధువులతో మాట్లాడుతుంటారు. దీంతో ఇవాల్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కలిసిపోయిన రాజ్‌, కావ్య – తట్టుకోలేకపోయిన రుద్రాణి