Meghasandesam Serial Today Episode: భూమికి నిజం చెప్పిన ప్రసాద్, శారద దగ్గరకు వచ్చి ఇన్నేళ్లలో నేను నీకు ఏమీ ఇవ్వలేకపోయాను కానీ ఒకటి అడుగుదామని వచ్చాను అంటాడు. అడిగే అవసరం మీకున్నా.. ఇచ్చే అధికారం నాకు ఉండాలి కదా? అంటుంది శారద. కానీ ఆ ఇంట్లో అందరూ ఆనందంగా ఉన్నారు. అని చెప్తుంటే నన్నేదో అడుగుతా అన్నారు అని అడుగుతుంది శారద. నువ్వు అక్కడికి వచ్చి ఇందును ఆశీర్వదిస్తావా? అని అడుగుతాడు. నేను అక్కడికి రాలేనని.. శారద చెప్పగానే ఇందునే గుడి దగ్గరకు తీసుకొస్తానని చెప్పి ప్రసాద్ వెళ్లిపోతాడు. ఇందును తీసుకుని గుడికి వెళ్తాడు ప్రసాద్.
ఇందు: అత్తయ్యవాళ్లు ఎక్కడున్నారు..
ప్రసాద్: వాళ్లు వస్తారు కానీ నువ్వు లోపలికి పద..
మీరా, ఇందుకు ఫోన్ చేస్తుంది. ఎక్కడున్నారు అని అడుగుతుంది. మేము నరసింహస్వామి గుడిలో ఉన్నామని ఇందు చెప్తుంది. మేము శివాలయంలో ఉన్నాము. మమ్మల్ని ఈ గుడికి రమ్మని మీరు ఆ గుడికి వెళ్లారా అని మీరా అడుగుతుంది. ఏమో నాన్నను అడిగి చెప్తాను ఉండు అని ఫోన్ కట్ చేస్తుంది మీరా.
అపూర్వ: ఏమైందంటా..?
మీరా: మనల్ని శివాలయానికి రమ్మని వాళ్లు పొరపాటున నరసింహ్మ స్వామి ఆలయానికి వెళ్లారట వదిన.
అపూర్వ: అదేంటి ఏ గుడో కూడా మర్చిపోతారా?
మీరా: ఇందు పెళ్లి హడావిడిలో పడి ఆయన మరచిపోయినట్టు ఉన్నారు వదిన.
అపూర్వ: సరేలే పెళ్లికూతురును తీసుకుని అందరం ఒకే గుడికి రావాలి కదా? వాళ్లో గుడికి మనమో గుడికి వెళ్తే ఏం బాగుంటుంది. పద మనం కూడా అక్కడికే వెళ్దాం.
అపూర్వ, మీరా నరసింహ్మస్వామి ఆలయానికి వెళ్తారు. చాలా పవర్ ఫుల్ దేవుడమ్మా సాష్టాంగ నమస్కారం చేసుకో అని ప్రసాద్ చెప్పగానే ఇందు పడుకుని మొక్కుతుంది. ఇంతలో శారద వచ్చి ఇందును ఆశీర్వదిస్తుంది. ఇంతలో లోపలికి వచ్చిన మీరా, అపూర్వ చూస్తారు.
అపూర్వ: ఏంటిది కృష్ణ ప్రసాద్ మమ్మల్ని ఆ గుడికి పంపి నువ్వు ఈ గుడిలో చేస్తున్న పని ఇదా? గుడి మార్చావు అన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది.
మీరా: ఏంటండి ఇది ఏంటి.. ఈ పని
ప్రసాద్: మీరా ఇప్పుడేం తప్పు జరిగిందని అరుస్తున్నావు. ఇందు పెళ్లి కుదిరింది. శారద మనసు మంచిది. తను ఆశీర్వదిస్తే అంతా మంచే జరుగుతుందని తనను ఇక్కడికి తీసుకొచ్చాను.
మీరా: అంటే ఏంటి మీ ఉద్దేశం మా అందరి మనసులు మంచివి కాదా? దాని మనసే మంచిదా?
ప్రసాద్: నా మనసుకు అనిపించింది నేను చేశాను. అందులో తప్పేంటి..?
అని ప్రసాద్ అనగానే అపూర్వ తిడుతుంది. మేమంతా ఉన్నా నీకు ఆవిడ గారిని కలవాలని ఇలా ప్లాన్ చేశావా? అంటూ నిలదీస్తుంది అపూర్వ. కూతురు పెళ్లి పెట్టుకుని దీని దగ్గరకు రావాల్సిన అవసరం ఏముంది. రేపు పెళ్లిలో నీకు ఇద్దరు పెళ్లాలు అని చెప్పుకుంటారా? అని మీరా అడుగుతుంది. అపూర్వ, మీరా కలిసి శారద ఇష్టమొచ్చినట్టు తిడతారు. దీనిలాగే ఇందుకు భర్త దూరం కావాలని ఆశీర్వదిస్తుందా? అంటారు. విధవకు శారదకు పెద్ద తేడా ఏముంది అంటారు. శారదను లాక్కెట్టి గుండు కొట్టించాలనుకుంటుంది అపూర్వ దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: మనుకు వార్నింగ్ ఇచ్చిన భాగీ – ఆరును హెచ్చరించిన గుప్త