Brahmamudi Serial Today Episode:  కనకం ఇంటికి వచ్చిన కళ్యాణ్‌, అప్పును ధాన్యలక్ష్మీ ఏవేవో మాటలు మాట్లాడుతుంటే కళ్యాణ్‌ వ్విలాగే మాట్లాడితే ఇక్కడి నుంచి కూడా నేను వెళ్లిపోతానని చెప్పడం ధాన్యలక్ష్మీ షాక్‌ అవుతుంది. కామ్‌గా వెళ్లిపోతుంది. మరోవైపు రాజ్‌ కంగారుగా ఆఫీసకు వెళ్తాడు. శరత్‌ దగ్గరకు వెళ్లి..

రాజ్‌: చెప్పు ఏం జరిగింది.

శరత్‌: ఏం చెప్పాలి సార్‌

రాజ్‌: అదేంటయ్యా.. నువ్వే కదా నాకు ఫోన్ చేసి అర్జెంట్‌గా రండి సార్‌ ఎక్సెస్‌ గోల్డ్‌ మన కంపెనీలో ఉందని చెప్పావు.

శరత్‌: మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు సార్‌.

రాజ్‌: ఏయ్‌ పిచ్చా నీకేమైనా ఇందాకా నువ్వే కదా ఫోన్‌ చేశావు.

శరత్‌: నేను ఫోన్‌ చేయడం ఏటి సార్‌ ఈరోజు ఇంపార్టెంట్‌ వర్క్‌ ఉంది. ఆఫీసుకు రానని చెప్తే మీ అపాయింట్‌ మెంట్స్‌ అన్ని చేంజ్ చేస్తున్నాను

అనగానే రాజ్‌ నెంబర్‌ తీసి ఈ నెంబర్‌ నుంచే కదా నాకు ఫోన్‌ చేశావు అంటే నేనే ఫోన్‌ చేయలేదు. మీకెవరో రాంగ్‌ కాల్ చేసి ఉంటారు అంటాడు. ఇంతలో శృతి వస్తే గోల్డ్‌ గురించి అడుగుతాడు. ఎటువంటి ప్రాబ్లమ్‌ లేదని చెప్తుంది శృతి. మరోవైపు ఇంట్లోకి వెళ్లిన అప్పు, కనకాన్ని తిడుతుంది. అందరూ సమస్యల్లో ఉంటే పెళ్లిరోజు ఇంత గ్రాండ్‌ గా జరుపుకోవడం అవసరమా? అని నిలదీస్తుది. ఇదంతా మీ బావే చేస్తున్నాడని చెప్తుంది. మరోవైపు అపర్ణ, ఇందిరాదేవి మాట్లాడుకుంటుంటే చాటు నుంచి రుద్రాణి వింటుంది. రాహుల్‌ వస్తాడు.

రాహుల్‌: ఎందుకు మామ్‌ ఇంత టెన్షన్‌ పడుతున్నావు.

రుద్రాణి: టెన్షన్‌ కాక ఇంకేంటి రాజ్‌ ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారే తెలియదు. ఏం చెప్పి ఒప్పించారో తెలియడం లేదు. మీ అత్తయ్యా.. అమ్మమ్మను చూస్తేంటే ఏదే సీక్రెట్‌ మాట్లాడుకుంటున్నారు.

రాహుల్‌: ఇందులో సీక్రెట్‌ ఏముంటుంది. రాజ్‌ ను కావ్యను కలపడానికి  ఇదంతా చేస్తుంటారు.

అని ఇద్దరూ మాట్లాడుకుంటారు. కావ్య మీద అంత కోపం ఉన్నోడు కనకం ఏదో చేసింది అందుకే రాజ్‌ వచ్చాడు అంటుంది రుద్రాణి. నువ్వు స్వప్నవైపు నుంచి నరుక్కురా..? అని రాహుల్‌ కు చెప్తుంది రుద్రాణి. తర్వాత రాజ్‌ డల్లుగా ఇంటికి వస్తుంటే అపర్ణ, ఇందిరాదేవి చూస్తారు.

ఇందిరాదేవి: వెళ్లిన పని ఏమైంది నాన్నా..

రాజ్‌: ఏం లేదు నాన్నమ్మా..

అపర్ణ: రాజ్‌ అసలు మేనేజర్‌ నీకు ఫోనే చేయలేదనుకుంటా?

రాజ్‌: నీకెలా తెలుసు మమ్మీ..

అపర్ణ: ఆ ఫోన్‌ చేయించింది నేనే కాబట్టి.

రాజ్‌: ఏంటి…?

 అపర్ణ: మీ ఆఫీసు నుంచి నీకు ఫోన్‌ వస్తే నువ్వు ఎవ్వరికీ చెప్పకుండా హడావిడిగా ఎలా వెళ్లిపోయావో.. ఆరోజు కావ్య కూడా అలాగే వెళ్లిపోయింది. కానీ నా అనుమతి తీసుకుని వెళ్లింది. ఆరోజు నా ఆరోగ్యం బాగా లేదని కావ్య ఆగలేకపోయింది. ఈరోజు కనకం ఆరోగ్యం బాగాలేదని నీకు తెలుసు కానీ మన కంపెనీలో తప్పు జరిగిపోతుందని తెలియగానే ముందు వెనక ఆలోచించకుండా వెళ్లిపోయావు ఎందుకు బాధ్యత. నీకు ఉన్న నిబద్దతే కావ్యకు ఉండకూడదా? చెప్పరా..? అంతా మనదే అనుకుని కావ్య వెళితే భయంకరమైన నేరంగా చూశావు కదా?

ఇందిరాదేవి: కావ్య అదే మాట చెబితే ఎన్ని మాటలన్నావురా? ఇప్పుడు ఆ మాటలు వెనక్కి తీసుకోగలవా? మేనేజర్‌తో మేం చేయించినట్టే కావ్యకు ఎవరో ఫోన్‌ చేయించి ఉండొచ్చు కదా?

   అంటూ అత్తాకోడళ్లు ఇద్దరూ రాజ్‌కు క్లాస్‌ తీసుకుంటారు. కావ్య గురించి చెప్తూ ఎమోషన్‌ అవుతారు. రాజ్‌ పలకకుండా చూస్తుండిపోతాడు. తిరిగి దూరంగా పూలు కడుతున్న కావ్యను చూస్తూ గతం గుర్తుచేసుకుంటాడు. వెంటనే వెళ్లి కావ్యను ఎత్తుకుంటాడు. అందరూ హ్యాపీగా ఫీలవుతారు. రుద్రాణి చూసి షాక్‌ అవుతుంది.

కావ్య: దింపండి..

రాజ్‌: మధ్యలో దింపడానికి కాదు ఎత్తుకుంది.

కావ్య: మధ్యలో పెళ్లాన్ని వదిలేయడం మాత్రం తెలుసా..?

రాజ్‌: నేనేం నిన్ను వదిలేయలేదు. నువ్వే అలిగి వచ్చేశావు.

కావ్య: అలిగి కాదు మనసు విరిగి వచ్చేశాను.

రాజ్‌: మరి వదిలేశానంటావేంటి? తొందరగా కట్టు బరువు మోయలేకపోతున్నాను. పుట్టింటి పుడ్డు బాగా తిని.. ఎందుకులే నేనంటే మళ్లీ ఫీలవుతావు.

కావ్య: అబ్బా మీకు పెళ్లాం ఫీలవుతుందని గొంతులో ఫిల్టర్‌ వేసుకోవడం కూడా తెలుసా?

రాజ్‌: అవతల మీ అమ్మగారు చూస్తున్నారా?

కావ్య: ఆ చూస్తుంది..

రాజ్‌: కళ్లల్లో నుంచి ఆనందబాష్పాలు రాలుతున్నాయా..?

కావ్య: అవును మహానటికి జారినట్టు రెండు చుక్కలు జారాయి.

రాజ్: ఆ రెండు చుక్కల కైనా నేను నీ బరువును బరిస్తానులే. నువ్వు దండ కట్టు

కావ్య: నేను ఒకరి కోసం నటించను.

రాజ్‌: నేను మాత్రం నటించడం లేదు. జీవిస్తున్నాను అల్లుడులాగా.. మొగుడులాగా..

అని రాజ్‌ చెప్పగానే కావ్య చేతిలోని పూలమాల జారి ఇద్దరి మెడలో పడుతుంది. ఇంతల రుద్రాణి దగ్గినట్లు సౌండ్‌ చేయగానే ఇద్దరూ పక్కకు జరుగుతారు. మొత్తానికి ఏదో జరుగుతున్నట్లు ఉంది అని రుద్రాణి అనుకుంటుంది. తర్వాత మూర్తి, కనకం రెడీ అయివచ్చి దండలు మార్చుకుంటారు. అందరూ హ్యాపీగా ఉంటారు. రుద్రాణి, ధాన్యలక్ష్మీ మాత్రం కుళ్లుగా చూస్తుంటారు.  దీంతో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌: నిజం తెలుసుకున్న అభయ్‌ – ఓకేసారి గతజన్మ గుర్తుచేసుకున్న గౌరి, శంకర్‌