Prema Entha Madhuram  Serial Today Episode: జెండే గన్‌ తీసి పాండును బెదిరిస్తూ మీ వెనక ఉన్నది ఎవరు అని అడుగుతాడు. దీంతో పాండు భయంతో వణికిపోతూ.. ఎవరూ లేరని చెప్తాడు. దేవుడి మీద ఓట్టని అంటాడు. దీంతో నీ వెనక ఎవరూ లేకపోతే సరి.. కానీ ఎవడైనా ఉంటే వాడికి చెప్పు ఈ కేశవ జెండే నుంచి తప్పించుకోడని.. వార్నింగ్‌ ఇవ్వడంతో పాండు అక్కడి నుంచి పారిపోతాడు. మరోవైపు పెళ్లి ఆగిపోయిందని అకి, అభయ్‌కి చెప్తుంది.


అభయ్‌: ఏంటి ఆ పెళ్లి కొడుకు ప్రాడ్‌ అని పెళ్లి ఆగిపోయిందా?  


అకి: అవును అన్నయ్యా గౌరిగారు చాలా లక్కీ.. అయినా నాన్న ఉండగా అది జరగదు అనుకో..


అందరూ షాక్‌ అవుతారు.


అభయ్‌: నాన్నా ఏంటి అకి


అకి: అంటే గౌరిగారికి అమ్మా నాన్నా ఉంటే అలా జరగదు అని నా ఉద్దేశం. అయినా అలా ఎలా మోసపోయారు. పెళ్లి అయితే అన్ని ముందుగానే వెరిపై చేసుకోవాలి కదా?


జెండే: మనుషులు అన్నాక పొరపాట్లు చేస్తూనే ఉంటారు అభయ్‌. కొన్ని సార్లు ఎమోషనల్‌ మూమెంట్‌ లో బ్లైండ్‌ గా డిసీషన్‌ తీసుకుంటారు. నమ్మేవాళ్లు ఉంటేనే కదా? మోసం చేసే వాళ్లకు ఈజీ అవుతుంది.


అభయ్‌: అది సరే పర్టికులర్‌ గా గౌరిగారినే టార్గె్ట్‌ ఎందుకు చేశారు. వాళ్లకు పెద్దగా ఆస్థులేం లేవు కదా?


జెండే: ఆ విషయం రాకేషే చెప్పాలి. మనకు దగ్గరయిన వాళ్లను మనకు సొంతమైన వాళ్లనే కదా మన శత్రువు టార్గెట్‌ చేస్తాడు. ఏమంటావు రాకేష్‌.


రాకేష్: మే బీ యువర్‌ రైట్‌ అంకుల్‌ ..


అభయ్‌: ఏంటో ఫ్రెండ్‌ దేరీజ్‌ నో లాజిక్‌


జెండే: సింపుల్‌ లాజిక్‌ అభయ్‌.. చెడ్డవాడు ఎప్పటికైనా మంచివాడి ముందు ఓడిపోవాల్సిందే..


అంటూ జెండే చెప్పగానే రాకేష్‌.. జెండే సారు మీరు చాలా స్ర్టాంగ్‌ కదా ఇన్నాళ్లు మీరు ఆ జలంధర్‌ కొడుకును ఎందుకు పట్టుకోలేదు అని అడుగుతాడు. దీంతో జెండే వాడు త్వరలోనే దొరుకుతాడని చెప్తాడు. మరోవైపు గౌరి, శంకర్‌ చేసిన హెల్ఫ్‌ గుర్తు చేసుకుంటుంది.  శంకర్‌ తన పక్కనే ఉన్నట్లు కలగంటూ లేవండి వెళ్లిపోండి అంటూ సంధ్య, శ్రావణిలను తోస్తుంది. ఇద్దరూ లేచి గౌరిని నిద్రలేపుతారు ఏమైందని అడుగుతారు. మీరు గురుక పెడుతున్నారు అందుకే అంటూ చెప్పి మళ్లీ పడుకుంటుంది. వెంటనే మళ్లీ గౌరికి తన పూర్వజన్మ కలలో గుర్తుకువస్తుంది. వెంటనే షాకింగ్‌ గా లేస్తుంది. వెంటనే శ్రావణి, సంధ్య నిద్ర లేస్తారు.


శ్రావణి: అక్కా ఏదైనా పీడ కల వచ్చిందా?


గౌరి: కాదే శంకర్‌ గారు కలలో  


శ్రావణి: కలలో ఏం  చేశారు అక్కా..


గౌరి: ఒక పెద్ద బంగ్లాలో సూటు వేసుకుని చాలా హూందాగా పెద్ద బిజినెస్‌ మాన్‌ లాగా కోటీశ్వరుడిలా కనిపించాడే..


శ్రావణి: అవునా  శంకర్‌ గారు అలా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావేమో..? అందుకే నీకు ఆ కల వచ్చింది.


అంటూ ముగ్గురు శంకర్‌ గురించి మాట్లాడుకుంటారు.  మరోవైపు శంకర్‌ కూడా సేమ్‌ కల కంటాడు. ఉలిక్కిపడి నిద్ర లేస్తాడు. ఇంతలో బయట ఒక సాధువు వచ్చి అమ్మదీవెన, అయ్యా ఆశీర్వాదం అంటూ చెప్తూ గేటు ముందు నిలబడి చెప్తుంటాడు. గౌరి, శంకర్‌ బయటకు వచ్చి వింటుంటారు. నిన్న మొన్న గండం తప్పింపోయింది. త్వరలోనే కొత్త ఊరికి ప్రయాణం. ఊరు మారితేనే జీవితాలు మారతాయి అని చెప్పి వెళ్లిపోతాడు.  శంకర్‌ కిందకు వస్తాడు. గౌరితో మీరు ఎక్కడికికైనా వెళ్లడానికి ప్లాన్‌ చేసుకున్నారా? అని వెటకారంగా అడుగుతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  


ALSO READ:  ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కనకం ఇంటికి వచ్చిన రాజ్‌ – యాక్టింగ్‌ ఇరగదీసిన కనకం