Jagadhatri  Serial Today Episode:   ఈ విగ్రహంపై వాళ్ల కన్ను పడకుండా ఉండాలంటే మనం జేడీ, కేడీ ల పేరుతో రంగంలోకి దిగాలి అని అనుకుంటారు ధాత్రి, కేదార్‌. తర్వాత బ్యాంకు మేనేజర్ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఆలోచిస్తుంది కౌషికి. వైజయంతి వచ్చి ఏం ఆలోచిస్తున్నావని అడుగుతుంది. ఆ లాకెట్ గురించి ఆలోచిస్తున్నాను అని నాన్న గారు ఆ లాకెట్‌ అంత జాగ్రత్తగా దాచాడు అంటే అందులో ఉన్నది కేదార్‌ వాళ్ల అమ్మే అనిపిస్తుంది. నాకెందుకో కేదార్‌ వారసుడే అనిపిస్తుంది అని కౌషికి చెప్పగానే నిషికి తిడుతుంది. నువ్వు వాళ్లకు సపోర్టు చేస్తే మా ఆయన్ని మామగారిని అవమానించినట్టే అంటుంది. దీంతో కౌషికి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

వైజయంతి: ఈ పొద్దు ఆ లాకెట్‌ లో ఉన్నది ఎవరో చూపస్తామన్నారు కదా? అప్పటి వరకు చూద్దాం.

యువరాజ్‌: ఆ లాకెట్‌ లో ఉండేది ఆ కేదార్‌ గాడి అమ్మ అయితే అప్పుడేం చేస్తావు అమ్మా..

వైజయంతి: అదే చెప్తా ఉండాను కదా అబ్బోడా.. అప్పుడు ఆలోచిద్దాం. అప్పటి వరకు గమ్మున ఉందాం..

తర్వాత సత్యప్రసాద్‌ వస్తాడు.

కమలాకర్‌: బావగారు ఏంటి ఈ సడన్‌ సర్‌ప్రైజ్‌..

సత్యప్రసాద్‌: రెండు రోజుల్లో పెళ్లి పనులు ప్రారంభిస్తున్నాము కదా. ఒక సారి కలిసి వెళ్దాం అని వచ్చాను. అలాగే కోడలిని ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను.

వైజయంతి: అంటే కోడలిని మాత్రమే చూసి వెళ్తారా…? అన్నయ్యగారు.

సత్యప్రసాద్‌: అయ్యయ్యో అదేం కాదమ్మా..

కమలాకర్‌: బావగారు కాబోయే కోడలును తర్వాత చూద్దురు కానీ ముందు మేము మీతోటి ఒకటి మాట్లాడాలి పైకి వస్తారా..?

అందరూ కలిసి పైకి వెళ్తారు.

సత్యప్రసాద్‌: ఏంటి కమలాకర్‌ ..?

కమలాకర్‌: బావగారు మీరు మాకో సాయం చేయాలి.

సత్యప్రసాద్‌: ఎదరుకట్నం ఇవ్వాలా.. ఏంటి..?

కమలాకర్‌: అది కాదు బావగారు మా మధుకర్‌ అన్నయ్య చేసిన నిర్వాకం వల్ల ఒక విలువైన వస్తువు ఆ కేదార్‌ చేతికి వెళ్లాయి. అందులో కేదార్‌ జన్మ రహస్యానికి చెందిని ఆధారాలు ఉన్నాయి.

యువరాజ్‌: అది కనక కౌషికి అక్క చేతికి చేరితే.. వాడు నాన్న కొడుకే అని తేలితే.. మేమంతా కేరఫ్‌ పుట్‌పాత్‌ అయిపోతాం. వాడు మాత్రం ఈ వజ్రపాటి వారసుడు అయిపోతాడు.

కమలాకర్‌: బావగారు మీరే ఏదో ఒకటి చేసి వాడి దగ్గర ఉన్న లాకెట్‌ ను మాకు చేరేలా చేయండి. లేదంటే మేమంతా రోడ్డున పడిపోతాం.

యువరాజ్‌: ఎలాగైనా మాకు ఆ లాకెట్ కావాలి మామయ్యగారు.

అని అందరూ చెప్పగానే వాడు ఆ ఇంటి వారసుడు కావడం మీకే కాదు.. నాకు ఇష్టం లేదు. మీరేం టెన్షన్‌ పడకండి ఆ లాకెట్ మీ చేతిలో పెట్టే బాధ్యత నాది అని చెప్తాడు. తర్వాత కేదార్, ధాత్రి లాకెట్‌ తీసుకుని బయటకు వెళ్తుంటే సత్యప్రసాద్ వెళ్లి మీతో ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చానని గార్డెన్‌లోకి తీసుకెళ్తాడు.

సత్యప్రసాద్‌: మీ చెల్లెలి కోసం నేను అడిగింది ఒకటి ఇవ్వాలి.

కేదార్‌: ఏం కావాలి సార్‌..

సత్యప్రసాద్‌: మీ దగ్గర ఉన్న లాకెట్‌ కావాలి. మీ చెల్లెలి కోసం నువ్వు ఇచ్చే కట్నం అనుకో కానుక అనుకో నాకు మాత్రం ఆ లాకెట్ కావాలి.

ధాత్రి: ఈ లాకెట్ ఏంటో మీకు తెలుసా.. సార్‌. ఎంతో కాలం నుంచి కేదార్‌ వెతుకుతున్న జన్మ రహస్యం సార్‌ ఇది. కేదార్‌ నాన్న ఎవరో తెలిపే సాక్ష్యం ఇది.

కేదార్‌: అవును సార్‌ ఇది నా ప్రాణం కంటే ఎక్కువ సార్‌.

సత్యప్రసాద్‌: మీ చెల్లెలి జీవితం కంటే ఎక్కువ..?

కేదార్‌: నా చెల్లెలి జీవితం కంటే ఎక్కువేం కదా సార్‌. కానీ నా చెల్లెలి జీవితం కోసం నా ప్రాణాలైనా ఇస్తాను.

 అని చెప్తుండగానే నిషిక వచ్చి ఆ లాకెట్ మీరెలా అడుగుతున్నారు అంటుంది. చెల్లెలు అంటూ ప్రేమ ఉందన్నాడు కదా? అని సత్యప్రసాద్‌ చెప్పగానే అంత ప్రేమ ఉంటే ఇచ్చేవాడు అంటుంది. దీంతో కేదార్‌ నా చెల్లెలు కన్నా నాకు ఏది ఎక్కువ కాదు అంటూ లాకెట్‌ సత్యప్రసాద్‌కు ఇస్తాడు. ఆ లాకెట్ తీసుకుని వెళ్లి వైజయంతికి ఇస్తాడు సత్యప్రసాద్‌. ఇంతటితో ఇవాల్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!